Bajaj Housing Finance IPO Allotment Tracker: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ IPO, పెట్టుబడిదార్ల నుంచి చాలా బలమైన స్పందన అందుకుంది. బజాజ్ గ్రూప్‌లోని ఈ కంపెనీ IPO సైజ్ రూ. 6,560 కోట్లు. ఈ ఇష్యూ మూడు రోజుల్లో దాదాపు 68 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. బుధవారం ముగిసిన ఆఫర్‌లో... క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (QIBs) తమకు రిజర్వ్ చేసిన వాటా కోసం 222.05 రెట్ల వరకు బిడ్స్ వేశారు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NIIs) తమ వాటా కోసం 43.98 రెట్లు ఎక్కువగా పోటీ పడ్డారు. రిటైల్ ఇన్వెస్టర్లు 7.41 రెట్లు బిడ్స్ వేశారు. కంపెనీ ఉద్యోగులు తమ రిజర్వ్ షేర్ల కోసం 2.13 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
దాదాపు రూ.4.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు
ఇన్వెస్టర్ల నుంచి లభించిన అద్భుతమైన స్పందనతో జాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కొత్త రికార్డు సృష్టించింది. ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ రూ.3,560 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను జారీ చేసింది. మరో రూ.3,000 కోట్ల విలువైన షేర్లను OFS కింద అమ్మకానికి పెట్టింది. రూ.6,560 కోట్ల ఇష్యూ కోసం ఇన్వెస్టర్ల నుంచి రూ.4.42 లక్షల కోట్ల విలువైన బిడ్స్ కంపెనీకి అందాయి.
షేర్లు ఎప్పుడు లిస్ట్ అవుతాయి?
బజాజ్ హౌసింగ్ ఐపీవోలో షేర్లు దక్కని పెట్టుబడిదార్లకు ఈ రోజు (శుక్రవారం, 13 సెప్టెంబర్ 2024) అర్ధరాత్రి లోగా రీఫండ్ ఇస్తారు. విన్నింగ్ బిడ్డర్స్ డీమ్యాట్ అకౌంట్స్‌లో ఈ రోజే షేర్లు క్రెడిట్ అవుతాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు ఈ నెల 16న (సోమవారం) స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవుతాయి.
షేర్ల కేటాయింపును స్థితిని ఎలా చెక్ చేయాలి?
1. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOలో షేర్ల కేటాయింపు స్టేటస్ చెక్ చేయడానికి, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. దీని కోసం, https://www.bseindia.com/investors/appli_check.aspx పై క్లిక్ చేయండి.
3. ఇష్యూ టైప్‌లో ఈక్విటీని ఎంచుకోండి.
4. ఇష్యూ ఆప్షన్‌లో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరును ఎంటర్ చేయండి.
5. తర్వాత, మీ పాన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
6. ఇప్పుడు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.
7. 'అలాట్‌మెంట్ స్టేటస్' కొన్ని సెకన్లలోనే మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
8. మీరు దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
GMP పరిస్థితి ఎలా ఉంది?
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు గ్రే మార్కెట్‌లో బలమైన లిస్టింగ్ సిగ్నల్స్ చూపుతున్నాయి. గ్రే మార్కెట్‌లో... సెప్టెంబర్ 12, గురువారం నాడు కంపెనీ షేర్లు రూ.78 ప్రీమియంతో (GMP) ఉన్నాయి. అంటే 111.43 శాతం లిస్టింగ్ గెయిన్స్‌ను ఇవి సూచిస్తున్నాయి. IPOలో ఇష్యూ ధర రూ.70. షేర్లలో ఇదే రైజింగ్ కొనసాగితే, ఒక్కో షేరు రూ.148 వద్ద లిస్ట్ కావచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కోడలికి రాయల్టీ గిఫ్ట్ ఇచ్చిన నీతా అంబానీ - దాని విలువ, విశేషాలు తెలిస్తే నోరెళ్లబెడతారు!