SBI Launches 3 MILES Credit Cards: వేసవి సెలవులు వచ్చాయి, దేశంలో ప్రయాణాల వెల్లువ ప్రారంభమైంది. టూరిస్ట్‌ డెస్టినేషన్స్‌ కోసం టిక్కెట్లు తెగ తెగుతున్నాయి. సింగిల్‌గా, ఫ్యామిలీతో కలిసి, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తూ.. ఎలా వీలైతే అలా జనం కొత్త ప్రాంతాలకు చెక్కేస్తున్నారు.


టూరిజం ఫోకస్డ్‌ క్రెడిట్‌ కార్డ్స్‌
హాలిడే ట్రిప్‌లో జాలీతో పాటు జేబుకు చిల్లుకు కూడా పడుతుంది. ఏమీ ఖర్చు చేయకుండా ఎంజాయ్‌మెంట్‌ చేయలేం. సేవింగ్స్‌ ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతాయి. అయితే.. పర్యాటకం కోసం చేసే ప్రతి రూపాయి ఖర్చులో ఎంతో కొంత తిరిగి వస్తే పర్యాటకుల సంతోషం పెరుగుతుంది. ఇదే పాయింట్‌ ఆధారంగా, టూరిజం మీద ఫోకస్‌తో ఎస్‌బీఐ గ్రూప్‌లోని ఎస్‌బీఐ కార్డ్‌ (SBI Card) కొత్త క్రెడిట్‌ కార్డ్స్‌ లాంచ్‌ చేసింది. 


ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ పేరిట తీసుకొచ్చిన ఈ కార్డ్‌లో మూడు రకాలు ఉన్నాయి. అవి - ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ (SBI Card MILES ELITE), ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్ (SBI Card MILES PRIME), ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ (SBI Card MILES). ఒక్క టూరిజానికే కాదు, తరచూ ప్రయాణాలు చేసే వ్యక్తులకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ 3 కొత్త క్రెడిట్‌ కార్డ్‌లు మాస్టర్‌కార్డ్‌ (Mastercard), రూపే (RuPay) నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్నాయి. 


ప్రయోజనాలు
ఈ కార్డులు కేవలం చెల్లింపు సాధనాలు మాత్రమే కాదు, ప్రోత్సాహకాల ప్రపంచానికి గేట్లు. ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్‌బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్‌బీఐ కార్డ్ మైల్స్‌తో చేసే ప్రతి ఖర్చుతో ట్రావెల్ క్రెడిట్స్‌ ‍‌(Travel Credits) కార్డ్‌ హోల్డర్‌ ఖాతాలో జమ అవుతాయి. ఆ ట్రావెల్స్‌ క్రెడిట్స్‌ను ఎయిర్ మైల్స్‌గా, హోటల్ పాయింట్స్‌గా మార్చవచ్చు. ఈ కార్డ్స్‌తో చేసే ప్రతి ట్రావెల్ బుకింగ్‌ మీద రివార్స్‌ వస్తాయి. విమానాశ్రయ లాంజ్‌ యాక్సెస్‌ను కూడా ఎంజాయ్‌ చేయొచ్చు.


ఈ మూడు వేరియంట్‌ కార్డ్స్‌తో ప్రయాణం కోసం వెచ్చించే ప్రతి 200 రూపాయలపై గరిష్టంగా ఆరు ట్రావెల్ క్రెడిట్స్‌ సంపాదించొచ్చు. ఇతర కేటగిరీ కార్డ్స్‌ మీద రెండు క్రెడిట్స్‌ అందుతాయి. ఎయిర్ విస్తారా, ఎయిర్ ఇండియా, ITC హోటల్స్, అకర్‌ సహా 20కి కంపెనీలతో ఎస్‌బీఐ ఒప్పందం ఉంది. ఈ భాగస్వామ్య సంస్థల్లో ఎయిర్‌ టిక్కెట్స్‌ బుకింగ్, హోటళ్లలో బస సమయాల్లో ఈ క్రెడిట్స్‌ ఉపయోగపడతాయి.


ఎస్‌బీఐ కార్డ్ అందిస్తున్న ప్రీమియం వేరియంట్‌ ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ఎలైట్‌. కార్డ్‌ దక్కించుకున్న 60 రోజుల లోపు రూ.1 లక్ష ఖర్చు చేస్తే 5,000 ట్రావెల్ క్రెడిట్స్‌ వస్తాయి. రూ.12 లక్షల ఖర్చుపై 20,000 ట్రావెల్ క్రెడిట్స్‌ అందుతాయి. దీంతోపాటు దేశీయ & అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్‌ల్లోకి యాక్సెస్‌ దొరుకుతుంది. ఒక సంవత్సరంలో 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్‌, 6 ఇంటర్నేషనల్‌ లాంజ్ యాక్సెస్‌ లభిస్తుంది. ఈ కార్డ్ మీద చేసే రూ.1 లక్ష అదనపు ఖర్చుతో అదనపు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఓచర్లు పొందుతారు. ఈ కార్డ్‌కు ప్రయాణ బీమా ప్రయోజనం కూడా వర్తిస్తుంది.


ఫీజ్‌లు, ఛార్జీలు
ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ఎలైట్‌ జాయినింగ్ ఫీజ్‌ రూ. 4,999 + GST. దీనికి వార్షిక ఛార్జీలు (Annual Charges) కూడా ఉంటాయి. ఎస్‌బీఐ కార్డ్ మైల్స్‌ ప్రైమ్‌ జాయినింగ్ ఫీజ్‌ రూ. 2,999 + GST. ఎస్‌బీఐ కార్డ్ మైల్స్‌ జాయినింగ్ ఫీజ్‌ రూ. 1,499 + GST. వీటికి కూడా యాన్యువల్‌ ఫీజ్‌ చెల్లించాలి. ఇవి కూడా దాదాపుగా ఎస్‌బీఐ కార్డ్‌ మైల్స్‌ ఎలైట్‌ ప్రయోజనాలను అందిస్తాయి.


మరో ఆసక్తికర కథనం:  జొమాటో సీఈవో తగ్గట్లేదుగా, దిల్లీలో అతి పెద్ద ల్యాండ్ డీల్ ఇతనిదే