High Dividend Stocks: స్టాక్‌ మార్కెట్‌ ఒక అల్లకల్లోల సముద్రం లాంటిది. మనం చూస్తుండగానే స్టాక్‌ ధరలు కెరటాల్లా ఉవ్వెత్తున పెరుగుతాయి, అంతలోనే విరిగి పడుతుంటాయి. ఇలాంటి అస్థిర పరిస్థితుల మధ్య మునిగి పోకుండా షేర్‌హోల్డర్లకు రక్షణ కల్పించే మార్గం ఒకటి ఉంది. అదే.. డివిడెండ్‌ స్టాక్‌. 


అస్థిర మార్కెట్‌లోని ఆటుపోట్ల మధ్య పెట్టుబడిదార్లు ఇబ్బంది పడకుండా, అధిక డివిడెండ్ చెల్లించే స్టాక్స్‌ సహాయపడతాయి. ప్రత్యేకించి, అధిక వడ్డీ రేట్లు, ప్రపంచ మార్కెట్ల టెండ్స్‌ బలహీనంగా ఉన్న ఇలాంటి సమయాల్లో స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు అవి ఎంతో కొంత రక్షణ కల్పిస్తాయి. డివిడెండ్‌ స్టాక్స్‌ కోసం బడా ఇన్వెస్టర్లు పోటీలు పడుతుంటారు, డివిడెండ్స్‌ మీదే వాళ్ల వ్యక్తిగత ఖర్చుల్ని లాగిస్తుంటారు. అలాంటి హై డివిడెండ్‌ స్టాక్స్‌ను మీ పోర్ట్‌ఫోలియోలో కూడా ఉండాలి అని మీరు అనుకుంటే, FY24 కోసం 10 కంపెనీలను మార్కెట్‌ ఎక్స్‌పర్ట్‌లు సూచించారు.


FY24 కోసం హై డివిడెండ్‌ స్టాక్స్‌:


హిందుస్థాన్ జింక్ (Hindustan Zinc): గత 12 నెలల్లో ఒక్కో ఈక్విటీ షేర్‌కు మొత్తం రూ. 75.50 డివిడెండ్ చెల్లించింది. మార్కెట్‌లో 25.7% అత్యధిక డివిడెండ్ ఈల్డ్‌ ఈ కంపెనీ షేర్లదే.


సనోఫీ ఇండియా (Sanofi India): గత 12 నెలల్లో ఒక్కో ఈక్విటీ షేరుకు మొత్తం రూ. 75.50 డివిడెండ్ చెల్లించింది. ఈ కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 11.9%.


REC: ఈ ఇన్‌ఫ్రా ఫైనాన్స్ కంపెనీ గత 12 నెలల్లో ఒక్కో షేరుకు రూ.13.05 చొప్పున ఈక్విటీ డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 11.3%


కోల్ ఇండియా (Coal India): గత 12 నెలల్లో, ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.23.25 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 10.9%.


స్వరాజ్ ఇంజిన్స్‌ (Swaraj Engines): గత 12 నెలల్లో ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 80 డివిడెండ్‌ను స్వరాజ్ ఇంజిన్స్ చెల్లించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 10.4%.


హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (HUDCO) : హడ్కో గత 12 నెలల్లో ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 3.50 మొత్తం డివిడెండ్ ప్రకటించింది. డివిడెండ్ ఈల్డ్‌ 9.8%.


గెయిల్ (GAIL): గత 12 నెలల్లో, ప్రభుత్వ యాజమాన్యంలోని గెయిల్ (ఇండియా) ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ. 5 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 9.5%.


VST ఇండస్ట్రీస్‌ (VST Industries): గత 12 నెలల్లో ఒక్కో ఈక్విటీ షేరుపై మొత్తం రూ. 140 డివిడెండ్ చెల్లించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 8.9%.


ఆయిల్ ఇండియా ‍‌(Oil India): గత 12 నెలల్లో ఒక్కో ఈక్విటీ షేర్‌కు మొత్తం రూ. 19.50 డివిడెండ్‌ను ఆయిల్ ఇండియా ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 7.7%.


రైట్స్‌ (Rites): గత 12 నెలల్లో రైట్స్ ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.18 డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 7.2%.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.