దేశవ్యాప్తంగా 6 కోట్ల మందికి పైగా ఉన్న సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్ల పైబడిన సీనియర్ సిటజన్‌లకు 5 లక్షల రూపాయల బీమాను అందించనుంది. ఈ మేరకు గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం మానవతాదృక్పథంతో తీసుకున్న గొప్ప నిర్ణయంగా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.. అప్పటికే ఇంట్లో ఉన్న వాళ్లకు ఆయుష్మాన్ భారత్ కింద అందుతున్న ఉచిత వైద్య సదుపాయాలకు ఇది అదనంగా వెల్లడించింది.
దేశవ్యాప్తంగా నాలుగున్న కోట్ల కుటుంబాలు ఈ లబ్ధి పొందుతారని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ లబ్ధిదారులుగా ఉన్న సీనియర్ సిటిజన్లు యాప్ ద్వారా ఆయుష్మన్ యోజన సేవలు పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. దీనికి సంబంధించి ఒక వారంలో ఆర్డర్లు వెలువడనుండగా.. నెలలోగా ఆ యాప్‌ను కేంద్ర సర్కారు లాంచ్ చేయనుంది. అంతే కాకుండా ప్రజలకు ఈ యాప్ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. ఐతే ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ అమలుకు అంగీకారం తెలపని ఢిల్లీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్ లోని సీనియర్ సిటిజన్లు ఈ సేవలు కోల్పోనున్నారు.
ఈ పథకం ద్వారా దేశంలో సీనియర్ సిటిజన్ల ఆరోగ్యం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నామని ప్రధాని ట్వీట్ చేశారు.
ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద సేవలు పొందుతున్న కుటుంబాల్లో ఉన్న వృద్ధులకు దానితో సంబంధం లేకుండా మరో ఐదు లక్షల రూపాయల వరకూ విలువైన వైద్య సేవలు పొందేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ వేరే ఏవైనా ఆరోగ్య బీమా సేవలు పొందుతూ ఉంటే వాటి కింద అయినా లేదా ఆయుష్మాన్ భారత్‌ను అయిన ఎంచుకోవచ్చు.
Also Read: ట్రైనీ ఆర్మీ అధికారి ఎదుటే స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్, తీవ్రంగా స్పందించిన రాహుల్
ఆయుష్మాన్ భారత్ ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల 34 లక్షల కుటుంబాల నుంచి 55 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని.. ఇది భారత్‌లో దారిద్ర్య రేఖ దగ్గర ఉన్న 40 శాతం జనాభాకు సమానమని కేంద్రం వెల్లడించింది. 2018లో ప్రధాన మంత్రి చైతుల మీదుగా ఆయుష్మాన్ భారత్ యోజన ప్రారంభం కాగా.. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల మేర విలువైన వైద్య సేవలు అందించేందుకు ఆయుష్మాన్ కార్డు అందిస్తున్నారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్లుంటే ఆ కుటుంబం మరో ఐదు లక్షల రూపాయల మేర అదనపు సేవలు పొందనుంది.
వీటితో పాటు గురువారం నాటి కేబినెట్ భేటీలో కేంద్రం మరికొన్ని నిర్ణయాలను కూడా తీసుకుంది. దేశవ్యాప్తంగా 88 వేల 500 ఛార్జింగ్ స్టేషన్‌లకు తోడ్పాడు కల్పించేందుకు పీఎం- ఈడ్రైవ్ పథకం కింద 10 వేల 900 కోట్ల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన నాల్గవ దశ కింద రోడ్ కనెక్టివిటీ లేని దాదాపు 25వేల హాబిటెంట్స్‌ను కలిపేలా 65 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ఆమోదం తేలిపింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్ల వ్యవధిలో 70 వేల కోట్లు ఖర్చు చేయనుంది. వాతావరణ మార్పుల అధ్యయనానికి 2 వేల కోట్ల మేర నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Also Read: ఢిల్లీలో రోడ్లపై నడవడం అంత ప్రమాదకరమా? రాత్రి 9 నుంచి 2 గంటల వరకు అసలు బయటకు రావద్దా?