By: ABP Desam | Updated at : 24 Dec 2023 09:05 AM (IST)
NRIలు ఇండియాలో బంగారం కొనొచ్చా?
Can NRIs buy gold in India: శుభప్రదమైన పసుపు రంగులో కనిపించే బంగారం భారతీయుల ఆచార, సంప్రదాయాల్లో ఒక భాగం. పసిడిని కొని వంటిపై వేసుకోవడం, ఇంట్లో నిల్వ చేసుకోవడం భారతీయుల అలవాటు. మన దేశంలో, పండుగల సమయంలో గోల్డ్ షాపుల్లో కాలు పెట్టే సందు కూడా కనిపించదు. బంగారాన్ని అక్కడ ఉచితంగా ఇస్తున్నారేమో అన్నంత రద్దీ కనిపిస్తుంది. సాధారణ రోజుల్లోనూ బంగారం దుకాణాలు కిటకిటలాడుతూనే ఉంటాయి.
మన దేశంలో నివసించే వాళ్లు (Indian residents) ఎంత పసిడైనా కొనొచ్చు, లిమిట్ లేదు. నాన్-రెసిడెంట్స్ కేటగిరీలో (NRI) ఉంటే మాత్రం కొన్ని షరతులు వర్తిస్తాయి.
సావరిన్ గోల్డ్ బాండ్స్ (Sovereign Gold Bond):
NRIలు సావరిన్ గోల్డ్ బాండ్లలో (SGBలు) పెట్టుబడి పెట్టకూడదు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA Act) 1999 ప్రకారం, భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తులు, HUFలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే SGBలు కొనుగోలు చేయడానికి అర్హులు. NRIలకు ఈ అర్హత లేదు. ఒకవేళ, ఇండియన్ రెసిడెంట్‌గా ఉన్న వ్యక్తి SGBలు కొన్నాక నాన్-రెసిడెంట్ కేటగిరీలోకి మారితే, అతను మెచ్యూరిటీ డేట్ వరకు వాటిని కొనసాగించవచ్చు. ఆ తర్వాత కొత్తగా కొనడానికి మాత్రం వీల్లేదు.
గోల్డ్ బాండ్ ఇన్వెస్ట్‌మెంట్ నామినీగా NRI ఉండొచ్చు, ఆ ప్రయోజనాలను పొందొచ్చు. దీనికోసం పాస్‌పోర్ట్ కాపీతో పాటు KYCని అప్‌డేట్ చేయాలి. సావరిన్ గోల్డ్ బాండ్ అంటే, బంగారంతో కూడిన ప్రభుత్వ సెక్యూరిటీలు. భౌతిక బంగారం బదులు బాండ్ రూపంలో పసిడిని కొనే ఆప్షన్ ఇది. SGBలను భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది.
గోల్డ్ ETFలు, మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) వంటివాటిలో NRIలు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫెమా చట్టం ప్రకారం ఈ పెట్టుబడులకు (Investing in Gold) కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.
NRI పెట్టుబడిదార్లు పెట్టుబడి పెట్టడానికి, లాభాలు సంపాదించడానికి ప్రభుత్వం కొన్ని గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. వాళ్లు, బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సాధారణంగా రెండు మార్గాలు ఉన్నాయి. అవి.. భౌతిక బంగారం, డిజిటల్ గోల్డ్.
భౌతిక బంగారం (Physical Gold):
పసిడిలో పెట్టుబడి పెట్టే సాంప్రదాయ మార్గం ఇది. పండుగలతో పాటు, భారతీయుల ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా బంగారు నగల కొనుగోళ్లతో ఆ సంతోషం మరింత పెరుగుతుంది. బంగారానికి ఉన్న ఉన్నతమైన విలువను వేల ఏళ్ల క్రితమే భారతీయులు గుర్తించారు. దానిని హోదాకు చిహ్నంగా, సురక్షితమైన పెట్టుబడి మార్గం ఉపయోగిస్తున్నారు.
NRIలు, నేరుగా బంగారం దుకాణాలకు వెళ్లిగానీ, ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా గానీ భౌతిక బంగారాన్ని కొనొచ్చు. బంగారు ఆభరణాలు, నాణేలు, కడ్డీలు, బిస్కట్లు వంటి రూపాల్లో కొనుగోలు చేయవచ్చు.
డిజిటల్ బంగారం (Digital Gold):
డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా NRIలకు అనుమతి ఉంది. ఇది ఒక ఈజీ ఆప్షన్. ఫిజికల్ గోల్డ్‌ను ఇంట్లో పెట్టుకుని టెన్షన్ పడే బదులు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు, వీటి విలువ భౌతిక బంగారానికి సమానంగా ఉంటుంది, దొంగల భయం ఉండదు. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో, ఎక్కువగా వాడుకలో ఉన్న మూడు ఆప్షన్లు ఇవి:
- ఈ-గోల్డ్ (e-Gold): ఈ-గోల్డ్ యూనిట్లను తొలిసారిగా 2010లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రవేశపెట్టింది. ఇవి, మార్కెట్‌లో లిస్ట్ అయిన గోల్డ్ యూనిట్లు, వీటితో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ చేయవచ్చు. ఒక ఈ-గోల్డ్ యూనిట్ విలువ 1 గ్రాము బంగారం ధరకు సమానం.
- గోల్డ్ ఫండ్స్ (Gold funds): పేరులో ఉన్నట్లుగా, గోల్డ్ ఫండ్స్ అంటే బంగారాన్ని ప్రైమరీ కమొడిటీగా కలిగిన ఫండ్స్. గోల్డ్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో ఉంటే, మార్కెట్ ఒడిదొడుకుల్లో మీ పెట్టుబడిని బ్యాలెన్స్ చేస్తాయి, రిస్క్‌ను తగ్గిస్తాయి.
- గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs): ఈటీఎఫ్ అంటే ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్. వీటిలో అంతర్లీన ఆస్తిగా బంగారం ఉంటుంది, ఈ ఫండ్స్ ఎక్సేంజ్‌లో ట్రేడ్ అవుతాయి. ETF రిటర్న్స్ & రిస్క్ అనేవి మార్కెట్‌లో కొనసాగుతున్న బంగారం విలువను ప్రతిబింబిస్తాయి. ఉత్తమ పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో ఇది ఒకటి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పసిడిలో పెరుగుతున్న పెట్టుబడులు -ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Car Safety Tips In Summer: మీ కార్‌ను కన్నకొడుకులా చూసుకోండి, ఈ తప్పులు చేస్తే మిగిలేది బూడిద!
Gold-Silver Prices Today 03 April: హార్ట్ ఎటాక్ లాంటి షాక్ ఇచ్చిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Property Loan: ఆస్తి తనఖా లోన్‌లపై లేటెస్ట్ వడ్డీ రేట్లు - రుణం తీసుకునే ముందు ఇది తెలుసుకోండి
Gold-Silver Prices Today 02 April: పసిడి నగలను మరిచిపోవడం మంచిది - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Women Investment: ఆడవాళ్లు ఆర్థికంలో అదరగొడుతున్నారు: AMFI-Crisil నివేదిక
AP Cabinet : రామానాయుడు స్టూడియో భూముల స్వాధీనం - రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం - ఏపీ సర్కార్ కొరడా తీసిందా?
Nara Lokesh: రెడ్ బుక్ పేరు వింటే గుండెపోట్లు - విజనరీ ,ప్రిజనరీకి ఎంతో తేడా - లోకేష్ కీలక వ్యాఖ్యలు
Mobile Blast : ఫోన్ కవర్లో డబ్బులు, ఏటీఎం కార్డులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త, ముఖ్యంగా సమ్మర్లో
Tirupati To Palani APSRTC Bus Timings: తిరుపతి - పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం - బస్ టైమింగ్స్ ఇవే!