search
×

March 31 deadline: డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది! 31లోపు డబ్బు పరంగా ఇవన్నీ చేసేయండి.. లేదంటే!

March 31 deadline: 2021 ఆర్థిక ఏడాది (Financial Year) ఎండింగ్‌కు వచ్చేసింది. కొన్ని డెడ్‌లైన్లు మార్చితోనే ముగిసిపోతున్నాయి. ఆలస్యం చేస్తే ఫైన్లు కట్టక తప్పుదు.

FOLLOW US: 
Share:

Financial Tasks To Complete in March 2022: 2021 ఆర్థిక ఏడాది (Financial Year) ఎండింగ్‌కు వచ్చేసింది. డబ్బుకు (Money)  సంబంధించి కొన్ని డెడ్‌లైన్లు మార్చితోనే ముగిసిపోతున్నాయి. సవరించిన లేదా బిలేటెడ్‌ ఐటీఆర్‌ను దాఖలు చేయడం, పాన్‌తో ఆధార్‌ను అనుసంధానించడం, బ్యాంకు ఖాతా కేవైసీ పూర్తి చేయడం వంటివి ఉన్నాయి. ఆయా అంశాల తుది గడువులను ముందుగానే తెలుసుకొని పూర్తి చేయడం ముఖ్యం. లేదంటే జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపులు కోల్పోవాల్సి వస్తుంది.

Aadhaar-PAN link । పాన్‌తో ఆధార్‌ అనుసంధానం

మనం చేసే ప్రతి లావాదేవీకి పాన్‌ కార్డు ఎంతో అవసరం. పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు 2022, మార్చి 31 చివరి తేదీ. ఇప్పటి వరకు పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయని వాళ్లు గడువులోగా ఆ పని చేయాలి. ఒకవేళ మీరు పాన్‌, ఆధార్‌ను అనుసంధానించకపోతే ఏప్రిల్‌ నుంచి పాన్‌ కార్డు చెల్లుబాటు కాదు. డబ్బు పరంగా లావాదేవీలు చేపట్టాల్సినప్పుడు పెనాల్టీలు కట్టాల్సి ఉంటుంది. ఇన్‌వాలిడ్‌ పాన్ కార్డును తీసుకెళ్తే సెక్షన్‌ 272B కింద రూ.10,000 వరకు పెనాల్టీ విధిస్తారు.

Bank account KYC update । బ్యాంకు కేవైసీ అప్‌డేట్‌

వాస్తవంగా బ్యాంకు కేవైసీ పూర్తి చేసేందుకు 2021, డిసెంబర్‌ 31 తుది గడువు. ఒమిక్రాన్‌ వేరియెంట్‌ వ్యాపించడంతో భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) దీనిని 2022, మార్చి 31 వరకు పొడగించింది. ఒకవేళ మీరు కేవైసీ వివరాలు ఇవ్వకపోతే మీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్‌ చేస్తారు.

Advance tax installment । అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లింపు 

ముందుగా అంచనా వేసిన పన్ను రూ.10,000 కన్నా ఎక్కువగా ఉంటే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 208 ప్రకారం వారు అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లించాలి. దీనిని నాలుగు వాయిదాల్లో కట్టొచ్చు. మొదటి వాయిదాకు జూన్‌ 15, రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌కు సెప్టెంబర్‌ 15, మూడో వాయిదాకు డిసెంబర్‌ 15, నాలుగో వాయిదాకు మార్చి 15 చివరి తేదీలుగా ఉంటాయి. గత త్రైమాసికాల్లో అడ్వాన్స్‌ టాక్స్‌ వాయిదాలు చెల్లిస్తే ఈ నెల 15లోపు ఆఖరి వాయిదా చెల్లించాలి.

Tax saving investments । పన్ను ఆదా చేసే పెట్టుబడులు

పన్ను చెల్లింపు దారులు తమ పన్ను మినహాయింపు ప్రక్రియను ఇప్పట్నుంచే ప్రారంభించాలి. పెట్టుబడులను సమీక్షించుకోవాలి. పన్ను మినహాయింపు లభించే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), ఈఎల్‌ఎస్‌ఎస్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ (ELSS Mutual Funds), జాతీయ పింఛను పథకం (NPS) వంటివి అసెస్‌ చేసుకోవాలి.

Belated or revised ITR । బిలేటెడ్‌ ఐటీఆర్‌

సవరించిన లేదా బిలేటెడ్‌ ఐటీఆర్‌ను దాఖలు చేసేందుకు 2022, మార్చి 31 చివరి తేదీ. ఆలస్యంగా ఐటీఆర్‌ను ఈ-ఫైల్‌ చేసిన వ్యక్తులు దానిని ఎడిట్‌ చేసేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉంది.

Published at : 22 Mar 2022 05:53 PM (IST) Tags: Kyc Update Income Tax Returns ITR Filing PAN Aadhaar Link Tax Planning Advance Tax Installments Deadlines in March

ఇవి కూడా చూడండి

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Provident Fund: ఈపీఎఫ్‌ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!

Provident Fund: ఈపీఎఫ్‌ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!

Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి

Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి

Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ