By: ABP Desam | Updated at : 11 Mar 2023 01:31 PM (IST)
Edited By: Arunmali
80C ఒక్కటే కాదు, ఇంకొన్ని సెక్షన్ల కిందా ₹4 లక్షల వరకు బెనిఫిట్
Tax Saving Tips Options: 2023-24 బడ్జెట్‌లో, కొత్త పన్ను విధానంలో పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. ఇది, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం. ఇది కొత్త పన్ను విధానం. ఇందులో వివిధ సెక్షన్ల కింద డిడక్షన్స్ ఉండవు. మీ ఆదాయం రూ. 7 లక్షలు దాటితే, స్లాబ్ విధానం ప్రకారం ఆదాయ పన్ను చెల్లించాలి.
అయితే, మీరు పాత ఆదాయ పన్నును ఫాలో అయితే డిడక్షన్స్ ఉంటాయి. ఈ విధానంలో, ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద (Tax Saving under Section 80C) రూ. 1.5 లక్షల వరకు వార్షిక మినహాయింపును కేంద్రం ఇస్తోంది, దీని గురించి చాలా మందికి తెలుసు.
ఆదాయపు పన్ను సెక్షన్ 80C కాకుండా, ఆదాయ పన్ను ఆదా కోసం మరికొన్ని ఇతర సెక్షన్లు కూడా ఉన్నాయి. వాటి ద్వారా మీరు లక్షల రూపాయల వరకు పన్నును ఆదా చేయవచ్చు. వాటిలో కొన్ని ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.
జాతీయ పింఛను పథకం (National Pension System లేదా NPS)
మీరు NPS పథకం కింద పెట్టుబడి పెడితే, సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అంటే మీ వార్షిక ఆదాయపు పన్ను రూ. 50,000 కంటే ఎక్కువ వస్తే, మీరు దీని కింద రూ. 50,000 తగ్గింపును తీసుకోవచ్చు.
ఆరోగ్య బీమా ప్రీమియం
ఆదాయపు పన్ను సెక్షన్ 80D కింద, మీరు ఆరోగ్య బీమా కోసం చెల్లించిన ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రూ. 25 వేల నుంచి రూ. 1 లక్ష వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పన్ను చెల్లింపుదార్లు రూ. 25,000 ప్రీమియం మీద పన్ను రాయితీని పొందవచ్చు. ఇది కాకుండా, తల్లిదండ్రుల పేరు మీద మీరు కట్టే ప్రీమియంపైనా రూ. 25 వేల పన్ను మినహాయింపు తీసుకోవచ్చు.
గృహ రుణంపై పన్ను మినహాయింపు
మీరు ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, మీరు రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆ ఇంటిని మీ సొంత ఉపయోగం కోసం ఉండాలి.
పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీపై రాయితీ
సేవింగ్స్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసే వాళ్లు ఆదాయపు పన్ను సెక్షన్ 80TTA ప్రకారం రూ. 10,000 వార్షిక వడ్డీపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అన్ని బ్యాంకుల పొదుపు ఖాతాలకు ఈ సెక్షన్ వర్తిస్తుంది. మరోవైపు, ఎక్కువ పొదుపు ఖాతాలను కలిగి ఉన్న సీనియర్ సిటిజన్లకు, 80TTB కింద రూ. 50,000 వార్షిక వడ్డీ ఆదాయం వరకు పన్ను ఉండదు.
స్వచ్ఛంద సేవ సంస్థలకు ఇచ్చే విరాళాలపై పన్ను మినహాయింపు
ఛారిటబుల్ ఇన్‌స్టిట్యూట్స్ లేదా స్వచ్ఛంద సేవ సంస్థలకు మీరు ఇచ్చే విరాళాల మీద కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80CCC కింద, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన మొత్తాన్ని మినహాయింపుగా మీరు క్లెయిమ్ చేయవచ్చు. మీరు రూ. 200 కంటే ఎక్కువ మొత్తంలో ఇచ్చిన విరాళాల మీద ఆదాయ పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు.
Retirement Corpus: రూ.50 కోట్లకు అధిపతిగా రిటైర్ అవ్వండి - మీకు ఎవరూ చెప్పని ఆర్థిక సూత్రం ఇది!
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
Gold-Silver Prices Today 08 Jan: స్వల్పంగా పెరిగిన గోల్డ్, రూ.లక్ష నుంచి తగ్గని సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Gold-Silver Prices Today 07 Jan: గోల్డ్ కొనేవాళ్లకు ఊరట, రూ.లక్షకు చేరిన సిల్వర్ - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
PVC Aadhaar Card: క్రెడిట్ కార్డ్‌లా మెరిసే PVC ఆధార్ కార్డ్ - ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేయొచ్చు
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
PM Modi News: విశాఖలో ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే- లోకేష్ నమో నమః స్పీచ్
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
Fake Customer Care Calls: ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్‌ను ఇలా గుర్తించండి - వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం!