Stock Market Closing Bell 29 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,350 దిగువనే ఆగిపోతే, సెన్సెక్స్‌ 861 పాయింట్లు కోల్పోయి క్లోజయింది. ఐటీ స్టాక్స్‌ మీద గట్టిగా దెబ్బపడింది.


Stock Market Closing Bell 24 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం స్ట్రాంగ్‌ గ్యాప్‌డౌన్‌లో ఓపెన్‌ అయిన మార్కెట్లు, హెవీ వెయిట్‌ రిలయన్స్‌ షేరులో వచ్చిన కొనుగోళ్ల పుణ్యమాని కొద్దిగా కోలుకున్నాయి. నష్టాలను కొంత పూడ్చుకున్నప్పటికీ, లాభాల్లోకి రావడంలో మాత్రం విఫలమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 246 పాయింట్లు లేదా 1.40 శాతం నష్టపోగా .. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 861 పాయింట్లు కోల్పోయింది.


BSE Sensex


బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇవాళ 57,367 వద్ద మొదలైంది. ఇదే దాని ఇంట్రాడే కనిష్ఠం కూడా. 57,367.47 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 861.25 పాయింట్లు లేదా 1.46 శాతం నష్టంతో 57,972.62 వద్ద ముగిసింది.


NSE Nifty


ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇవాళ 17,188.65 వద్ద ఓపెనైంది. 17,166.20 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,380.15 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 246 పాయింట్లు లేదా 1.40 శాతం నష్టంతో 17,312.90 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ కూడా భారీ నష్టాల్లో లాభాల్లో క్లోజైంది. 710.45 పాయింట్లు లేదా 1.82 శాతం కోల్పోయి 38,276.70 వద్ద ముగిసింది.


Gainers and Lossers






నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో ముగిస్తే, ఏకంగా 38 నష్టాల్లో ముగిశాయి. బ్రిటానియా, మారుతి, నెస్టిల్‌ ఇండియా, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ గెయినర్స్‌గా లాభాల్లో క్లోజ్‌ అవగా... టెక్‌ మహీంద్ర, ఇన్ఫోసిస్‌, విప్రో, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ టాప్‌ లూజర్స్‌గా నష్టాల్లో ఆగిపోయాయి. నిప్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ ఆయిల్‌ & గ్యాస్‌ కొద్దిపాటి లాభాలతో పచ్చరంగు పులుముకోగా... మిగిలిన ఇండీసెస్‌ అన్నీ ఎరుపు రంగులోనే ఉన్నాయి. టాప్‌ లూజర్‌ నిఫ్టీ ఐటీ. ఇది దాదాపు 3.53 శాతం పడిపోగా, నిఫ్టీ మీడియా 2 శాతం కోల్పోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.