Chandrababu  got the favor of the middle class : ప్రకృతి విపత్తు వచ్చింది. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ ఆ విపత్తు వల్ల వచ్చే నష్టాన్ని మాత్రం వీలైనంత వరకూ తగ్గించాలి. ముందుగా ప్రాణ నష్టాన్ని తర్వాత ఆస్తి నష్టాలను వీలైనంత వరకూ తగ్గించాలి. ఇందు కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏటికి ఏదురీదాలి. బుడమేరు ముంపు ముంచెత్తిన సమయంలో ఉన్న కొద్ది సమయంలోనే చేయగలిగినంత రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. తర్వాత ఇక చేయాల్సింది సహాయ చర్యలు. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పూర్తిగా మధ్యతరగతి ప్రజల మనస్థత్వం మేర ఆలోచించి.. వారి కష్టాలను తీర్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆయన ప్రజల అభిమానాన్ని  పొందుతున్నారు. 


ఇళ్లను కడిగించాలనే ఆలోచన హైలెట్ 


వరద వచ్చింది..  రెండు రోజులకో.. మూడు రోజులకే పోయింది. కానీ వచ్చింది వచ్చినట్లు పోదు. తీసుకెళ్లివి తీసుకెళ్తంది.. వదిలి పెట్టేది వదిలి పెడుతుంది. ఎంత విలువైన వస్తువులు తీసుకెళ్లి .. వదిలి పెట్టేది మాత్రం బురదనే. ఆ బురదను కడుక్కోవడం  అంత తేలిక కాదు. ఈ సమస్యను చంద్రబాబు ముందుగానే గుర్తించారు. రాత్రికి రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైరింజన్లను.. వేల మంది పారిశుద్ధ్య కార్మికులను విజయవాడరు కప్పించారు. కొన్ని వేల ఇళ్లను శుభ్రం చేయించారు. రోడ్లపై బురదను తీసేయిస్తున్నారు. కనీసం 40 వేల ఇళ్లను ఇప్పటి వరకూ శుభ్రం చేయించారు. ఇది చాలా మంది  ప్రజల్ని.. ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచించిందని అనుకోవడానికి అవకాశం కల్పించింది. 


ఆఫ్రికాలో ఇప్పుడు కనిపించే కరవును ఎప్పుడో చూసిన విజయవాడ- ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం వెనుక లక్షల మంది చావు ఉందా?


ఆర్థిక నష్టాన్ని వీలైనంతగా భర్తీ చేసే ఆలోచన


వరద వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోయాయి.. బైకులు రిపేర్లకు వచ్చాయి. ఈ రెండు మధ్యతరగతి ప్రజలకు అతి పెద్ద సమస్యలు. వాటిని రిపేర్లు చేయించుకోలేరు.. కొత్తవి కొనుక్కోలేరు. ఇంకా చెప్పాలంటే చాలా వస్తువులకు ఇంకా ఈఎంఐలు కూడా ఉంటాయి. చంద్రబాబు ఇక్కడ కూడా మధ్యతరగతి మనస్థత్వంతో ఆలోచించారు. వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడారు. వస్తువులకు, బైకులకు ఇన్సూరెన్స్ లు ఉంటే.. వంకలు పెట్టకుండా క్లెయిమ్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కౌంటర్లు ఏర్పాటు చేసేలా చేశారు. ఎల్జీ కంపెనీ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఉచిత సర్వీస్ .. విడిభాగాలపై యాభై శాతం రాయితీని ప్రకటించింది. బైక్ మెకానిక్‌లు ఇంటి వద్దకే వచ్చి రేపర్ చేస్తున్నారు. ఇక నెలకు సరిపడా వంట సామాగ్రి పంపిణీ చేశారు. 


'లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ కుట్ర' - మంత్రి నారా లోకేశ్ సంచలన ట్వీట్


నష్టపరిహారం కూడా ! 


ఇలా ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగినంత  సాయం చేసిన తర్వాత.. ఫైనల్ గా నష్టపరిహారం కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమయింది. ఇంటింటికి తిరిగి నష్టపరిహారాన్ని  ప్రభుత్వ సిబ్బంది నమోదు చేసుకుంటున్నారు. వారికి జరిగిన నష్టం మొత్తం కాకపోయినా.. ఎంతో కొంత సాయం చేసి ఆదుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ నెలలోనే పరిహారాన్ని కూడా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇప్పుడు విజయవాడలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు వరదల్లో వచ్చిన కష్టం.. చంద్రబాబుపడిన శ్రమ.. చేసిన సాయం ఖచ్చితంగా ప్రజలకు గుర్తుంటుంది.  గత ప్రభుత్వం విపత్తుల్లో వ్యవహరించిన తీరుతో పోలిస్తే ఈ ప్రభుత్వం వంద శాతం ప్రజలకు దగ్గరగా  ఉందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లే అనుకోవచ్చు.