By: ABP Desam | Updated at : 25 May 2023 02:31 PM (IST)
అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ పొందడానికి ఈజీ వే ఇది
Unclaimed Money in India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా '100 డేస్ 100 పేస్' కార్యక్రమాన్ని (100 Days 100 Pays campaign) ప్రారంభించబోతోంది. దీని ద్వారా, భారతదేశంలోని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకులో, క్లెయిమ్ చేయని డబ్బున్న తొలి 100 ఖాతాలను గుర్తించి, 100 రోజుల లోపు ఆ మొత్తాలను ఆ ఖాతాల అసలు యజమాన్లకు అప్పగించాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ కార్యక్రమం వచ్చే నెల 1వ తేదీ (జూన్ 1, 2023) నుంచి ప్రారంభం అవుతుంది.
క్లెయిమ్ చేయని మొత్తం అంటే ఏమిటి?
పొదుపు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను 10 సంవత్సరాలకు మించి ఉపయోగించకుండా ఉంటే, అలాంటి ఖాతాను ఇన్‌యాక్టివ్ డిపాజిట్‌గా బ్యాంక్ పరిగణిస్తుంది. ఆ డబ్బును DEA ఫండ్‌లో జమ చేస్తుంది. DEA అంటే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్. ఈ ఫండ్‌ను రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తుంది.
క్లెయిమ్ చేయని మొత్తాన్ని వెనక్కు తీసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్:
మీ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని 10 సంవత్సరాలకు పైగా కదిలించకుండా ఉంటే, దానిని తిరిగి పొందడానికి కొన్ని అడుగులు వేయడం అవసరం.
ముందుగా, ఆ ఖాతాలో నామినీ పేరును జోడించాలి.
బ్యాంక్ ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల గురించి మీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయండి.
దీంతో పాటు, ఖచ్చితంగా అన్ని ఖాతాల్లో KYC అప్‌డేట్ చేయాలి. దీనివల్ల, ఖాతాదార్లకు సంబంధించిన సమాచారం బ్యాంకుకు అందుతుంది.
ఒక ఖాతా మీకు అవసరం లేకున్నా, లేదా సంవత్సరాల తరబడి ఉపయోగించకుండా ఉంటే, వెంటనే దానిని క్లోజ్ చేయండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో చేసిన జమకు సంబంధించి బ్యాంలు జారీ చేసిన అన్ని పత్రాలు/రిసిప్ట్స్‌ను భద్రంగా దాయాలి. తద్వారా, మీ FD అకౌంట్ మెచ్యూరిటీ తేదీని తెలుసుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం, క్లెయిమ్ చేయని మొత్తం స్టేటస్ తెలుసుకునే సౌకర్యాన్ని ప్రతి బ్యాంక్ తన వెబ్‌సైట్ ద్వారా కస్టమర్‌లకు అందిస్తుంది. ముందుగా, ఏదైనా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించి, ఖాతా IFSC వంటి అవసరమైన సమాచారాన్ని పొందాలి. ఆ తర్వాత బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లండి. సంబంధిత ఫారం పూరించి, KYC ప్రక్రియను పూర్తి చేయండి. ఆ తర్వాత, మీరు బ్యాంక్ ఖాతాలో ఉన్న అన్‌క్లెయిమ్డ్ మనీని మీరు పొందుతారు.
క్లెయిమ్ చేయని మొత్తాన్ని నామినీ ఎలా తీసుకోవచ్చు?
ఖాతాలో జమ చేసిన అన్‌క్లెయిమ్డ్ మొత్తాన్ని నామినీ క్లెయిమ్ చేయాలనుకుంటే, ముందుగా నామినీ వ్యక్తిగత గుర్తింపు రుజువును చూపించాలి. దీంతోపాటు, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం సహా కొన్ని అవసరమైన పత్రాలను కూడా సేకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత, బ్యాంకుకు వెళ్లి సంబంధిత ఫారాన్ని నింపాలి. ఆ అభ్యర్థనను బ్యాంక్ పరిశీలిస్తుంది. బ్యాంక్ సంతృప్తి చెందితే, క్లెయిమ్ చేయని మొత్తాన్ని నామినీకి ఇస్తుంది.
PTI రిపోర్ట్ ప్రకారం, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI వద్ద పోగుపడిన అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ రూ. 8,086 కోట్లు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 5,340 కోట్లు, కెనరా బ్యాంక్‌లో రూ. 4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 3,904 కోట్లు క్లెయిమ్ చేయకుండా పడి ఉన్నాయి.
Gold Investment: స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ లాభం ఇచ్చిన పెట్టుబడి ఇది - డబ్బుల వర్షంలో తడిసిన ఇన్వెస్టర్లు
Aadhaar Card: మీ ఆధార్ కార్డు పోయిందా?, ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా డూప్లికేట్ ఆధార్ కార్డ్ పొందొచ్చు
LIC Kanyadan Policy: మీ కుమార్తె భవిష్యత్ కోసం ఒక తెలివైన నిర్ణయం - దాదాపు రూ.23 లక్షలు లబ్ధి!
Gold-Silver Prices Today 16 Feb: ఓ మెట్టు దిగి వచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Inactive Credit Card: క్రెడిట్ కార్డ్‌ను పక్కన పడేశారా? - మీ క్రెడిట్ స్కోర్ మీ చేతులారా పాడు చేసుకుంటున్నట్లే!
Revanth Reddy: ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్