By: ABP Desam | Updated at : 26 Dec 2023 12:00 AM (IST)
ఈ ఏడాది పోస్టాఫీస్ పథకాల్లో కీలక మార్పులు
Post Office Scheme Rules Changed in 2023: "సొమ్ము భద్రం - భవిత బంగారం" అన్నది చిన్న మొత్తాల పొదుపు పథకాలకు (Small Savings Schemes) ఉన్న ట్యాగ్‌లైన్. ఈ ఏడాది, పోస్టాఫీసు పథకాల్లో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని స్కీమ్‌ల మీద పరిమితులు పెరిగాయి, కొన్నింటి మీద ఆంక్షలు తగ్గాయి. వడ్డీ రేట్లు కూడా మారాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోకి కొత్తగా ఒక ఉమెన్ స్కీమ్ యాడ్ అయింది.
2023లో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో వచ్చిన మార్పులు:
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ - Senior Citizen's Savings Scheme (SCSS)
2023లో, ఈ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. SCSS గరిష్ట పెట్టుబడి మొత్తాన్ని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు. దీంతోపాటు.. ఒక వ్యక్తి పదవీ విరమణ చేసిన నెలలోగా ఆ డబ్బును SCSSలో పెట్టుబడి పెట్టాలన్న నిబంధనను ఇప్పుడు మూడు నెలలకు పెంచారు. 55 - 60 ఏళ్లలోపు రిటైర్డ్ వ్యక్తులకు ఇది వర్తిస్తుంది.
SCSS ఖాతాదార్లు ఇప్పుడు ఎన్ని దఫాలైనా ఖాతాను పొడిగించొచ్చు. ఒక్కో దఫా మూడు సంవత్సరాల పాటు ఉంటుంది. గతంలో, ఒక్కసారి ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది.
పదవీ విరమణ ప్రయోజనాలు
పదవీ విరమణ ప్రయోజనాల పరిధిని స్పష్టంగా నిర్వచించారు. ఇప్పుడు, పదవీ విరమణ ప్రయోజనాలు (Retirement benefits) అంటే రిటైర్మెంట్ విరమణ కారణంగా వ్యక్తి అందుకున్న అన్ని రకాల చెల్లింపులు. కొత్త రూల్ ప్రకారం, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఆ ప్రభుత్వ ఉద్యోగి జీవిత భాగస్వామి కూడా ఈ స్కీమ్‌లో పెట్టుబడిగా పెట్టొచ్చు.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ - Post Office Monthly Income Scheme
ఈ పథకం కింద సింగిల్ అకౌంట్ పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్‌లో పరిమితిని రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - Public Provident Fund
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ముందస్తు ఉపసంహరణ (premature withdrawal of PPF) వడ్డీ రేటును మార్చారు. ప్రిమెచ్యూర్ విత్‌డ్రాల్ మీద, ఐదేళ్ల పీరియడ్‌లో చెల్లించే వడ్డీ కంటే 1% వడ్డీ తక్కువ చెల్లిస్తారు.
ఎఫ్‌డీ ముందస్తు ఉపసంహరణపై పెనాల్టీ - penalty on FD Premature withdrawal
పోస్టాఫీస్‌లో ఐదేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, ఆ డిపాట్‌ను నాలుగేళ్ల తర్వాత విత్‌డ్రా చేసుకుంటే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా రేటుతో సమానంగా 4% వడ్డీ చెల్లిస్తారు. దీనికి ముందు, ఇదే ప్రీమెచ్యూర్ విత్‌డ్రాల్ మీద, మూడేళ్ల డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటును చెల్లించేవాళ్లు.
ముందస్తు ఉపసంహరణపై ఫైన్ - Deduction on premature withdrawal
ఒక సంవత్సరం కాల గడువున్న డిపాజిట్‌ను గడువు ముగిసే లోగా విత్‌డ్రా చేసుకుంటే, డిపాజిట్ మొత్తంలో 1% కట్ చేస్తారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ - Mahila Samman Savings Certificate
కేవలం మహిళా పెట్టుబడిదార్ల కోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2023 బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దీనిని ప్రకటించారు. ఈ స్కీమ్ టెన్యూర్ రెండేళ్లు. గరిష్ట డిపాజిట్ రూ.2 లక్షలు. ఈ డబ్బును ఒకేసారి డిపాజిట్ చేయాలి. ఏడాదికి 7.5% వడ్డీ వస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఒక్క ప్రీమియంతో ప్రతి నెలా జీవితాంతం ఆదాయం, రిటైర్మెంట్‌పై బెంగ ఉండదు
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Lost Phone Tracking:ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా ఈ విధంగా ట్రాక్ చేయండి! మొత్తం ప్రక్రియ తెలుసుకోండి!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు