RBI MPC Meet on June 6-8 Know How Much Interest Rates May Increase Check Details: భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరోసారి కీలక వడ్డీరేట్లను సవరించనుందని సమాచారం. వచ్చే వారం జరిగే ద్రవ్య పరపతి సమీక్షలో 0.40 శాతం వడ్డీరేటు పెంచే అవకాశం ఉందని ఓ విదేశీ బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. ఆగస్టులో జరిగే సమీక్షలో 0.35 శాతం పెంచుతుందని లేదా మొత్తంగా 0.50 శాతానికి తీసుకెళ్లి ఆగస్టులో మరో 0.25 శాతం పెంచొచ్చని అంటోంది. మొత్తంగా రేట్ల పెంపును 0.75 శాతానికి తీసుకెళ్తుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది.
Also Read: లోన్ తీసుకున్నారా, జస్ట్ కూల్! EMI భారం కేవలం వీరికి మాత్రమే! మిగతా వాళ్లు సేఫ్!
2022, మే 4న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్కెట్లు నడుస్తుండగా మధ్యాహ్నం సమయంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే వడ్డీరేట్లను పెంచక తప్పడం లేదని వెల్లడించారు. లక్షిత ద్రవ్యోల్బణాన్ని 6 శాతం లోపే ఉంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: ఆర్బీఐ రేట్ల పెంపుతో ఎఫ్‌డీలకు వడ్డీ బెనిఫిట్! ఇలా చేస్తేనే ఎక్కువ లాభం.. లేదంటే!
టమాటా ధరల పెరుగుదలతో మే నెల ద్రవ్యోల్బణం 7.1 శాతంగా ఉండొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ తెలిపింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, క్రూడ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ దిగుమతులపై డ్యూటీ తొలగించడం, ఏటీఎఫ్ ధరలు తగ్గించడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందని వెల్లడించింది. అయితే మే నెలలో వినియోగదారుల సగటు ద్రవ్యోల్బణం 6.8 శాతంగా ఉండొచ్చని, ఆర్బీఐ పెట్టుకున్న 6 శాతం కన్నా ఇది కాస్త ఎక్కువేనని వెల్లడించింది.
Also Read: ప్రజలపై ఆర్‌బీఐ బాదుడే బాదుడు- వడ్డీ రేట్లు పెంపు, EMIలపై ఇక భారం!
'ఆర్బీఐ విధాన రెపోరేటును జూన్‌లో 0.40 శాతం, ఆగస్టులో 0.35 శాతం పెంచుతుందని అంచనా. ప్రామాణిక చర్యల్లో భాగంగా 0.50+0.25 శాతం కాంబినేషన్‌లో పెంచడం కాస్త ఎక్కువే' అని బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్టు పేర్కొంది. క్యాష్ రిజర్వు రేషియో (CRR)ను మరో 0.50 శాతం పెంచొచ్చని అంచనా వేసింది. మేలో సీఆర్ఆర్‌ను 0.50 శాతం పెంచి 4 శాతానికి తీసుకెళ్లడం వల్ల వ్యవస్థ నుంచి రూ.87,000 కోట్ల లిక్విడిటీని సెంట్రల్ బ్యాంక్ తగ్గించిందని వెల్లడించింది. ఇక వృద్ధిరేటును 7.4 శాతంగా అంచనా వేసింది.