Stock Market News In Telugu: కొన్ని బ్రోకింగ్‌ కంపెనీ ఈ దీపావళి కోసం కొనదగిన స్టాక్స్‌ పేర్లను రిలీజ్‌ చేశాయి. ప్రస్తుత మార్కెట్ల పరిస్థితి, ఔట్‌లుక్‌ అంచనాల ఆధారంగా రికమెండేషన్స్‌ చేశాయి. రియల్ ఎస్టేట్, ఆటో, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ వంటి రంగాల్లోని స్మాల్‌ & మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఆ పేర్లలో ఉన్నాయి.


స్మాల్‌ & మిడ్‌ క్యాప్స్‌లో దీపావళి స్టాక్స్‌:


బ్రోకరేజ్‌ పేరు: ప్రభుదాస్ లీలాధర్


గ్రీన్‌ప్యానెల్ ఇండస్ట్రీస్ | CMP: రూ. 327 | టార్గెట్ ధర: రూ. 464
FY23-26 కాలంలో సామర్థ్యాన్ని 35%, పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తృతంగా పెంచుకోవాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో, FY25 నుంచి మెరుగైన వృద్ధి, మార్జిన్లను బ్రోకరేజ్‌ ఆశిస్తోంది.


RR కాబెల్ | CMP: రూ 1619 | టార్గెట్ ధర: రూ 1624
RR కాబెల్ చేతిలో విభిన్న ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో, నిర్మాణాత్మక సామర్థ్య విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. డీలర్లు/పంపిణీ నెట్‌వర్క్, ఎగుమతి వ్యాపారం పెరుగుతున్నాయి. బలమైన బ్రాండ్‌ వల్ల W&C విభాగంలో ఈ కంపెనీకి అనేక అవకాశాలు ఉన్నట్లు బ్రోకరేజ్‌ చెబుతోంది.


సన్‌టెక్‌ రియాల్టీ | CMP: రూ. 453 | టార్గెట్ ధర: రూ 565
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని (MMR) వివిధ మైక్రో మార్కెట్లలో అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్ట్‌లు, దూకుడైన వ్యాపారం, భూ సేకరణ సామర్థ్యాలతో.. అధిక విలువ కలిగిన ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌ నుంచి ఈ కంపెనీ లాభపడగలదని బ్రోకరేజ్‌ పేర్కొంది.


బ్రోకరేజ్‌ పేరు: నిర్మల్ బ్యాంగ్


ఎల్కాన్ ఇంజనీరింగ్ | CMP: రూ. 900 | టార్గెట్ ధర: రూ 1050
FY23–25 కాలంలో, ఈ కంపెనీ ఆదాయం & లాభాల్లో 25% & 32% CAGR గ్రోత్‌ను బ్రోకరేజ్‌ ఆశిస్తోంది. బలమైన డిమాండ్ వల్ల ఇది సాధ్యమవుతుందని బ్రోకింగ్‌ కంపెనీ నమ్ముతోంది. దీంతోపాటు, ROCE FY23లోని 23% నుంచి FY25 నాటికి 32%కి పెరుగుతుందని అంచనా వేసింది.


ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ | CMP: 569 | టార్గెట్ ధర: రూ. 820
ఇండస్ట్రీ లీడింగ్‌ రిజల్ట్స్‌ను ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌ ప్రకటిస్తోంది. దీని ఔట్‌లుక్‌ ఆధారంగా రూ. 820 టార్గెట్‌ ధరను బ్రోకరేజ్‌ ప్రకటించింది.


విష్ణు కెమికల్స్ | CMP: రూ. 322 | టార్గెట్ ధర: రూ 421
ఈ కంపెనీ, FY23- FY25 కాలంలో దాదాపు 15% & 24% ఆదాయాలు & లాభాల వృద్ధితో.. బలమైన, స్థిరమైన పనితీరును ప్రదర్శిస్తుందని బ్రోకరేజ్‌ ఆశిస్తోంది.


బ్రోకరేజ్‌ పేరు:  విలియం ఓ'నీల్ ఇండియా


సంఘ్వి మూవర్స్ | CMP: రూ. 746
ఈ స్టాక్‌ను రూ. 756–794 పరిధిలో కొనవచ్చని బ్రోకింగ్‌ హౌస్‌ సూచించింది. విండ్ ఫామ్ ఇన్‌స్టాలేషన్‌ కోసం EPC వ్యాపారంలోకి ఈ కంపెనీ ప్రవేశిస్తోంది. EPC బిజినెస్‌కు తక్కువ మూలధనం అవసరం, అధిక ROE ఉంటుంది. ఇది కంపెనీ మొత్తం ROEని మెరుగుపరుస్తుందని బ్రోకరేజ్‌ భావిస్తోంది.


రైల్‌టెల్ | CMP: రూ 248
ఇండియన్ రైల్వేస్‌ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఈ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది. టెక్నికల్‌గా చూస్తే.. ఈ స్టాక్ ప్రస్తుతం స్టేజ్-2 కన్సాలిడేషన్ బేస్‌ను ఏర్పరుస్తోంది, దాని పైవట్ పాయింట్‌ నుంచి కేవలం 3% దూరంలోనే ఉంది.


బ్రోకరేజ్‌ పేరు: షేర్‌ఖాన్


బిర్లాసాఫ్ట్ | CMP: రూ 583
ERP, మౌలిక సదుపాయాల్లో బలమైన నాయకత్వం కారణంగా బిర్లాసాఫ్ట్ డిజిటల్ & డేటా బిజినెస్‌లో వృద్ధి వేగం పెరుగుతుందని బ్రోకరేజ్‌ లెక్కగట్టింది. 


భారత్ ఫోర్జ్ | CMP: రూ 1034
ఈ కంపెనీ ఒకవైపు అంతర్గతంగా సామర్థ్యాలను పెంచుకుంటూనే, మరోవైపు ఇన్‌-ఆర్గానిక్‌ వృద్ధి అవకాశాల ద్వారా బలంగా ఎదుగుతోందని బ్రోకరేజ్‌ భావిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ధన్‌తేరస్‌ ఎఫెక్ట్‌తో గోల్డెన్‌ జంప్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial