విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్పైస్ జెట్ విమాన సేవలు నిలిచిపోయాయి. అక్టోబర్ వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పైస్‌జెట్ సంస్థ ప్రకటించింది. ఇవాళ్టి నుంచే సర్వీసుల రద్దు అమల్లోకి వచ్చిందని తెలిపింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. సర్వీసుల రద్దు విషయంపై గన్నవరం విమానాశ్రయం అధికారులకు స్పైస్ జెట్ యాజమాన్యం సమాచారం అందించింది.
Also Read: YSRCP Audio Tapes : వైఎస్ఆర్‌సీపీలో టేపుల గోల ! ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు...?
టిక్కెట్ల విక్రయాలు నిలిపివేత
విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ్టి నుంచి అక్టోబర్నెలాఖరు వరకు స్పైస్ జెట్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు సైతం నిలిపివేశారు. అక్టోబరు వరకు అన్ని సేవలు రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ గన్నవరం విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించింది. ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరుకు స్పైస్ జెట్ సర్వీసులు నడుస్తున్నాయి. రద్దీ తగ్గడం, ఇతర కారణాల వల్ల సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది.
పూర్తి సర్వీసులు రద్దు
విజయవాడ నుంచి స్పైస్‌జెట్ కేవలం ఒక్క నగరానికి మాత్రమే సర్వీసులు నడుపుతుంది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిపేది. ప్రయాణికులు తగ్గిపోయారన్న కారణాలతో దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ రద్దు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా విమానాశ్రయం నుంచి స్పైస్‌జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. గన్నవరం నుంచి ఎయిరిండియా, ఇండిగో, ట్రూజెట్ విమానాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. గన్నవరం నుంచి నడుస్తోన్న సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గడం, ఇతర కారణాల వల్ల సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పైస్‌జెట్ సంస్థ తెలిపింది. సెప్టెంబరు తర్వాత పరిస్థితులను బట్టి విమాన సర్వీసులను నిర్ణయం తీసుకుంటామని సంస్థ పేర్కొంది.
Also Read: Gold-Silver Price: పసిడి నేలచూపులు.. వెండి కూడా తగ్గుదల.. మీ నగరంలో నేటి ధరలివే..
Also Read: Avanthi Srinivas Audio Tape: మంత్రి ఆడియో టేప్ హల్‌చల్.. మహిళతో ఆ మాటలు, స్పందించిన అవంతి శ్రీనివాస్