By: ABP Desam | Updated at : 27 Mar 2023 12:01 PM (IST)
Edited By: Arunmali
ఖరీదైన ఇళ్లే కావాలంటున్న జనం
Premium Housing Sales: దేశంలో ఇళ్ల ధరలు పెరిగిన తర్వాత కూడా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు, పైగా పెరిగింది. 2023 జనవరి-మార్చి కాలంలో, దేశంలోని టాప్-7 నగరాల్లో గృహ విక్రయాలు 14 శాతం వృద్ధితో 1.13 లక్షల యూనిట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇళ్ల ధరలు 6 నుంచి 9 శాతం పెరిగిన తర్వాత కూడా అమ్మకాల్లో పెరుగుదల కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ (Anarock) వెల్లడించింది.
దేశంలోని టాప్-7 నగరాల్లో (దిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్‌కతా) అనరాక్ కంపెనీ చేసిన సర్వేలో (Anarock survey) ఈ విషయాలు వెల్లడయ్యాయి. గృహ రుణ వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అమ్మకాలలో విజృంభణ కొనసాగుతోందని, ఇది గత దశాబ్దంలో అత్యధిక త్రైమాసిక విక్రయాలుగా అనరాక్ వెల్లడించింది.
అనరాక్ డేటా ప్రకారం.. 2023 జనవరి-మార్చి కాలంలో 1,13,770 యూనిట్లు (ఇండిపెండెంట్, ఫ్లాట్స్ కలిపి) అమ్ముడవుతాయని అంచనా. గత ఏడాది ఇదే సమయంలో ఈ లెక్క 99,550 యూనిట్లుగా ఉంది. దీనిని బట్టి, ఈ సంవత్సరం 14 శాతం పెరుగుదలను అనరాక్ అంచనా వేసింది.
రెండు నగరాల్లోనే దాదాపు సగం విక్రయాలు
ఈ మొత్తం విక్రయాల్లో కేవలం ముంబై, పుణె నుంచే 48 శాతం వాటా కనిపిస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోనూ హౌసింగ్ సేల్స్‌లో వృద్ధి కనిపించగా, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మాత్రం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.
ఖరీదైన ఇళ్లకు అధిక డిమాండ్
2023 ప్రారంభం నుంచి గృహ డిమాండ్ పెరుగుతోంది, మొదటి త్రైమాసికంలోనే 2022లోని గరిష్ట స్థాయిని అధిగమించామని అనరాక్ చైర్మన్ అనూజ్ పురి చెప్పారు. ఈ త్రైమాసికంలో, ప్రీమియం ఇళ్లకు అంటే రూ. 1.5 కోట్ల ధర పైబడిన ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని వెల్లడించారు.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో సొంతింటి విక్రయాలు జనవరి-మార్చిలో 19 శాతం పెరిగి 34,690 యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా. ఓవరాల్‌గా చూస్తే మాత్రం.. ద్రవ్యోల్బణం, బ్యాంకు రేట్ల నిరంతర పెరుగుదల గృహ విక్రయాల డిమాండ్‌ను తగ్గిస్తుందని; ఆర్‌బీఐ రెపో రేటు పెరగడం వల్ల హౌసింగ్ మార్కెట్‌పై ప్రభావం పడుతుందని అనూజ్ పురి చెప్పారు.
ఎక్కడ, ఎన్ని యూనిట్లు విక్రయించే అవకాశం?
2022 జనవరి-మార్చి కాలంలోని సేల్స్‌ను 2023 ఇదే కాలంతో పోలిస్తే... పుణెలో గృహాల విక్రయాలు 42 శాతం వృద్ధితో 14,020 యూనిట్ల నుంచి 19,920 యూనిట్లకు పెరగవచ్చు. దిల్లీ ఎన్‌సీఆర్‌లో 9 శాతం క్షీణించి 18,835 యూనిట్ల నుంచి 17,160 యూనిట్లకు తగ్గవచ్చు. బెంగళూరులో నివాస ప్రాపర్టీ విక్రయాలు 16 శాతం పెరిగి 15,660 యూనిట్లకు చేరుకోవచ్చని అంచనా. చెన్నైలో 5,880 యూనిట్లు, కోల్‌కతాలో 6,180 యూనిట్లు విక్రయించే అవకాశం ఉంది.
UPI Payments Record: ఫోన్ తియ్, స్కాన్ చెయ్ - యూపీఐని మామూలుగా వాడడం లేదుగా!
Stock Market Crash: '1996 పీడకల' రిపీట్ అవుతుందా, 30 ఏళ్ల రికార్డ్ బద్ధలవుతుందా? - స్టాక్ మార్కెట్‌లో ఒకటే టెన్షన్
Bank Holidays In March: మార్చి నెలలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు - ఇదిగో ఫుల్ హాలిడేస్ లిస్ట్
Gold-Silver Prices Today 01 Mar: రూ.87000కు దిగొచ్చిన పసిడి రేటు - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gas Cylinder Price Hike: పండుగలు, పెళ్లిళ్ల టైమ్‌లో జనం నెత్తిన 'బండ' - పెరిగిన గ్యాస్ సిలిండర్ రేట్లు
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘనవిజయం.. నాకౌట్ జట్ల ఖరారు.. రేపు కీలక మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు