Govt Plans To Set Up Rupee Trade Accounts With Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం (Russia Ukraine War) మిగతా దేశాలపై పడుతోంది. రష్యాపై అమెరికా (America Sanctions) సహా కొన్ని పశ్చిమ దేశాలు ముడిచమురు (Crude Oil), ఎరువులు (fertilisers), సహజవాయువు (Natural Gas), పొద్దుతిరుగుడు నూనె (Sunflower Oil) సరఫరాలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దాంతో డాలర్ మారకంపై (Dollars Settlement) ఆంక్షల ప్రభావం నుంచి బయటపడేందుకు భారత్ (India) వినూత్న నిర్ణయం తీసుకుందని తెలిసింది. కొత్త చెల్లింపుల వ్యవస్థను తీసుకురాబోతోంది. రష్యాతో రూపాయితో (Rupee) లావాదేవీలు చేపట్టనుంది.
రూపాయి మారకం
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను ఆరంభించడంతో అమెరికా, ఐరోపా దేశాలు దానిపై ఆంక్షలు విధించాయి. ఇందులో డాలర్ మారకం ఒకటి. సాధారణంగా వివిధ దేశాలు ఎగుమతులు, దిగుమతులు చేపట్టినప్పుడు డబ్బులను డాలర్ రూపంలో చెల్లిస్తాయి. ఇప్పుడు రష్యాకు డాలర్లు చెల్లించకుండా అమెరికా అడ్డుకుంటోంది. కానీ ఆ దేశం నుంచి మనకు ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె, ముడి చమురు వస్తుంటుంది. మరి డబ్బులు చెల్లించడంలో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు రూపాయి-రూబుల్ మారకాన్ని భారత్ ప్రవేశపెడుతోంది.
రూపాయి ఖాతాలు
ఈ లెక్కన రష్యా బ్యాంకులు, కంపెనీలు భారత బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తాయి. ఇదే విధంగా భారత కంపెనీలు అక్కడి బ్యాంకుల్లో ఖాతాలు తెలుస్తాయి. కొంత డబ్బును అక్కడా, ఇక్కడా డిపాజిట్ చేసుకుంటాయి. వివిధ వాణిజ్య సెటిల్‌మెంట్లను వాటితోనే చేస్తాయి. 'ఆంక్షల ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం ఓ ప్రొయాక్టివ్ అడుగు వేస్తోంది. ఇప్పుడు మేం లావాదేవీలను డాలర్లలో సెటిల్ చేయం. రూపాయి ఖాతాలను తెరబోతున్నాం' అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒకరు మీడియాకు తెలిపారు. రెండు దేశాల మధ్య ఈ ఖాతాలు చెల్లింపులకు గ్యారంటీగా ఉంటాయి.
ఇరాన్‌పై ఆంక్షల సమయంలో
ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు భారత్ ఈ వ్యవస్థను ఉపయోగిస్తోంది. 2012లో తొలిసారి ప్రవేశపెట్టింది. చాలా దేశాలు ఆంక్షలు ప్రభావం నుంచి తప్పించుకొనేందుకు ఇలాంటి పద్ధతులనే ఉపయోగిస్తున్నాయి. అణ్వాయుధ తయారీని ఆపేయాలని వెస్ట్రన్ కంట్రీస్ ఇరాన్‌పై ఆంక్షలు విధించినప్పుడు భారత్ ఇలాగే చేసింది. ఇరాన్‌తో రూపాయి చెల్లింపుల వ్యవస్థను వాడింది. ప్రస్తుతం ఈ ఖాతాలు తెరవడంపై భారత్, రష్యా ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. అధికారిక చర్చలు మొదలయ్యాయని, అంగీకరించే పరిస్థితి ఉందని తెలుస్తోంది.
రష్యా ఎగుమతులు, దిగుమతులు
రష్యా 2021లో 6.9 బిలియన్ డాలర్ల ఎగుమతులను భారత్‌కు పంపించింది. ఇందులో ముఖ్యంగా వంటనూనెలు, ఎరువులు, ముడి వజ్రాలు ఉన్నాయి. ఇదే సమయంలో మనదేశం 3.33 బిలియన్ డాలర్ల ఎగమతులను ఆ దేశానికి పంపించింది. ఔషధాలు, తేయాకు, కాఫీని ఎగుమతి చేస్తోంది.
Also Read: 100కే భయపడ్డాం - అతి త్వరలోనే లీటర్ పెట్రోల్ ధర రూ.150 అవుతోందా?
Also Read: కార్గిల్‌నే చూశాం బ్రదర్! రష్యా యుద్ధానికి భయమేల - ఇన్వెస్టర్లూ ఈ జాగ్రత్తలు తీసుకోండి!