By: ABP Desam | Updated at : 20 May 2023 05:30 AM (IST)
పర్సనల్ లోన్ కంటే ఎల్‌ఐసీ లోన్ పరమ బెటర్
LIC Loan Against LIC Policy: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) అంటే ప్రజల్లో ఒక భరోసా. ఎల్‌ఐసీ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు పెద్దగా సంకోచించరు. దీనికి కారణం.. పెట్టుబడి రిస్క్ ఉండదు. పైగా, దీర్ఘకాలికంగా మంచి రాబడిని, జీవిత బీమా కవరేజీని అందిస్తాయి.
ఈ ప్రయోజనాలు మాత్రమే కాదు, ఎల్‌ఐసీ పాలసీపై రుణ సౌకర్యం కూడా లభిస్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో, బ్యాంకు నుంచి అధిక వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణం తీసుకునే బదులు, LIC నుంచి రుణం తీసుకోవడం ఉత్తమం. ఎల్‌ఐసీ పాలసీ మీ దగ్గర ఉంటే, ఆ బీమా కంపెనీ మీకు తప్పకుండా రుణం ఇస్తుంది. ఆ డబ్బుతో చదువులు, పెళ్లి, ఇల్లు, విదేశాలకు వెళ్లడం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి అవసరాలను తీర్చుకోవచ్చు.
LIC పాలసీపై రుణం ఎలా తీసుకోవాలి ?
మీ LIC పాలసీని తనఖా పెట్టుకుని జీవిత బీమా కంపెనీ మీకు లోన్ మంజూరు చేస్తుంది. అంటే, మీ బీమా పాలసీయే మీ రుణానికి గ్యారెంటీగా పని చేస్తుంది. దీనిని సురక్షిత రుణంగా (Secured loan) పరిగణిస్తుంది. కాబట్టి, ఎక్కువ జాప్యం లేకుండా లోన్ మంజూరవుతుంది. ఒక వ్యక్తి ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించగలిగితే ఓకే. లేకపోతే, అతని పాలసీ డబ్బు నుంచి రుణ మొత్తాన్ని ఎల్‌ఐసీ జమ చేసుకుంటుంది. అంటే, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు,
ఒకవేళ మీ దగ్గర ఎల్‌ఐసీ పాలసీ ఉంటే, దానిపై మీకు ఎంత రుణం లభిస్తుందనే సమాచారాన్ని LIC ఈ-సర్వీసెస్ (LIC e- Services) ద్వారా తెలుసుకోవచ్చు. లోన్ మంజూరు చేయడానికి, సంబంధిత పాలసీ బాండ్‌ను ఈ బీమా కంపెనీ తన వద్దే ఉంచుకుంటుంది. పాలసీ మెచ్యూరిటీ సమయానికి మీరు రుణాన్ని తిరిగి చెల్లించని పక్షంలో, పాలసీ డబ్బు నుంచి లోన్ అసలు + వడ్డీని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని పాలసీదారు ఖాతాకు క్రెడిట్ చేస్తుంది. లోన్ మొత్తాన్ని నగదు రూపంలో తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా, కొంతమంది ఈ మార్గాన్ని అనుసరిస్తుంటారు.
పాలసీపై ఎంత రుణం పొందవచ్చు?
పాలసీ మొత్తం సరెండర్ విలువలో 90 శాతం వరకు రుణంగా ప్రభుత్వ బీమా సంస్థ ఇస్తుంది. కొన్ని ప్రి-పెయిడ్ పథకాలపై ఈ పరిమితి 85 శాతం వరకు ఉంటుంది. ఎల్‌ఐసీ పాలసీని తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే, ఆ బీమా పాలసీని ప్రారంభించి కనీసం 3 సంవత్సరాలై ఉండాలి.
ఎల్‌ఐసీ రుణం కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ:
మొదట, ఎల్‌ఐసీ ఈ-సర్వీసెస్‌లో మీ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి.
ఆ తర్వాత, ఈ-సర్వీసెస్‌లోనే లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు సంబంధిత పత్రాలతో పాటు KYC ప్రక్రియను పూర్తి చేయాలి.
ఇప్పుడు మీరు అన్ని పత్రాలను LIC బ్రాంచ్‌కు పంపాలి.
దీని తర్వాత, 3 నుంచి 5 రోజుల్లో మీ లోన్‌కు ఆమోదం లభిస్తుంది.
ఎల్‌ఐసీ రుణం కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ:
LIC రుణం కోసం ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం, మీ పాలసీని కలిగి ఉన్న LIC బ్రాంచ్‌కు వెళ్లాలి. అక్కడ, రుణం దరఖాస్తు ఫారాన్ని నింపాలి. మీ పాలసీ బాండ్, ఇతర అవసరమైన పత్రాలను అక్కడి అధికారులకు సమర్పించాలి. ఇలా చేసిన 3 నుంచి 5 రోజుల్లో మీ లోన్ అప్లికేషన్‌కు ఆమోదం లభిస్తుంది.
ఇది కూడా చదవండి: పేటీఎం ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్ - వెల్‌కం బెనిఫిట్స్ సహా బోలెడన్ని రివార్డ్స్
SBI ATM Transaction Fees:ఎస్బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
IND vs NZ 3rd ODI: ఇండోర్ నీటితో టీమిండియాలో టెన్షన్ ? వాటర్ ప్యూరిఫయర్‌తో వచ్చిన శుభ్‌మన్ గిల్
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
Google Gemini AI టెక్నాలజీతో వస్తున్న తొలి EV.. 810 కి.మీ రేంజ్ Volvo EX60 లాంచింగ్ ఎప్పుడంటే..
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్