Bajaj Finance Shares: 'లైఫ్‌ టైమ్‌ హై' క్రియేట్‌ చేస్తూ పరుగులు పెడుతున్న సెన్సెక్స్, నిఫ్టీతో బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా రేస్‌లో ఉంది, హైడ్‌లైన్‌ ఇండీస్‌తో పోటీ పడుతోంది. ఇవాళ (మంగళవారం, 04 జులై 2023), ఇంట్రాడే ట్రేడింగ్‌లో బజాజ్ ఫైనాన్స్ షేర్లు 8% ర్యాలీ చేసి, కొత్త 52 వారాల గరిష్ట స్థాయి రూ. 7,916.70కి చేరాయి.


బిజినెస్‌ అప్‌డేట్‌తో కౌంటర్‌లో కళ
క్వార్టర్లీ బిజినెస్‌ అప్‌డేట్‌తో బజాజ్ ఫైనాన్స్ స్టాక్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉంది. Q1లో (ఏప్రిల్‌-జూన్‌ కాలం) బుక్ చేసిన కొత్త లోన్లు, అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలోని 7.42 మిలియన్లతో పోలిస్తే 34% పెరిగి 9.94 మిలియన్లకు చేరుకున్నాయని ఈ NBFC అప్‌డేట్‌ చేసింది.


కంపెనీ ఎక్సేంజ్‌ ఫైలింగ్‌ ప్రకారం.. 30 జూన్ 2023 నాటికి బజాజ్ ఫైనాన్స్‌ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) రికార్డ్‌ స్థాయి గ్రోత్‌ సాధించాయి. ఆ త్రైమాసికంలో AUM 32% వృద్ధి చెంది రూ. 2,70,050 కోట్లకు చేరుకుంది.


కస్టమర్ ఫ్రాంచైజీ 30 జూన్ 2022 నాటికి ఉన్న 60.30 మిలియన్లతో పోలిస్తే, 2023 జూన్‌ ముగింపు నాటికి 72.98 మిలియన్లకు చేరుకుంది. తద్వారా, Q1 FY24లో కస్టమర్ ఫ్రాంచైజీలో 3.84 మిలియన్లు పెరిగింది. కస్టమర్ ఫ్రాంచైజీలో ఒక త్రైమాసికంలో సాధించిన రికార్డ్‌ స్థాయి వృద్ధి ఇది.


డిపాజిట్ బుక్ కూడా Q1లో 46% గ్రోత్‌తో సుమారుగా రూ.49,900 కోట్లుగా ఉంది.


బజాజ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ టార్గెట్‌ ప్రైస్‌
కొత్త లోన్‌ సెగ్మెంట్లలోకి అడుగు పెట్టడం, కొత్త క్లయింట్ బేస్ పెరగడం కలిసి AUM వృద్ధికి సాయపడ్డాయని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ చెబుతోంది. NBFCను ఈ బ్రోకింగ్‌ హౌస్‌ పాజిటివ్‌గా చూస్తోంది, దీని టాప్‌ పిక్స్‌లో బజాజ్ ఫైనాన్స్‌ ఒకటి. ఈ స్టాక్‌కు రూ. 8,310 టార్గెట్ ప్రైస్‌తో "బయ్‌" రేటింగ్‌ కొనసాగించింది.


గత మూడు సంవత్సరాల్లో 168% & గత 10 సంవత్సరాల్లో 5,472% పెరిగిన బజాజ్ ఫైనాన్స్ స్క్రిప్‌.. గత కొన్ని దశాబ్దాలుగా దలాల్ స్ట్రీట్‌లోని అతి పెద్ద వెల్త్‌ క్రియేటర్స్‌లో ఒకటి. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు, ఈ స్టాక్ సుమారు 20% పెరిగి, మార్కెట్‌ను ఔట్‌పెర్ఫార్మ్‌ చేసింది. గత ఒక ఏడాది కాలంలో దాదాపు 40%, గత నెల రోజుల్లో దాదాపు 12% ర్యాలీ చేసింది. 


ఉదయం 10.50 గంటల సమయానికి, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 7.13% జంప్‌తో రూ.7,858.60 దగ్గర ట్రేడ్‌ అవుతున్నాయి. 


బజాజ్ ఫైనాన్స్ మాతృ సంస్థ బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు (bajaj finserv share price) కూడా ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు 4% పైగా ర్యాలీ చేశాయి. గత నెల రోజులుగా 11% పెరిగాయి. అయితే, గత ఒక సంవత్సర కాలంలో అవి దాదాపు 29% నష్టపోయాయి. 


ఉదయం 10.50 గంటల సమయానికి, బజాజ్ ఫిన్‌సర్వ్‌ షేర్లు 5.10% లాభంతో రూ.1,619.25 దగ్గర ట్రేడ్‌ అవుతున్నాయి. 


మరో ఆసక్తికర కథనం: మళ్లీ పెరుగుతున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial