Stock Market News Updates Today in Telugu: గ్లోబల్ మార్కెట్ల ప్రభావం ఇండియన్‌ స్టాక్ మార్కెట్లపై గట్టిగా పడింది. మన స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు (బుధవారం, 11 సెప్టెంబర్‌ 2024) స్థిరంగా ప్రారంభమైంది. బిజినెస్‌ ప్రారంభంలో, బ్యాంక్ నిఫ్టీలో క్షీణత కనిపించింది. ఆటో, పీఎస్‌యు బ్యాంక్ వంటి రంగాల సూచీలు కూడా బలహీనంగా ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే.. ఐటీ షేర్లు పెరగడం వల్ల ఐటీ ఇండెక్స్‌ నుంచి మార్కెట్‌కు భరోసా లభించింది. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, వెంటనే పుంజుకుని 5 నిమిషాల్లోనే అర శాతానికి పైగా లాభాల్లోకి వచ్చింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (మంగళవారం) 81,921 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 6.83 పాయింట్ల నామమాత్రమైన పెరుగుదలతో 81,928 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 25,041 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 25,034 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు బ్యాంక్ నిఫ్టీ క్షీణించినప్పటికీ, ప్రారంభమైన 15 నిమిషాల్లోనే అది మలుపు తిరిగి గ్రీన్‌ జోన్‌లోకి వచ్చింది. FMCG సెక్టార్‌లో బ్రిటానియా యమా బుల్లిష్‌గా ఉంది. ITC దాదాపు ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌ నుంచి మార్కెట్‌కు ప్రోత్సాహం లభించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ ఇండెక్స్ కూడా దీనికి తోడైంది. అయితే.. నిఫ్టీ ఆటో టాప్‌ లూజర్‌గా నిలిచింది.


టాటా మోటార్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముడి చమురు ధరల్లో పతనంతో ONGC కూడా లోయర్‌ లెవెల్స్‌లోకి వెళ్లింది. నిన్న (మంగళవారం) మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన క్రూడాయిల్ ధరలు ఈ రోజు కాస్త పుంజుకున్నాయి. మంగళవారం 3 శాతానికి పైగా పడిపోయిన తరువాత, ఈ రోజు, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.52 శాతం పెరిగి 69.55 డాలర్లకు చేరుకుంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WIT) క్రూడ్ బ్యారెల్‌కు 0.61 శాతం పెరిగి 66.15 డాలర్లకు చేరుకుంది.


ఈ రోజు ఉదయం 10.10 గంటలకు, BSE సెన్సెక్స్ 46 పాయింట్లు లేదా 0.05% తగ్గి 81,875 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 12 పాయింట్లు లేదా 0.04% స్వల్ప నష్టంతో 25,029 దగ్గర ట్రేడవుతోంది.


గ్లోబల్‌ మార్కెట్లు


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీదార్లు కమలా హారిస్ - డొనాల్డ్ ట్రంప్‌ మధ్య డిబేట్‌పై గ్లోబల్‌ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. అంతేకాకుండా, ఈ సంవత్సరం US సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గింపులు, ఫ్రీక్వెన్సీ గురించి మరింత స్పష్టతను అందించే CPI ఇన్‌ఫ్లేషన్‌ డేటా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 18న ఫెడ్‌ నిర్ణయం వెలువడుతుంది.


ఆసియా స్టాక్స్‌ ఈ రోజు కుదేలయ్యాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ 225 0.7 శాతం క్షీణించగా, టోపిక్స్ 0.86 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా కోస్పి 0.20 శాతం తగ్గితే, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 1.61 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 స్వల్పంగా మెరుగుపడితే, హాంగ్ కాంగ్‌కు చెందిన హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కిందకు దిగి వచ్చాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.