Prema Entha Madhuram November 30th Episode: అను ఫోటోని చూసిన ఆర్య కంగారుపడుతూ ఈమె నీకు తెలుసా? ఈమెను ఎక్కడైనా చూసావా? ఆమె ఇక్కడ ఉందా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షం కురిపిస్తాడు.
ఉష : ఇదేంటి ఇంత కంగారు పడుతున్నాడు నిజం చెప్తే ఏం జరుగుతుందో అనుకొని లేదన్నయ్య గుడిలో దొరికింది.. నిన్ను టీజ్ చేద్దామని తీసుకువచ్చాను. అయినా ఈ అమ్మాయి నీకు తెలుసా అని అడుగుతుంది.
ఆర్య: నాకు తెలియదు, నువ్వు వెళ్లి ఆటోలో కూర్చో నేను వెళ్లి ప్రసాదం తీసుకువస్తాను అని గుడిలోకి వెళ్లి పంతులు గారిని కలిసి అను ఫోటో చూపించి ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూసారా అని అడుగుతాడు.
పంతులుగారు : ఈ అమ్మాయి అప్పుడప్పుడు గుడికి వస్తుంది కార్తీకమాసం కదా ప్రతి సోమవారం వచ్చి దీపాలు వెలిగిస్తుంది. ఈ అమ్మాయి మీకు తెలుసా?
ఆర్య : ఈమె నా భార్య, కొన్ని కారణాల వల్ల విడిగా ఉంటుంది. ఈ గుడికి వస్తుందని తెలిసి కనుక్కుందామని వచ్చాను.
పంతులుగారు: కంగారు పడకు రేపు కార్తీక పౌర్ణమికి ఆమె తప్పకుండా వస్తుంది అని చెప్పటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.
తర్వాత ఆర్య, ఉష ఇంటికి రావడం గమనించిన పిల్లలిద్దరూ హోంవర్క్ ని అక్కడే వదిలేసి ఆర్యతో కబుర్లలో పడిపోతారు.
ఉష : అను దగ్గరికి వెళ్లి మీకు మా అన్నయ్య ముందే తెలుసా
అను : కంగారుపడుతూ నువ్వే చెప్పావు కదా మీ అన్నయ్య ఈ మధ్యనే దుబాయ్ నుంచి వచ్చాడని మరి నాకు ఎలా తెలుస్తుంది అయినా ఎందుకు అలా అడిగావు.
ఉష : ఏమీ లేదు మీ ఫోటో మా అన్నయ్యకు చూపిస్తే కంగారు పడిపోయాడు.. మీరేమో మా అన్నయ్య మిమ్మల్ని చూడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అందుకే మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని అడిగాను అంటూ.. మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా, మా అన్నయ్యని పెళ్లి చేసుకోండి అప్పుడు అందరూ ఇదే ఇంట్లో ఉండవచ్చు.
అను: కంగారుపడుతూ నేను కొన్ని కారణాలవల్ల మా ఇంటికి దూరంగా ఉంటున్నాను దయచేసి కారణాలు మాత్రం అడగొద్దు అయినా ఈ ఫోటోలో ఉన్నది నేనే అని మీ అన్నయ్యకి చెప్పావా అని అడుగుతుంది.
ఉష : లేదు, మీ ఫోటో తీసుకెళ్లి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. అను, ఆర్యలని ఇద్దరినీ చూస్తూ కచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటుంది.
మరోవైపు జైల్లో ఉన్న జలంధర్ కి భోజనంలో ఫోన్ పెట్టి ఇస్తాడు కానిస్టేబుల్. ఆ ఫోన్ తో చెల్లెలికి ఫోన్ చేస్తాడు.
ఛాయాదేవి: ఎలా ఉన్నావ్ అన్నయ్య.
జలంధర్: ఒళ్లంతా గాయాలతో ఆడవాళ్ళతో దెబ్బలు తిని పగతో రగిలిపోతున్నాను.
ఛాయాదేవి: నీ పగ నేను తీరుస్తాను, ఎలా అయినా ఆ ల్యాండ్ సొంతం చేసుకుంటాను.
జలంధర్: ఇప్పుడు మనకి కావలసింది ఆ ల్యాండ్ కాదు. నన్ను ఇంత అవమానపరిచిన ఆర్య, వాడి కుటుంబం బ్రతకడానికి వీల్లేదు.
ఛాయాదేవి: అలాగే అన్నయ్య వాళ్ళని చంపేద్దాం.
జలంధర్: మన చేతికి మట్టి అంటకూడదు.. నువ్వు ఏమి చేయకు నేను బీహార్ నుంచి మనుషుల్ని రప్పిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
మరోవైపు ఇడ్లీ తినను అని పేచి పెడుతున్న అక్కిని బుజ్జగించి ఇడ్లీ తినిపిస్తాడు ఆర్య. ఆ తర్వాత ఉష పిల్లలిద్దరికీ క్యారేజీ రెడీ చేస్తుంది.
ఆర్య : సరే స్కూల్ కి టైం అవుతుంది బయలుదేరుదామా
అక్కి: బైక్ దగ్గరికి వెళ్లే వరకు ఉప్పు మూట ఎత్తుకో ఫ్రెండ్ అనడంతో వీపు మీద ఎక్కించుకుంటాడు ఆర్య.
అప్పుడు అక్కి చైన్ ఆర్య షర్ట్ కి చిక్కుకుంటుంది. ఉష ఆ చిక్కు విప్పటంతో పిల్లల ఇద్దరినీ బండిమీద ఎక్కించుకొని స్కూల్ కి తీసుకు వెళ్తాడు ఆర్య.
తర్వాత షాప్ కి వెళ్ళటం కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది అను. అప్పుడే సోది చెప్పే ఆవిడ వస్తూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply