Stock Market Closing On 13 September 2024: భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 13 సెప్టెంబర్‌ 2024) మిక్స్‌డ్‌ రిజల్ట్స్‌ ఇచ్చాయి. ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో, ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ నష్టపోయినప్పటికీ.. నేటి సెషన్‌లో రెండు కొత్త రికార్డులు నమోదయ్యాయి. మిడ్ క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్ మొదటిసారిగా 60,000 మార్క్‌ను అధిగమించి 60,189.35 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి (Nifty mid-cap index at all time high) చేరుకుంది. ఇది మొదటి రికార్డ్‌. బిజినెస్‌ ముగిసేసరికి, నిఫ్టీ మిడ్‌ క్యాప్ 100 ఇండెక్స్‌ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి కొద్దిగా వెనక్కు వచ్చి 60,034 వద్ద ముగిసింది. నేడు, నిఫ్టీ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో కూడా అద్భుతమైన పెరుగుదల కనిపించింది. ఈ ఇండెక్స్ 151 పాయింట్ల లాభంతో ట్రేడ్‌ ముగించింది. 


ఈ రోజు మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 71.77 పాయింట్లు లేదా 0.08% ప్రాఫిట్‌తో 82,890.94 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 32.40 పాయింట్లు లేదా 0.13% పడిపోయి 25,356.50 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.


పెరిగిన & పడిపోయిన షేర్లు
ఈ రోజు ట్రేడింగ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 11 స్టాక్స్ లాభాలతో రోజును ముగించగా, 19 స్టాక్స్‌ నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో 20 స్టాక్స్‌ లాభాలతో, 30 స్టాక్స్‌ నష్టాలతో క్లోజ్‌ అయ్యాయి. బజాజ్ ఫైనాన్స్ 2.31 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.17 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.19 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.18 శాతం, టాటా స్టీల్ 1.09 శాతం, టెక్ మహీంద్రా 0.80 శాతం, టాటా మోటార్స్ 0.61 శాతం లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 1.37 శాతం, ఐటీసీ 1.01 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 0.88 శాతం, ఎన్‌టీపీసీ 0.78 శాతం చొప్పున నష్టపోయాయి.


సెక్టార్ల పనితీరు
నేటి ట్రేడింగ్‌లో... బ్యాంకింగ్, ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో, మీడియా, రియల్ ఎస్టేట్, మెటల్స్, ఫార్మా రంగాల షేర్లకు డిమాండ్‌ & కొనుగోళ్లు పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 


మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సహా బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ పెరగడం వల్ల ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. మిడ్ & స్మాల్ క్యాప్స్‌లో కొనుగోళ్ల వరదతో బీఎస్ఈలో లిస్టయిన అన్ని స్టాక్స్ మార్కెట్ క్యాప్ (market capitalization of indian stock market) తొలిసారిగా రూ. 469 లక్షల కోట్ల చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ రోజు నమోదైన రెండో రికార్డ్‌ ఇది. ట్రేడ్‌ క్లోజింగ్‌ సమయానికి, బీఎస్‌ఇలో లిస్టయిన అన్ని స్టాక్స్ మార్కెట్ విలువ రూ. 468.80 లక్షల కోట్ల వద్ద ముగిసింది. గురువారం సెషన్‌లో ఇది రూ. 467.36 లక్షల కోట్ల వద్ద ఉంది. దీంతో, నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.1.44 లక్షల కోట్లు జంప్‌ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బజాజ్ హౌసింగ్‌ ఐపీవోలో బిడ్‌ వేశారా?, షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇలా చెక్ చేయండి