ఆతిథ్య రంగానికి చెందిన ఓయో ఐపీవోకు రానుంది. రూ.8,4630 కోట్ల విలువైన ఐపీవోకు అనుమతి కోరుతూ సెబీ వద్ద ముసాయిదా (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. స్థాపకుడు రితేశ్‌ అగర్వాల్‌, ఇన్వెస్టర్లు లైట్‌స్పీడ్‌ వెంచర్స్‌ పార్ట్‌నర్స్‌, సెక్వోయా క్యాపిటల్‌, స్టార్‌ వర్చూ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌, గ్రీన్‌ఓక్స్‌ క్యాపిటల్‌, ఎయిర్‌ బీఎన్బీ, హెచ్‌టీ మీడియా, మైక్రోసాఫ్ట్‌ తమ వాటాలను డైల్యూట్‌ చేయడం లేదని తెలిసింది.


ఒక రూపాయి ముఖ విలువతో రూ.8,430 కోట్ల ఐపీకు రావాలని ఓయో నిర్ణయించింది. కొత్తగా రూ.7000 వేల కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో రూ.1,430 కోట్లు సమీకరించనుంది. లీడ్‌ మేనేజర్లు, స్టేట్‌హోల్డర్లను సంప్రదించింది ఒక్కో షేరు ధరను నిర్ణయించనున్నారు. కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపనీ లిమిటెడ్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఆఫర్‌కు సమన్వయకర్తలు, లీడ్‌ మేనేజర్లుగా ఉన్నాయి.


Also Read: మళ్లీ టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా!


భారత్‌లో సూపర్‌ హిట్టైన ఓయోలో సాఫ్ట్‌బ్యాంక్‌ భారీగా పెట్టుబడులు పెట్టింది. కరోనా మహమ్మారి తర్వాత ఇన్నాళ్లకు  ఆతిథ్య రంగం పుంజుకోవడంతో కనీసం ఒకటి నుంచి 1.2 బిలియన్‌ డాలర్లు సమీకరించాలని ఓయో నిర్ణయించుకుంది. ఐపీఓకు రావడంతో పాటు ఇప్పటికే వాటదారుల నుంచి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ నిర్వహించాలని భావించింది.


Also Read: వర్క్ ఫ్రం హోం ఇక ముగిసినట్లే.. ఆఫీసులు తెరవనున్న దిగ్గజ కంపెనీల జాబితా ఇదే..


దేశంలో ప్రస్తుతం ఐపీఓల సీజన్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే. జులైలో ఐపీఓకు వచ్చిన జొమాటో సూపర్‌ హిట్టైంది. బెర్కషైర్‌ హాత్‌వే పెట్టుబడులు పెట్టిన పేటీఎం, టీపీజీ పెట్టుబడులు పెట్టిన నైకా, సాఫ్ట్‌బ్యాంక్‌ మద్దతిచ్చిన ఓలా సైతం పబ్లిష్‌ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓయో సైతం ఐపీవో వైపు అడుగులు వేసింది.


Also Read: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలో విపరీతంగా.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవే..


ఓయోలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 46శాతం వాటా ఉంది. కాగా కరోనా మహమ్మారి మొదలవ్వడంతో హోటల్‌ రంగం పూర్తిగా పడకేసిన సంగతి తెలిసిందే. దాంతో ఉద్యోగులకు సంస్థ లేఆఫ్‌లు ప్రకటించింది. ఖర్చులు తగ్గించుకోవడం మొదలు పెట్టింది. రెండో వేవ్‌ ముగిశాక ఆతిథ్య రంగం మెల్లగా కోలుకొంది. తమ వ్యాపారం నిలకడగా కొవిడ్‌ ముందునాటి పరిస్థితికి చేరుకుంటుందని ఓయో సీఈవో రితేశ్ అగర్వాల్‌ జులైలో పేర్కొన్నారు. గత నెల్లో ఓయోలో మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ 5 మిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టింది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి