Nita Ambani Gifts Radhika Merchant A Villa in Dubai: ముకేష్ అంబానీ-నీతా అంబానీల ముద్దు బిడ్డ అనంత్ అంబానీ పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో ప్రపంచం మొత్తానికీ తెలుసు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం (Anant Ambani Radhika Merchant Wedding) జులై 12, 2024న జరిగింది. వివాహానికి, ముందు తర్వాత కూడా జాతీయ & అంతర్జాతీయ సెలబ్రిటీల నడుమ వేడుకలు నిర్వహించారు. ఈ వెడ్డింగ్ కోసం వేల కోట్ల రూపాయల డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశారని సమాచారం.
తాజాగా... నీతా అంబానీ చేసిన పనితో 'అనంత్ - రాధిక వెడ్డింగ్' మరోమారు నేషనల్ & ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాధిక మర్చంట్‌కి విలాసవంతమైన కానుకను బహుమతిగా ఇచ్చారు ఆమె అత్తగారు.
రాచరికం ఉట్టిపడే విల్లా
నీతా అంబానీ, ఇటీవల, తన కోడలు రాధిక మర్చంట్‌కు సాధారణమైన బహుమతి ఇచ్చారు. దుబాయ్‌లో ఒక అద్భుతమైన విల్లాను గిఫ్ట్‌గా అందించారు. దాని విలువ 640 కోట్ల రూపాయలు. దుబాయ్‌లోని 'పామ్ జుమేరా' ప్రాంతంలో ఈ విల్లా ఉంది. దుబాయ్‌లోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటి 'పామ్ జుమేరా'. ప్రపంచ సంపన్నులు ఈ ఏరియాలో కనీసం ఒక ఆస్తయినా కొనాలని తహతహలాడుతుంటారు.
రాధిక కొత్త నివాసం లోపల ఏముంది?
నీతా అంబానీ గిఫ్ట్‌గా ఇచ్చిన విల్లా ఆషామాషీగా ఉండదు. అత్యంత విశాలంగా, విలాసవంతమైన జీవనశైలిని అది అందిస్తుంది. 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ ఈ విల్లా సొంతం. ఈ బీచ్‌లో కొత్త దంపతుల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బీచ్ ఫ్రంట్ లొకేషన్‌లో ఉన్న భవనం నుంచి అరేబియా గల్ఫ్ చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుందట.
ఒకవేళ మీరు ఆ విల్లాలోకి అడుగు పెడితే, దాని సొగసు, లగ్జరీ వెంటనే మీకు అర్ధం అవుతాయి. ఇటాలియన్ మార్బుల్ ఫ్లోర్‌లు, అద్భుతమైన కళాకృతులతో రాచరికం గుర్తుకు వస్తుంది. అందంగా రూపొందించిన 10 బెడ్‌రూమ్‌లు విల్లాలో ఉన్నాయి.
అత్యంత విశాలమైన భోజనాల గది కూడా ఈ విల్లాలో ఒక ప్రత్యేక ఆకర్షణ. సమావేశాలు, ఖరీదైన విందులు, పార్టీలు నిర్వహించడానికి అనువైన పెద్ద డైనింగ్ టేబుల్‌ను ఆ రూమ్‌లో ఏర్పాటు చేశారు. ఆ డైనింగ్ రూమ్‌లో చాలా మంది అతిథులు కూర్చోవచ్చు.
విల్లాలో మోడ్రన్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అనంత్ - రాధిక దంపతులు, వారి అతిథులు అందమైన పరిసరాలను చూస్తూ, ఈత కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు.. ప్రశాంతంగా & విశ్రాంతిగా కూర్చోగల వాతావరణాన్ని కూడా ఈ స్విమ్మిగ్ పూల్ వద్ద సృష్టించారు.
అనంత్ - రాధిక వివాహ వేడుకల కోసం సుమారు రూ. 5,000 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్స్‌లో ఇది ఒకటని చెబుతున్నారు. వివాహానికి ముందు నిర్వహించిన వేడుకల కోసమే దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మరో ఆసక్తికర కథనం: కొనుగోలుదార్ల కొంప ముంచేలా పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి