By: Arun Kumar Veera | Updated at : 31 Jan 2024 03:17 PM (IST)
ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లకు అలర్ట్
NPS Account New Withdrawal Rules: కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఉత్తమ పెన్షన్ స్కీమ్స్‌లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System - NPS) ఒకటి. జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తం దీనిలో జమ చేస్తూ పోతే, రిటైర్‌మెంట్ నాటికి పెద్ద మొత్తం (Corpus) పోగుపడుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత జీవన ప్రయాణం ఒడిదొడుకులు లేకుండా సాగడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA), 2024 జనవరి 12న ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం, NPS అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి (partial withdrawal of pension) కొత్త రూల్స్ జారీ అయ్యాయి. 2024 ఫిబ్రవరి 01వ తేదీ ఆ కొత్త రూల్స్ అమలవుతాయి.
ఎన్‌పీఎస్ కొత్త నిబంధనలు (New Rules for withdrawal of money from NPS account):
2024 ఫిబ్రవరి 01 నుంచి, NSP అకౌంట్‌లో ఉన్న డబ్బులో యజమాన్యం వాటాను మినహాయించి, చందాదార్లు కట్టే వాటా నుంచి మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా 25 శాతం మించకుండా ఉపసంహరించుకోవడానికే అనుమతి ఉంటుంది. అలాగే, కాంట్రిబ్యూషన్ మీద ఆదాయాన్ని పాక్షికంగా వెనక్కు తీసుకునే అవకాశం లేదు.
కొన్ని ప్రత్యేక పరిస్థితుల కోసం మాత్రమే NPS ఖాతా నుంచి డబ్బును పాక్షికంగా ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇస్తారు. అవి:
- పిల్లల ఉన్నత చదువుల కోసం. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు కూడా వర్తింపు.
- పిల్లల వివాహ ఖర్చుల కోసం. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకు వర్తింపు.
- చందాదారు పేరిట ఇల్లు కట్టుకోవడం లేదా కొనడానికి. జాయింట్ ఓనర్‌షిప్ కూడా కవర్ అవుతుంది. ఇండివిడ్యువల్ హౌస్ లేదా అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు ఇది వర్తిస్తుంది. పూర్వీకుల ఆస్తి కాకుండా, సబ్‌స్క్రైబర్‌కు ఇప్పటికే నివాస ఆస్తి ఉంటే పెన్షన్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు.
- దీర్ఘకాలిక/ప్రాణాంతక వ్యాధుల చికిత్స ఖర్చుల కోసం. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, కొవిడ్-19 ఇతర పెద్ద స్థాయి జబ్బులు ఈ పరిధిలోకి వస్తాయి.
- చందాదారుకు అవయవ వైకల్యం ఉండి, దానికి అవసరమైన వైద్య ఖర్చుల కోసం.
- స్టార్టప్ లేదా కొత్త వెంచర్‌ను ఏర్పాటు చేసేందుకు.
- నైపుణ్యం పెంచుకోవడానికి
పెన్షన్ ఖాతా నుంచి పాక్షికంగా ఎలా ఉపసంహరించుకోవాలి? (How to withdraw pension from NPS account?)
- ఫిబ్రవరి 01 తర్వాత NPS అకౌంట్ నుంచి పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేయాలంటే.. పైన చెప్పిన ఏదోక పరిస్థితిని కారణాన్ని చూపుతూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. దీనిని, సంబంధిత ప్రభుత్వ నోడల్ ఆఫీస్ లేదా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీకి (CRA) సబ్మిట్ చేయాలి.
- చందాదారు అనారోగ్యంతో ఉంటే, అతని తరపున కుటుంబ సభ్యుడు కూడా డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఆ తర్వాత, CRA చందాదారు బ్యాంక్‌తో ఒక 'పెన్నీ డ్రాప్' టెస్ట్ నిర్వహిస్తుంది. అంటే, డిక్లరేషన్‌లో ఇచ్చిన అకౌంట్ వివరాలు సదరు చందాదారువో, కాదో తెలుసుకోవడానికి అత్యంత స్వల్ప మొత్తాన్ని (ఒక్క రూపాయి కూడా కావచ్చు) చందాదారు బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేస్తుంది.
- వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని 'పెన్నీ డ్రాప్' టెస్ట్‌లో తేలితే, ఆ తర్వాత మాత్రమే సబ్‌స్క్రైబర్ కోరిన మొత్తం ఆ ఖాతాకు బదిలీ అవుతుంది.
కనీసం మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్న NPS అకౌంట్ నుంచి మాత్రమే 25% పార్షియల్ విత్‌డ్రాకు అర్హత లభిస్తుంది. పాక్షిక ఉపసంహరణల కోసం, ఒక్కో సబ్‌స్క్రైబర్‌కు మూడుసార్లు మాత్రమే అవకాశం ఇస్తారు. ఒకసారి డబ్బు తీసుకున్న తర్వాత మరోమారు విత్‌డ్రాకు ప్రయత్నిస్తే... చివరి ఉపసంహణ తేదీ తర్వాత జమ చేసిన మొత్తం నుంచి మాత్రమే డబ్బు తీసుకోవడానికి అనుమతిస్తారు.
మరో ఆసక్తికర కథనం: మీకు అంత జీతం అవసరమా? లావైపోతారు, తిరిగి ఇచ్చేయండి
Joint Income Tax Return: పన్ను ఆదా చేయడానికి భార్యాభర్తలు ఉమ్మడిగా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చా - రూల్స్ ఏం చెబుతున్నాయి?
Bad Credit Score: పూర్ క్రెడిట్ స్కోర్‌తో పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి? - ఈ చిట్కాలు మీకు పనికొస్తాయి
Bitcoin At All-time High: ట్రంప్ బ్యాకప్, బిట్‌కాయిన్ ఊపు - ప్రమాణ స్వీకారానికి ముందు ఆల్ టైమ్ హై
Crypto Currency: ట్రంప్ పేరిట ఒక మీమ్ కాయిన్ - గంటల వ్యవధిలో 300 శాతం జంప్
Gold-Silver Prices Today 20 Jan: గోల్డ్ కొనేవాళ్లకు చుక్కలు చూపిస్తున్న ట్రంప్ - ప్రమాణ స్వీకారం వేళ పెరిగిన రేట్లు
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క