Stock Market News: వడ్డీ రేట్ల పెంపులో దూకుడు కొనసాగిస్తామని యూఎస్‌ ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చెప్పిన మాటతో ఇన్వెస్టర్లలో మళ్లీ వణుకు మొదలైంది. మార్కెట్లు ఇంకెంత పడతాయో, కొంప ఇంకెంత మునుగుతుందోనని గాభరా పడుతున్నారు. అయితే,  ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాణ్యతమైన షేర్లు ఇన్వెస్టర్లకు అండగానే నిలబడతాయి. అలాంటి కొన్ని క్వాలిటీ స్టాక్స్‌ని ఎనలిస్ట్‌లు ట్రాక్‌ చేసి, మనకు రికమెండ్‌ చేశారు. ప్రస్తుత మార్కెట్‌ ధర నుంచి అవి 11% నుంచి 26% వరకు పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. సోమవారం నాటి ముగింపు ధరను ఆధారంగా చేసుకుని, వృద్ధి అవకాశ శాతాన్ని బ్రోకరేజ్‌లు లెక్కించాయి. ప్రసిద్ధ బ్రోకరేజ్‌లు చేసిన స్టాక్‌ రికమెండేషన్స్‌ మీ కోసం...


కోల్‌ ఇండియా ( COAL INDIA ‌)
టార్గెట్‌ ధర : రూ.290
సోమవారం నాటి ముగింపు ధర: రూ.231.4
వృద్ధి అవకాశం: 25.3%
బ్రోకరేజ్‌: మోతీలాల్‌ ఓస్వాల్‌


ఈ స్టాక్‌ మీద బయ్‌ రికమండేషన్‌తో, టార్గెట్‌ ధరను రూ.275 నుంచి రూ.290కి ఈ బ్రోకరేజ్‌ పెంచింది.


గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికాంట్స్‌ ఇండియా ( GULF OIL LUBRICANTS INDIA )
టార్గెట్‌ ధర : రూ.562
సోమవారం నాటి ముగింపు ధర: రూ.479.4
వృద్ధి అవకాశం: 17.2%
బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌


రూ.455-461 రేంజ్‌లో ఈ స్టాక్‌ను కొత్తగా కొనవచ్చని, రూ.402కి పడిపోతే మరిన్ని కూడగట్టుకోవచ్చని బ్రోకరేజ్‌ సూచించింది.


అరబిందో ఫార్మా ( AUROBINDO PHARMA )
టార్గెట్‌ ధర : రూ.675
సోమవారం నాటి ముగింపు ధర: రూ.540 
వృద్ధి అవకాశం: 25%
బ్రోకరేజ్‌: ఆనంద్‌ రాఠీ


మూడు నెలల కాలానికి బుల్లిష్‌ బెట్స్‌ తీసుకోవచ్చని బ్రోకరేజ్‌ చెబుతూ, రూ.472ను స్టాప్‌ లాస్‌గా చెప్పింది.


హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ ( HOME FIRST FINANCE )
టార్గెట్‌ ధర : రూ.1,100
సోమవారం నాటి ముగింపు ధర: రూ.955 
వృద్ధి అవకాశం: 15.2%
బ్రోకరేజ్‌: ఇన్వెస్టెక్‌ ఇండియా


ఈ స్టాక్‌ మీద బయ్‌ కాల్‌ను కొనసాగిస్తూ, టార్గెట్‌ ధరను రూ.950 నుంచి రూ.1100కి బ్రోకరేజ్‌ పెంచింది. 


మారుతి సుజుకి ( MARUTI SUZUKI )
టార్గెట్‌ ధర : రూ.9,839
సోమవారం నాటి ముగింపు ధర: రూ.8,835
వృద్ధి అవకాశం: 11.4%
బ్రోకరేజ్‌: మోర్గాన్‌ స్టాన్లీ


ఈ కంపెనీ రెండు కొత్త ప్రాజెక్ట్‌లు (సుజుకి మోటార్ గుజరాత్ ఈవీ బ్యాటరీ తయారీ ఫ్లాంటు, హర్యానాలో వాహన తయారీ ఫ్లాంటు మొదటి దశ) ప్రారంభించడంతో, బ్రోకరేజ్‌ ఈ స్టాక్‌ మీద 'బుల్లిష్‌ వ్యూ'తో ఉంది, ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.