స్టాక్ మార్కెట్లలో (Stock Market Updates) సోమవారం సైతం ఎలాంటి పాజిటివ్స్ కనిపించడం లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో నేడు సైతం సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ పతనమయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్ల (Sensex crashes over 1,400 points) మేర తగ్గింది. నిఫ్టీ సైతం 1600 పాయింట్ల దిగువకు పతనమైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 139 డాలర్లకు పుంజుకున్నాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు సైతం సైతం గరిష్ట ధరలు నమోదు చేస్తున్నాయి. ఆసియాలో షేర్లు 4 శాతం పడిపోయాయి.
ఉక్రెయిన్, రష్యా వార్ ఎఫెక్ట్..
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగడం, మరోవైపు రష్యా నుంచి దిగుమతులపై పలు దేశాలు నిషేధం విధించడం ప్రతికూల ఫలితాలన్నిస్తోంది. దాంతో సూచీలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. జూలై 2008 తరువాత ముడిచమురు బ్యారెల్ ధర గరిష్టానికి చేరుకుంది. 2020 ఆగస్టు తరువాత బంగారం ఔన్స్ ధర 2,000 డాలర్లకు చేరిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఉదయం నుంచే నష్టాలు..
నేటి ఉదయం 9.20 సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 52,932.22 పాయింట్లతో ట్రేడింగ్ మొదలుకాగా అంతలోనే 1,401.59 పాయింట్లు లేదా 2.58 శాతం పతనమైంది. నిఫ్టీ 15,851.30 పాయింట్లతో మార్కెట్ ప్రారంభం కాగా, 394.05 పాయింట్ల మేర నష్టపోయింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు విడులైతే దేశంలో ఇంధన ధరలు పరుగులు పెట్టే అవకాశం ఉందని అంచనా వేశారు.
కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ మార్కెట్ పరిస్థితులపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం LPG సబ్సిడీని ఇక భరించదని భావిస్తున్నట్లు తెలిపింది. డీజిల్ మరియు గ్యాసోలిన్‌పై ఎక్సైజ్ సుంకంలో లీటరుకు రూ. 10 కోత విధించినందున ఎక్సైజ్ ఆదాయం 20 బిలియన్ డాలర్లు తగ్గవచ్చు. కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ముడి చమురుతో పాటు అల్యూమినియం, రాగి, పామాయిల్, గోధుమల ధరలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయికి చేరాయి. జింక్ ధరలైతే ఏకంగా 15 ఏళ్ల గరిష్టానికి ఎగబాకాయి. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ధరలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరగనున్న మూడో రౌండ్ చర్చలపైనే అంతా ఫోకస్ చేస్తున్నారు.
పతనమైన మరిన్ని స్టాక్స్..
సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్ 5.71 శాతం నష్టతో రూ.6,211కి దిగిరాగా, మారుతీ సుజుకీ 5.74 శాతం క్షీణించి రూ.6,828.70కి పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, లార్సెన్ అండ్ టూబ్రో 4-5 శాతం మధ్య నష్టపోయాయి. గత కొన్నిరోజులుగా సెన్సెక్స్ నష్టాల బాటలో పయనిస్తోంది. ఈ రోజు మొత్తం 207 స్టాక్స్ తక్కువ పాయింట్లు, ధరలతో ట్రేడ్ అవుతున్నాయి.
Also Read: Gold-Silver Price: కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి నేడు స్థిరంగా - తాజా ధరలు ఇవీ