By: Arun Kumar Veera | Updated at : 24 May 2024 09:18 AM (IST)
ఈపీఎఫ్‌వోలో చాలా రకాల పెన్షన్లు - ఏ పింఛనుకు ఎవరు అర్హులు?
EPFO Pension Scheme Types: మన దేశంలోని ఉద్యోగులు, కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organisation లేదా EPFO) కీలకంగా పని చేస్తోంది. పని చేస్తున్న ఉద్యోగులు/ కార్మికులు తమ జీతంలో 12% మొత్తాన్ని EPFO ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ యజమాన్యం కూడా ప్రతి నెలా అంతే మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. ఇలా పోగైన డబ్బు, ఉద్యోగి/ కార్మికుడు పనిని మానేసిన తర్వాత పదవీ విరమణ ప్రయోజనం & పింఛను రూపంలో అందుతుంది. ఉద్యోగులు/ కార్మికుల కోసం EPF, ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS), బీమా పథకాన్ని (EDLI) ఈపీఎఫ్‌వో నిర్వహిస్తుంది.
EPS ప్రయోజనం పొందేందుకు అర్హతలేంటి?
EPS ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా EPFO సభ్యుడై ఉండాలి. ముందస్తు పెన్షన్ పొందడానికి కనీసం 50 ఏళ్ల వయస్సు, సాధారణ పెన్షన్ కోసం 58 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. కనీసం 10 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఉండాలి.
EPS పెన్షన్ల రకాలు
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద వివిధ రకాల పింఛను పథకాలు ఉన్నాయి. EPFO సభ్యులు, ఆ కుటుంబంలోని వ్యక్తులు, నామినీలు ఈ పెన్షన్లకు అర్హులు.
వితంతువు కోసం పింఛను (Widow Pension): వితంతువు చనిపోయేవరకు లేదా ఆమె మళ్లీ వివాహం చేసుకునే వరకు విడో పెన్షన్ వస్తుంది. ఒకవేళ, ఒక కుటుంబంలో ఎక్కువ మంది వితంతువులు ఉంటే, వయస్సులో అందరి కంటే పెద్ద మహిళకు ఈ పింఛను అందుతుంది.
పిల్లల కోసం పింఛను (Child Pension): పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వితంతు పింఛనుతో పాటు ఛైల్డ్ పెన్షన్ తీసుకుంటారు. 25 ఏళ్ల వయస్సు వచ్చే నాటికి ఆ పిల్లలు ఏదోక ఆదాయం సంపాదించే స్థాయికి చేరతారన్న ఉద్దేశంతో ఆ వయోపరిమిని నిర్ణయించారు. ఛైల్డ్ పెన్షన్ వితంతు పింఛనులో 25%గా ఉంటుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఈ ప్రయోజనం పొందవచ్చు.
ముందస్తు పింఛను (Reduced Pension): సాధారణ పదవీ విరమణ వయస్సు కంటే ముందు నుంచే తీసుకునే పెన్షన్ ఇది. దీని కోసం, ఉద్యోగి/ కార్మికుడు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. 50 ఏళ్ల నుంచి 58 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అయితే, ఈ రకమైన పింఛన్ ప్లాన్‌తో కొంత నష్టం ఉంటుంది. దీనిలో, ఫింఛను మొత్తం ప్రతి సంవత్సరం 4% తగ్గుతుంది. అందుకే దీనిని 'రెడ్యూస్డ్ పెన్షన్ ప్లాన్' అని పిలుస్తారు.
అనాథ పిల్లల కోసం పింఛను (Orphan Pension): దురదృష్టవశాత్తు EPFO సభ్యుడు మరిణిస్తే, ఈ కేస్‌లో వితంతు పింఛను పొందే వ్యక్తి కూడా లేకపోతే, ఆ కుటుంబంలోని పిల్లలు ఆర్థిక భద్రత కోల్పోతారు. ఇలా జరక్కుండా, ఆ పిల్లలకు అనాథ పింఛన్‌ను EPFO అందిస్తుంది. వితంతు పెన్షన్‌లో 75% మొత్తం ఆర్ఫాన్ పెన్షన్ రూపంలో అందుతుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఈ ప్రయోజనం పొందొచ్చు.
మరో ఆసక్తికర కథనం: నయా అప్‌డేట్ - ఆధార్ లింక్ కాకపోయినా EPF డెత్ క్లెయిమ్ ఆలస్యం కాదు
New Year Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్ ప్లాన్‌తో కొత్త సంవత్సరం ప్రారంభించండి - ఏడాదంతా మీకు తిరుగుండదు!
Bank Timings Changed: బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - అన్ని బ్యాంకుల పని వేళల్లో మార్పులు
Bank Cheque: బ్యాంక్ చెక్కుల్లో 9 రకాలు - ఏది, ఎక్కడ ఉపయోగిస్తారో మీకు తెలుసా?
Gold-Silver Prices Today 18 Dec: ఈ రోజు చవకగా బంగారం కొనే అవకాశం - మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Investment Secret: డబ్బులు సంపాదించే ట్రిక్ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్ ఎవరూ మీకు చెప్పి ఉండరు!
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!