How Many People Can Use UPI Circle At A Time: 2016 సంవత్సరంలో, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) భారతదేశంలో అడుగు పెట్టిన తర్వాత, దేశవ్యాప్తంగా చెల్లింపుల స్వరూపం గణనీయంగా మారిపోయింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) దీనిని లాంచ్ చేసింది. UPI ద్వారా డబ్బు లావాదేవీలు చాలా సులభమయ్యాయి. రూ. 10 విలువైన వస్తువు కొనాలనుకున్నా ఎవరికైనా లక్ష రూపాయలను తక్షణం పంపాలనుకున్నా ఇప్పుడు ఎవరూ ఇబ్బంది పడడం లేదు.
మీ జేబులో డబ్బు లేకపోయినా, బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉంటే చాలు.. యూపీఐ ద్వారా మీ మొబైల్ ఫోన్ నుంచి ఈజీగా పేమెంచ్ చేయవచ్చు. UPIని ఉపయోగిస్తున్న వ్యక్తులకు ఇప్పుడు UPI సర్కిల్ సౌకర్యం కోసం అందుబాటులోకి వచ్చింది. ఇది మరొక విప్లవాత్మక మార్పు. యూపీఐని ఒకే వ్యక్తి ఉపయోగించగలిగితే, యూపీఐ సర్కిల్‌ను ఏకకాలంలో ఎక్కువ మంది ఉపయోగించవచ్చు.
UPI సర్కిల్ ఎలా పని చేస్తుంది?
UPI సర్కిల్‌లో, ఒకే UPI ఖాతాను ఎక్కువ వ్యక్తులు ఏకకాలంలో ఉపయోగించవచ్చు. దీనిలో ప్రైమరీ యూజర్ (Primary User), ద్వితీయ వినియోగదారును (Secondary User) యాడ్ చేయవచ్చు. ఇలా, మొత్తం ఐదుగురు సెకండరీ యూజర్లను ప్రైమరీ యూజర్ యాడ్ చేయవచ్చు. వీళ్లంతా ప్రైమరీ యూజర్ యూపీఐ ఐడీని ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు. అంటే, సెకండరీ యూజర్‌కు బ్యాంక్ ఖాతా లేకపోయినప్పటికీ, తన మొబైల్‌లోని యూపీఐ యాప్ ద్వారా ప్రైమరీ యూజర్ బ్యాంక్ ఖాతా నుంచి పేమెంట్ చేయవచ్చు. స్కూల్ లేదా కాలేజీ ఫీజ్‌లు కట్టడం లేదా ప్రైమరీ యూజర్ అందుబాటులో లేని ఇతర అత్యవసర సమయాల్లో పేమెంట్స్ ఆగకుండా యూపీఐ సర్కిల్ ఉపయోగపడుతుంది.
UPI సర్కిల్‌లో సెకండరీ యూజన్‌ను ఎలా యాడ్ చేయాలి? (How to add a secondary user to UPI circle?)
మీ UPI సర్కిల్‌లో ద్వితీయ వినియోగదారుని జోడించడానికి... మీ UPI యాప్‌ను ఓపెన్ చేసి 'UPI సర్కిల్' సెక్షన్‌లోకి వెళ్లండి. మీరు జోడించాలనుకుంటున్న ద్వితీయ వినియోగదారుకు చెందిన యూపీఐ QR కోడ్‌ను స్కాన్ చేయండి లేదా ఆ వ్యక్తి UPI IDని మాన్యువల్‌గా నమోదు చేయండి. ఇప్పుడు, మీ యూపీఐ సర్కిల్‌లో చేరేందుకు మీరు పంపిన ఆహ్వానం ద్వితీయ వినియోగదారు మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, అతను దానిని యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత, మీరు సెట్ చేసిన చెల్లింపు పరిమితులకు లోబడి, మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించి సెకండరీ యూజర్ లావాదేవీలు చేయవచ్చు.
UPI సర్కిల్‌లో, ప్రాథమిక వినియోగదారుకు రెండు రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. 1. ఫుల్ పేమెంట్ డెలిగేషన్ (full payment delegation), 2. పార్షియల్ పేమెంట్ డెలిగేషన్ (partial payment delegation). ఒక సెకండరీ యూజర్‌కు పూర్తి చెల్లింపు ప్రతినిధిగా అధికారం ఇస్తే, ఆ వినియోగదారు ఏదైనా చెల్లింపు చేసినప్పుడు ప్రాథమిక వినియోగదారుకు ఆ చెల్లింపు పూర్తయిన నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది. ఒక సెకండరీ యూజర్‌కు పాక్షిక చెల్లింపు ప్రతినిధిగా ఎంచుకుంటే, ఆ వ్యక్తి ఏదైనా చెల్లింపు చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రాథమిక వినియోగదారుకు వెళుతుంది. అప్పుడు, ప్రాథమిక వినియోగదారు పిన్ (PIN) నమోదు చేస్తేనే ఆ చెల్లింపు పూర్తవుతుంది.
UPI సర్కిల్‌లో లావాదేవీ పరిమితి (Transaction limit in UPI Circle) ఎంత?
UPI సర్కిల్‌లో, ద్వితీయ వినియోగదారుడు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఒకరోజులో అతను మొత్తం రూ. 15 వేల వరకు మాత్రమే చెల్లించవచ్చు. అంతేకాదు, ఒక లావాదేవీలో రూ. 5 వేలకు మించి చెల్లింపు చేయడానికి వీలుండదు. బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటివి లేని వ్యక్తులకు యూపీఐ సర్కిల్ చాలా ఉపయోగపడుతుంది.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ షోరూమ్‌కు వెళ్లే ముందు రేట్లు తెలుసుకోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ