Gold-Silver Price: దేశవ్యాప్తంగా బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు కాస్త తగ్గింది. 10 గ్రాములకు దాదాపు రూ.150 తగ్గింది. కిలో వెండి ధర కూడా నేడు రూ.800 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మార్పులు కనిపించాయి.
తెలంగాణలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Telangana)
22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.51,430 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.60,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో పసిడి ధర (Gold Rate in Vijayawada) ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,430 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.60,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.60,000 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి (Today's Gold Rate in Major Cities)
ఇతర నగరాల్లో బంగారం ధర నేడు తగ్గింది. చెన్నై (Gold Rate in Chennai) నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది.
ప్లాటినం ధర నేడు (Today's Platinum Rate) ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నిన్నటితో పోలిస్తే నేడు (Today's Platinum Rate) నిలకడగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.22,130 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలోనూ 10 గ్రాముల ప్లాటినం ధర ఇదే.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
మన దేశంలో పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక రకాల పరిణామాల మీద ఈ ధరల మార్పు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఈ కారణాల్లో ఒకటి. ఇలా ప్రపంచ మార్కెట్‌లో గోల్డ్ రేటు పెరగడానికి కూడా చాలా కారకాలు పని చేస్తాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.