విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ ఏడు రక్షణ రంగ సంస్థలను ప్రారంభించారు. శుక్రవారం ఆ కంపెనీలను జాతికి అంకితమిచ్చారు. 'సరికొత్త భవిష్యత్తును నిర్మించుకొనేందుకు భారత్‌ కంకణం కట్టుకుంది' అని మోదీ ఉద్ఘాటించారు. డీఆర్‌డీవో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పాల్గొన్నారు. ఆయుధ పూజ సైతం నిర్వహించారు.


Also Read: అద్భుతమైన సౌండ్‌బార్‌ కావాలా? బ్రాండెడ్‌ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్‌


ఇప్పటికే ఉన్న ఆర్డనన్స్‌ ఫ్యాక్టరీని కేంద్రం ఏడు ప్రత్యేక కంపెనీలుగా విభజించింది.  మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌, ఆర్మర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్, అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌, ట్రూప్‌ కంఫర్ట్స్‌ లిమిటెడ్, యంత్ర ఇండియా లిమిటెడ్‌, ఇండియా ఆప్టెల్‌ లిమిటెడ్‌, గ్లైడర్స్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలను ఆరంభించింది. పరిశోధన, అభివృద్ధి, స్వయం సమృద్ధి సాధన కోసమే ఇలా చేశామని వెల్లడించింది.


Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్‌! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!


'సరికొత్త భవిష్యత్తును నిర్మించుకొనేందుకు భారత్‌ కొత్తగా తీర్మానించుకుంది' అని మోదీ అన్నారు. 'ఈ ఏడు కొత్త కంపెనీలు రక్షణ రంగంలోకి నేడే ప్రవేశిస్తున్నాయి. మనం ప్రతిదీ సాధించగలమన్న నమ్మకాన్ని ఇవి నిలబెడతాయి. ఈ కంపెనీలన్నీ దేశానికి బలంగా మారతాయని నాకు నమ్మకముంది' అని ప్రధాని మోదీ అన్నారు.


Also Read: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి


'తమ పని సంస్కృతిలో ఈ ఏడు కంపెనీలు పరిశోధన, వినూత్నకు పెద్దపీట వేయాలని కోరుతున్నా. భవిష్యత్తు టెక్నాలజీలో భారత్‌ను ముందుండి నడిపించాలి. పరిశోధకులకు అవకాశాలు ఇవ్వాలి. ఈ ఏడు కంపెనీలతో స్టార్టప్‌లు సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నాను' అని మోదీ అన్నారు.


Also Read: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి


స్వయం సమృద్ధ భారత్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా కొత్త రక్షణ రంగ సంస్థలను కేంద్రం సృష్టించింది. ఈ వికేంద్రీకరణ, విభజనతో స్వయం ప్రతిపత్తి, సామర్థ్యం, నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ఏడు కంపెనీల వద్ద రూ.65000 కోట్ల విలువైన 66 ఒప్పందాలు ఉన్నాయి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి