రాజ్యలక్ష్మి బసవయ్య మాట్లాడుకుంటూ ఉంటే ప్రియ అప్పుడే అటుగా వచ్చి వాళ్ళని చూస్తుంది. ఆ దద్దోజనం గాడికి చెత్త మనిషిని తీసుకొచ్చి కట్టబెడతావు అనుకుంటే డాక్టర్ ని తీసుకొచ్చి కట్టబెడుతున్నావ్ ఏంటని అడుగుతాడు. ప్రియని కోడలి చేసుకోవడం వదిలించుకోలేని తప్పు దివ్యని కోడలిని చేసుకోవడం దాని తుప్పు వదిలించడానికి వేసిన ఎత్తు. ప్రియ మీద కన్నా దాన్ని ఈ ఇంటి కోడల్ని చేసిన దివ్య మీద పగ. విక్రమ్ ని అడ్డం పెట్టుకుని దివ్య రోగం కుదురుస్తాను. రాజ్యలక్ష్మితో ఎందుకు పెట్టుకున్నానా అనుకోవాలి. దాన్ని ఉద్యోగంలో నుంచి తీయడం కాదు దాని జీవితంలో నుంచి సంతోషాన్ని తీసేయబోతున్నానని చెప్తుంది. ఆ మాటలు విన్న ప్రియ వెంటనే దివ్యకి విషయం చెప్పాలనుకుంటుంది.


Also Read: యష్ లైఫ్ లో వైఫ్ ఉండకూడదని అభిమన్యు స్కెచ్- గుండెలు పగిలేలా ఏడుస్తున్న వేద


పెళ్లి చూపులు సవ్యంగా జరిగిపోయాయని లాస్య తెగ హడావుడి చేస్తుంది. విక్రమ్ కూడా బాగా నచ్చాడని సింపుల్ గా పక్కింటి అబ్బాయిలా ఉన్నాడని నందు అంటాడు. పెళ్లి విషయంలో హెల్ప్ చేసినందుకు లాస్యకి దివ్య థాంక్స్ చెప్తుంది. పెళ్లి అనగానే దివ్య మొహం దిగులుగా పెట్టేస్తుంది. అసలు దురదృష్టం నాది, మా అమ్మానాన్న పీటల మీద కూర్చుని పెళ్లి చేయాలి, కన్యాదానం చేయాలి. అలాంటి అవకాశం అదృష్టం నాకు ఉంటుందా? ఇదేమి గొంతెమ్మ కోరిక కాదు కదా ఒక కూతురి కోరికని దివ్య బాధపడుతుంది. ఆ మాట విని నందు, తులసి చాలా బాధపడతారు. ప్రియ పని మనిషి కాంతమ్మ దగ్గర ఫోన్ తీసుకుని చేద్దామని అనుకుంటుంది. కానీ కాంతమ్మ ఫోన్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. దివ్యని ఎలాగైనా రక్షించాలనుకుని ప్రియ వెళ్ళి సంజయ్ ఫోన్ తీసుకుంటుంది.


రాజ్యలక్ష్మి వచ్చి దివ్య ఫోన్ నెంబర్ నన్ను చెప్పమంటావా అని ఎంట్రీ ఇస్తుంది. సంజయ్ ని బుట్టలో వేసుకుని ఇంట్లోకి అడుగుపెట్టావని చెంప పగలగొడుతుంది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి సంజయ్ తన జీవితాన్ని నాశనం చేశాడని ప్రియ చెప్తుంది. కోపం ఏమైనా ఉంటే తన మీద చూపించమని దివ్యని వదిలేయమని బతిమలాడుతుంది. కానీ రాజ్యలక్ష్మి మాత్రం తన జీవితం నాశనం చేసి తీరుతానని కోపంతో రగిలిపోతుంది. పొరపాటున ఇక్కడి సంగతులు దివ్యకి చేరితే తన ప్రాణాలకు ముప్పు తెస్తుందని రాజ్యలక్ష్మి బెదిరిస్తుంది. ఇది నా రాజ్యం, రాజ్యలక్ష్మి రాజ్యం. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని వార్నింగ్ ఇస్తుంది. తులసి పెళ్లి ఖర్చు గురించి రాసుకుంటూ ఉంటే అనసూయ తన నగలు తీసుకొచ్చి తన ముందు పెడుతుంది.


Also Read: కళావతిని వెనకేసుకొచ్చిన మిస్టర్ డిఫెక్ట్- స్వప్నని తీసుకురావడానికి వెళ్ళిన రాజ్


ఈ నగలు బరువు మోయలేనని అందుకే కోడలికి ఇస్తున్నానని అనసూయ చెప్తుంది. మీ కోడలు నేను కాదు లాస్య లోపల ఉందని అంటుంది. దివ్య పెళ్లి విషయంలో మేము భాగం ఉండాలని అనుకుంటున్నావ్ అందుకే ఈ నగలు ఇస్తున్నామని చెప్తారు కానీ తులసి మాత్రం వాటిని తీసుకోవడానికి ఒప్పుకోదు. పెళ్లి విషయం తనే చూసుకుంటానని తులసి అంటుంటే నందు వచ్చి దివ్య పెళ్లి ఖర్చు బాధ్యత తనదేనని చెప్తాడు. ఈ ఇంటి కోసం నువ్వు ఎంతో చేశావ్ అని అంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా దివ్య పెళ్లి బాధ్యత తనదేనని తులసి అంటే పెళ్లి ఖర్చు మాత్రం తనదేనని చెప్పేసి వెళ్ళిపోతాడు. లాస్య వచ్చి కూతురి పెళ్లి బాధ్యత అవకాశం ఇవ్వచ్చు కదా అని అంటుంది. అందరి కోరిక అదే అయితే అడ్డు చెప్పనని అంటుంది. స్వార్థంతో నిన్ను సపోర్ట్ చేశాను పెళ్లి తర్వాత దివ్య జీవితం సర్వనాశనం అవబోతోందని లాస్య మనసులో తెగ సంబరపడుతుంది.