Petrol Price Today 28th May 2022: హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 28th May 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal)  19 పైసలు తగ్గింది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.109.38 కాగా, 13 పైసలు తగ్గడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.55 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) 15 పైసలు పెరగడంతో నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.54 కాగా, 14 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.97.70 అయింది. 
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.111.49 కాగా, డీజిల్‌‌పై 29 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.99.52 అయింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.  నేడు ఇక్కడ పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 28th May 2022) లీటర్ ధర రూ.111.53 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.99.30 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. 96 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48 అయింది. డీజిల్‌పై 89 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.98.27 అయింది.
చిత్తూరులో పెట్రోల్ పై 96 పైసలు పెరగడంతో లీటర్ రూ.112.88 కాగా, డీజిల్‌పై 89 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.100.50 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


ఇటీవల తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.10 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.