By: ABP Desam | Updated at : 11 Jan 2024 01:01 PM (IST)
క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన US
US Bitcoin ETFs: క్రిప్టో అసెట్స్ రాజు బిట్‌కాయిన్ భవిష్యత్తును మార్చే కీలక అడుగు పడింది. US మార్కెట్ రెగ్యులేటర్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్' (SEC), బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు (ETFs) ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.
బిట్‌కాయిన్‌కు మాత్రమే కాదు, అమెరికన్ ఫైనాన్షియల్ మార్కెట్‌కు కూడా ఇది కీలక మలుపు. బిట్‌కాయిన్ ETFsను అగ్రరాజ్యం ఆమోదించింది కాబట్టి, మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. తద్వారా, ప్రపంచంలోనే అత్యధికంగా ట్రేడయ్యే క్రిప్టో అసెట్ బిట్‌కాయిన్ మరింత మంది పెట్టుబడిదార్లకు చేరువయ్యేందుకు తలుపు తెరుచుకుంది.
వాస్తవానికి, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు SEC ఆమోదం తెలిపింది. బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల కోసం అక్కడి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గత పది సంవత్సరాలుగా SECకి దరఖాస్తు చేస్తూనే ఉన్నాయి. బిట్‌కాయిన్ అనేది చట్టబద్ధమైన కరెన్సీ కాదని, ఊహాజనిత కరెన్సీ అని చెప్పిన SEC.. ఏ ప్రభుత్వ నియంత్రణ లేని బిట్‌కాయిన్‌లో ఒడుదొడుకులు ఎక్కువని, పెట్టుబడిదార్లకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న కారణాలతో ETFల దరఖాస్తులను తిరస్కరిస్తూ వచ్చింది. అలాంటి పెట్టుబడి మార్గాలను ప్రోత్సహించలేమని ప్రతిసారీ స్పష్టం చేసింది. దీనిపై ఫండ్ మేనేజర్లు కోర్టుకెక్కారు. బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు అనుమతి ఇవ్వకుండా SEC చెబుతున్న కారణాలు సరిపోవని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో, దాదాపు ఒక దశాబ్దం తర్వాత Bitcoin ETFలకు అనుమతి ఇవ్వడం తప్పనిసరైంది.
బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లకు అనుమతి రావడంతో... పెన్షన్ ఫండ్స్ నుంచి సాధారణ ఇన్వెస్టర్ల వరకు ఎవరైనా వీటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
బిట్‌కాయిన్ ధర జంప్
బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల మీద గ్రీన్ లైట్ పడడంతో, బిట్‌కాయిన్ రేటు ఒక్క రోజులో 1.77 శాతం మేర పెరిగింది, 46,615.31 డాలర్లకు చేరింది. 2022 మార్చి నుంచి బిట్‌కాయిన్ ధర పెరుగుతూ వస్తోంది.
లక్ష డాలర్లకు చేరుకుంటుందని అంచనా
అమెరికన్ ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, SEC ఆమోదం బిట్‌కాయిన్‌కు మాత్రమే కాకుండా మొత్తం క్రిప్టో పరిశ్రమలో (crypto industry) విప్లవాత్మక మార్పవుతుంది. ఎందుకంటే, ఇప్పుడు సంస్థాగత పెట్టుబడిదార్ల నుంచి రిటైల్ ఇన్వెస్టర్ల వరకు అందరూ ఈ క్రిప్టో కరెన్సీలో (crypto currency) పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. చిన్న పెట్టుబడిదార్లు నేరుగా బిట్‌కాయిన్ కొనకుండానే, దాని యూనిట్లలో పెట్టుబడి పెట్టొచ్చు.
స్టాండర్డ్ చార్టర్డ్ ఎనలిస్ట్‌లు చెబుతున్న ప్రకారం, ఈ ఏడాది బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లలోకి $50 బిలియన్ల నుంచి $100 బిలియన్ల వరకు పెట్టుబడులు రావచ్చు. ఫలితంగా, బిట్‌కాయిన్ ధర లక్ష డాలర్ల వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మరింత తగ్గిన నగల రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం