Stock market news in Telugu: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మరో అద్భుతమైన మైలురాయిని దాటింది. ఒక్కో అడుగు వేయడానికి ఎమర్జింగ్‌ మార్కెట్లు ఆయాసపడుతుంటే, భారతీయ ఈక్విటీలు బర్రున దూసుకెళ్లాయి. మదుపర్ల సంపదగా పరిగణించే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లోని అన్ని లిస్టెడ్‌ కంపెనీల విలువ ‍‌(market capitalization of all BSE-listed companies 2023) కీలకమైన మార్క్‌ను చేరుకుంది.


బుధవారం (29 నవంబర్‌ 2023), BSEలోని అన్ని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ $4.01 ట్రిలియన్లు లేదా రూ.333 లక్షల కోట్లను ‍‌(Indian stock market cap $4.01 trillion) టచ్‌ చేసింది. 2023 ప్రారంభం నుంచి 600 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది.


గత రికార్డ్‌లు
BSE-లిస్టెడ్ సంస్థలు, 2007 మే నెలలో తొలిసారిగా 1 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్ మైలురాయిని చేరాయి. అ తర్వాత పదేళ్లకు, 2017 జులైలో 2 ట్రిలియన్ డాలర్ల స్టేజ్‌కు చేరాయి. ఇక్కడ మరో అద్భుతం జరిగింది, కేవలం నాలుగు సంవత్సరాల్లోనే మరో లక్ష ట్రిలియన్‌ డాలర్లను జోడించి, 2021 మే నెలలో 3 ట్రిలియన్‌ డాలర్లను అధిగమించాయి.


ప్రపంచంలో టాప్‌-5 స్టాక్‌ మార్కెట్లు (Top 5 Stock Markets in the World)
మార్కెట్ విలువ పరంగా, ప్రపంచ మార్కెట్లలో భారతీయ స్టాక్ సూచీలు ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నాయి. అమెరికన్ మార్కెట్లు 47 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌తో ( US stock market cap $47 trillion) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. ఆ తర్వాత, చైనా 9.7 ట్రిలియన్‌ డాలర్లతో (China stock market cap $9.7 trillion) సెకండ్‌ ప్లేస్‌లో, జపాన్ 5.9 ట్రిలియన్‌ డాలర్ల విలువతో (Japan stock market cap $5.9 trillion) థర్డ్‌ ర్యాంక్‌లో, హాంకాంగ్ 4.8 ట్రిలియన్‌ డాలర్లతో (Hong Kong stock market cap $4.8 trillion) నాలుగో స్థానంలో ఉన్నాయి.


బుధవారం ఇండియన్‌ ఈక్విటీలు భారీగా పెరిగాయి. నిఫ్టీ 200 పాయింట్లకు పైగా, సెన్సెక్స్‌ 700 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. 2024 మార్చి నాటికి, US ఫెడ్‌ వడ్డీ రేట్ల కోతలను ప్రారంభిస్తుందన్న అంచనాలతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) షేర్లు దౌడు తీశాయి, నిఫ్టీ ఐటీ 1.5 శాతం పెరిగింది. తమ మొత్తం ఆదాయంలో యుఎస్ నుంచే ఎక్కువ వాటాను ఇండియన్‌ ఐటీ కంపెనీలు సంపాదిస్తాయి. 


నిఫ్టీ ఇండెక్స్‌ కూడా, రెండు నెలల తర్వాత, మళ్లీ 20,000 మార్క్‌ను దాటింది. అంతకుముందు, 2023 సెప్టెంబర్ 20న తొలిసారిగా నిఫ్టీ50 ఇండెక్స్ 20,000 మార్క్‌ను టచ్‌ చేసింది.


నిఫ్టీ ఇండెక్స్‌ 20,000 మానసిక స్థాయిని దాటడం, BSE మార్కెట్ క్యాప్ $4 ట్రిలియన్ మార్కుకు ఎగబాకడం ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని, మార్కెట్‌లో ఊపును పెంచింది. ప్రి-ఎలక్షన్‌ ర్యాలీ మార్కెట్‌కు ప్రధాన ట్రిగ్గర్‌గా ఉంటుందని, నిఫ్టీ త్వరలో 21,000 మార్క్‌ను కూడా ఓవర్‌టేక్‌ చేస్తుందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం, నిఫ్టీకి 19,500 స్థాయి వద్ద సపోర్ట్ ఉంది.


మరోవైపు... ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) వైఖరి మారడం కూడా మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. రెండు నెలల పాటు నెట్‌ సెల్లర్స్‌గా ఉన్న ఎఫ్‌పీఐలు, ఈ నెలలో నెట్‌ బయ్యర్స్‌గా మారారు. ఈ నెలలో 28వ తేదీ నాటికి రూ.2,901 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply