Stock Market Closing On 17 September 2024: వడ్డీ రేట్లకు సంబంధించి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల సమావేశం నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 17 సెప్టెంబర్ 2024) అప్రమత్తంగా వ్యవహరించాయి. మన స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు చాలా పరిమితంగా కనిపించాయి. అటు బుల్స్, ఇటు బేర్స్ ఎవరూ దూకుడుగా వ్యవహరించలేదు. అయితే... కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో మాత్రం కొనుగోళ్లు కనిపించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 90.88 పాయింట్లు లేదా 0.11% పెరిగి 83,079.66 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 34.80 పాయింట్లు లేదా 0.14% పెరిగి 25,418.55 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
పెరిగిన & పడిపోయిన షేర్లు
నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 30 ప్యాక్ బ్యాలెన్స్‌డ్‌గా క్లోజ్ అయింది. ఈ ఇండెక్స్‌లోని 15 స్టాక్స్ లాభాలతో ముగియగా, 15 నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ50 ప్యాక్ కూడా సేమ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఈ ఇండెక్స్‌లోని 25 షేర్లు లాభాలతో, 25 షేర్లు నష్టాలతో రోజును ముగించాయి. పెరిగిన స్టాక్స్‌లో... బజాజ్ ఫైనాన్స్ 1.59 శాతం, ఎన్‌టీపీసీ 1.27 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.14 శాతం, టైటన్ 0.86 శాతం, ఎల్ అండ్ టీ 0.83 శాతం, కోటక్ మహీంద్ర బ్యాంక్ 0.75 శాతం, ఐసీఐ,సీఐ బ్యాంక్ 0.33 శాతం, హెచ్‌యుఎల్ 0.33 శాతం, బజాజ్ 0.33 శాతం, బజాజ్ 0.33 శాతం. 0.11 శాతం లాభపడ్డాయి. పడిపోయిన షేర్లలో... టాటా మోటార్స్ 1.33 శాతం, అదానీ పోర్ట్స్ 0.93 శాతం, ఐటీసీ 0.91 శాతం, టాటా స్టీల్ 0.91 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.65 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.51 శాతం నష్టపోయాయి.
BSEలో మొత్తం 4.058 షేర్లు ట్రేడ్ అవగా, వాటిలో.. 1,712 స్టాక్స్ లాభాలతో, 2,237 నష్టాలతో ముగిశాయి. 109 షేర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
సెక్టార్ల వారీగా చూస్తే..
నేటి ట్రేడింగ్‌లో కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫ్యూయల్, ఇన్‌ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు పుంజుకోగా; ఫార్మా, మెటల్స్, మీడియా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు డీలాపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
పెట్టుబడిదార్లకు స్వల్ప నష్టం
మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల క్షీణత కారణంగా.. బీఎస్‌ఈలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ స్వల్పంగా క్షీణించింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ. 470.47 లక్షల కోట్ల వద్ద ముగిసిన మార్కెట్ క్యాప్, ఈ రోజు రూ. 470.21 లక్షల కోట్ల వద్ద ముగిసింది. అంటే, నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపదలో రూ.26,000 కోట్ల మేర ఆవిరైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: హఠాత్తుగా ఆగిపోయిన జియో సిగ్నల్స్ - దేశవ్యాప్తంగా గగ్గోలు