By: Shankar Dukanam | Updated at : 09 Nov 2025 04:20 PM (IST)
డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడులపై సెబిహెచ్చరిక ( Image Source : Other )
Digital Gold Investment: మారుతున్న కాలంలో పాటు, బంగారంపై పెట్టుబడి పెట్టే విధానాలు మారుతున్నాయి. అయితే ఆభరణాలు, నాణేలు లేదా బార్లలో కొనుగోలు చేయడంతో పాటు.. కొందరు ఇప్పుడు డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇందులో మోసం జరిగే ప్రమాదం కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. సెబీ ఈ విషయంలో హెచ్చరిక జారీ చేసింది. డిజిటల్ బంగారం, ఈ-గోల్డ్ ఉత్పత్తులు సెక్యూరిటీలు మార్కెట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి రావని తెలిపింది. ఇవి సెబీ నియంత్రిత గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లేదా ETF, ఎలక్ట్రానిక్ గోల్డ్ బిల్స్‌కు భిన్నంగా ఉంటాయని స్పష్టం చేసింది.
ప్రస్తుతం చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం డిజిటల్ బంగారం లేదా ఈ-గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఆఫర్‌లను అందిస్తున్నాయి. అయితే వాటిమీద ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల మీ పెట్టుబడికి ప్రమాదం ఉందని తెలిపింది. డిజిటల్ గోల్డ్ సెబీ నిబంధనల పరిధిలోకి రానందున, డిజిటల్ బంగారం (Digital Gold) లేదా ఈ-గోల్డ్ ఉత్పత్తులలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా లోపం లేదా మోసం జరిగితే, వారికి సెబీ నుంచి ఎటువంటి రక్షణ లేదా సహాయం లభించదని పేర్కొంది.
మీరు ఎలక్ట్రానిక్‌గా, ఆన్‌లైన్ రూపంలో బంగారం కొనుగోలు చేస్తారు లేదా విక్రయిస్తారు దానిని డిజిటల్ బంగారం అంటారు. డిజిటల్ గోల్డ్ పెట్టుబడిని ఇంట్లో కూర్చుని మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సులభంగా చేయవచ్చు. ఇది ఈ రోజుల్లో బాగా ఫేమస్ అవుతోంది. ఇందులో మీరు కనీసం 1 రూపాయి నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. మార్కెట్‌లో బంగారం ధరను బట్టి డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. అయితే, చాలా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌లు సెబీ నియంత్రణ పరిధిలోకి రావు. అలాంటి పరిస్థితిలో మీరు డిఫాల్ట్ అయితే, మీకు సెబీ నుండి ఎటువంటి రక్షణగానీ, సహాయం గానీ లభించదు.
బంగారంపై పెట్టుబడి పెట్టవలసి వస్తే, సెబీ నిబంధనల పరిధిలోకి వచ్చే పెట్టుబడిపై ఎటువంటి ప్రమాదం లేని అనేక మార్గాలు ఇప్పటికే ఉన్నాయని సెబీ తెలిపింది. మీరు కావాలనుకుంటే సెబీలో రిజిస్టర్ అయిన మధ్యవర్తుల ద్వారా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (Gold ETFs), ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులు (EGRs), ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ప్రస్తుతం తనిష్క్ Tanishq, ఆదిత్య బిర్లా క్యాపిటల్ Aditya Birla Capital, ఫోన్ పే PhonePe, Caratlane, MMTC- PAMP, జాయ్ అలుకాస్ Joy Alukkas, శ్రీరామ్ ఫైనాన్స్ (Shriram Finance) వంటి అనేక కంపెనీలు డిజిటల్ బంగారాన్ని విక్రయిస్తున్నాయి. అయితే, సెబీ నియంత్రణలో లేనందున వీటిలో కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. అయితే Tanishq, MMTC-PAMP తమ వెబ్‌సైట్‌లో సేఫ్‌గోల్డ్ బ్రాండ్‌తో డిజిటల్ గోల్డ్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇది 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఓ మార్గం. ఇందులో పెట్టుబడిదారులు కేవలం 10 నుంచి 100 రూపాయలతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు.
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
IndiGo Flight Crisis : ఈ తేదీ వరకు ఇండిగో టికెట్ రద్దు చేస్తే పూర్తి రీఫండ్! పూర్తి వివరాలు తెలుసుకోండి!
Airtel Recharge Plan: ఎయిర్టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ! రెండు చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లను సైలెంట్‌గా క్లోజ్!
Gold Price: బంగారం ధర 15నుంచి 30 శాతం వరకు పెరిగే ఛాన్స్! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడి!
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Patanjali AP Investments: విశాఖలో పెట్టుబడులకు పతంజలి నిర్ణయం.. త్వరలో తొలి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు
Arshdeep Singh Records: తొలి టీ20లో భువనేశ్వర్ రికార్డ్ సమం చేసిన అర్షదీప్ సింగ్.. నెక్ట్స్ టార్గెట్ అదే
Film Prediction 2026: దక్షిణాది దూకుడు, హిందీ సినిమాల జోరు, OTTలో కొత్త ట్రెండ్స్! 2026లో సినీ ఇండస్ట్రీలో భారీ మార్పులు!
Type-2 Diabetes Risk : స్వీట్స్ కాదు.. రోజూ తింటున్న ఈ ఫుడ్స్ వల్లే షుగర్ పెరుగుతుందట, నిపుణుల హెచ్చరికలు ఇవే