Low Price Stocks:
భారత స్టాక్ మార్కెట్లు జోష్‌లో ఉన్నాయి. సరికొత్త గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. పెద్ద మదుపర్లు భారీ స్థాయిలో పెద్ద షేర్లను కొనుగోలు చేస్తుండగా.. చిన్న రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ ధర షేర్ల కోసం వెతుకుతున్నారు. సోమవారం నాటి క్లోజింగ్‌ను బట్టి నిపుణులు రూ.100 లోపు స్టాక్స్‌ను సజెస్ట్ చేస్తున్నారు. మంచి లిక్విడిటీ, అప్పర్ సర్యూట్‌ను తాకిన కంపెనీల లిస్టు మీకోసం!
ఆశీర్వాద్ స్టీల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టీల్ ట్యూబులు, స్పాంజ్ ఐరన్ పైపులు, ద్రవ హైడ్రోకార్బన్ గ్యాస్, ద్రవ పెట్రోలియం గ్యాస్‌ను నింపే బాటిల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్టాక్స్ సోమవారం అప్పర్ సర్క్యూట్ 20 శాతాన్ని తాకాయి. రూ.34.54 వద్ద ముగిశాయి. ప్రస్తుతం 52 వారాల గరిష్ఠా స్థాయిలో కదలాడుతున్నాయి. ఏడాది కాలంగా ఈ షేరు 120 శాతం పెరగడం గమనార్హం.
ఫైనాన్షియల్ సాధనాలు, సేవలు అందించే వేదాంత్ అసెట్ లిమిటెడ్ షేర్లు పుంజుకుంటున్నాయి. ఈ కంపెనీ మ్యూచువల్ ఫండ్లు, పెట్టుబడులు, బీమా, రుణాలు, చెల్లింపుల సేవలను అందిస్తోంది. సోమవారం కంపెనీ షేర్లు 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.58.44 వద్ద ముగిశాయి. బీఎస్‌ఈలో వాల్యూమ్ 3.70 రెట్ల కన్నా ఎక్కువే ఉంది.
Also Read: సెన్సెక్స్, నిఫ్టీతో బజాజ్ ఫైనాన్స్ పోటీ - రేస్ రసవత్తరం
రెలీక్యాబ్ కేబుల్ మానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ పీవీసీ కాంపౌండ్స్, వైర్లు, కేబుల్స్‌ను విక్రయిస్తుంది. సోమవారం ఈ కంపెనీ షేర్లను విపరీతంగా కొన్నారు. దాంతో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ.68.40 వద్ద క్లోజైంది. బీఎస్‌ఈలో 2.25 రెట్ల కన్నా ఎక్కువ వాల్యూమ్ కనిపించింది. ఈ షేర్లు ఏడాది కాలంలో 103 శాతం, ఐదేళ్లలో 200 శాతం రిటర్న్స్ అందించింది.
వంద రూపాయల్లోపు స్టాక్స్ మరికొన్ని మీకోసం
కంపెనీ పేరు |
LTP (Rs) |
% ధరలో మార్పు |
ఆశీర్వాద్ స్టీల్స్ |
36.54 |
20 |
వేదాంత్ అసెట్స్ లిమిటెడ్ |
58.44 |
20 |
రెలీక్యాబ్ కేబుల్స్ |
68.4 |
20 |
జయంత్ ఇన్ఫ్రాటెక్ |
83.9 |
19.99 |
మోహిత్ ఇండస్ట్రీస్ |
27.84 |
10 |
అరిహంత్ ఫౌండేషన్ |
87.23 |
10 |
ఫీనిక్స్ టౌన్ షిప్ |
67.15 |
9.99 |
ఇకో లైఫ్ సైన్సెస్ |
68.9 |
9.99 |
సుజ్లాన్ ఎనర్జీ |
16.86 |
9.98 |
ఎడ్వెన్సా ఎంటర్ ప్రైజెస్ |
45.39 |
9.98 |
లిస్ట్ క్రెడిట్: dsij.in
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial