Post Office Schemes: సంపాదించుకున్న మొత్తంలో కొంత దాచుకోవాలనే ఎవరైనా అనుకుంటారు! ఆ సొమ్ముకు తగిన రాబడి రావాలని కోరుకుంటారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Fixed Deposits), రికరింగ్‌ డిపాజిట్లు చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ దన్నుతో పోస్టాఫీసులు (Post Office) కొన్ని అద్భుతమైన పథకాలు కొనసాగుతున్నాయి. బ్యాంకులను మంచి వడ్డీని అందిస్తున్నాయి. ఎలాంటి రిస్కూ ఉండదు. పైగా పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. వివిధ పథకాలపై పోస్టాఫీసు 5.5 నుంచి 7.6 శాతం వరకు వడ్డీరేటు అందిస్తున్నాయి.


Sukanya Samriddhi Yojana (SSY) -  సుకన్యా సమృద్ధి యోజన


మీకు ఆడిపిల్లలు ఉంటే డబ్బులు దాచుకొనేందుకు సుకన్యా సమృద్ధి యోజన మంచి పథకం. బాలికలకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పదేళ్లలోపు వయసున్న పిల్లల పేరుతో ఈ ఖాతాలు తెరవొచ్చు. మిగతా స్కీములతో పోలిస్తే అత్యధికంగా ఎస్‌ఎస్‌వైలో 7.6 శాతం వడ్డీని ఆర్జించొచ్చు. కేవలం రూ.250 నుంచి ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో డిపాజిట్‌ చేయొచ్చు. పైగా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి (Section 80C) కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు.


Senior Citizen Savings Scheme (SCSS) - సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌


సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ కింద ఖాతాదారులు వార్షిక ప్రాతిపదికన 7.4 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఈ ఖాతాలు తెరవాలంటే డిపాజిట్‌ దారు వయసుల 60 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉండాలి. ఇందులో రూ.1000 చొప్పున దాచుకోవచ్చు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు.


Public Provident Fund (PPF) - పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌


ఈ మధ్య చాలామంది వినియోగించుకుంటున్న స్కీమ్‌ పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌. రిటైర్మెంట్‌ తర్వాత ఒక భారీ నిధిని సమకూర్చుకొనేందుకు పీపీఎఫ్‌ ఖాతాలు తెరుస్తారు. ఒక ఆర్థిక ఏడాదిలో కనీసం రూ.500 దాచుకోవచ్చు. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. పీపీఎఫ్‌ మెచ్యూరిటీ 15 ఏళ్లు. ఖాతా తెరిచిన సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకోరు. ఈ ఖాతాలపైనా పన్ను మినహాయింపు లభిస్తోంది.