By: Arun Kumar Veera | Updated at : 06 Jun 2024 03:37 PM (IST)
పిల్లల కోసం ప్రత్యేకం ఈ పథకం
LIC Children Plan AmritBaal Policy Details In Telugu: ప్రస్తుతం, పిల్లల భవిష్యత్ కోసం చాలా రకాల పెట్టుబడి పథకాలు మార్కెట్‌లో ఉన్నాయి. అవన్నీ చిన్నారుల ఉన్నత చదువులకు, వివాహ ఖర్చులకు అండగా నిలుస్తున్నాయి. చిన్నారుల కోసం జీవిత బీమా పథకాలు (Life Insurance Schemes) కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే... వేగంగా మారుతున్న కాలంలో పిల్లలకు బీమా రక్షణ మాత్రమే సరిపోదు, అంతకుమించి ఉండాలి. అలాంటి ప్రత్యేక లక్షణాలతో కూడిన ఒక బీమా పాలసీని ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) అమలు చేస్తోంది.
LIC రన్ చేస్తున్న ఇన్సూరెన్స్ ప్లాన్ పేరు 'అమృత్‌బాల్' (AmritBaal Policy). ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఇది మార్కెట్‌లో లాంచ్ అయింది. పిల్లల భవిష్యత్ అవసరాలను బాగా అధ్యయనం చేసి, వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. దీనిని LIC ప్లాన్ నంబర్ 874 గాను (LIC Plan No 874) పిలుస్తారు. మీ సూపర్ కిడ్ ఉన్నత విద్య, ఇతర అవసరాలకు ఉపయోగపడే పెట్టుబడి కోసం ప్లాన్ చేస్తుంటే, LIC అమృత్‌బాల్ పథకం సరిగ్గా సూటవుతుంది. ఇందులో, చిన్నారులకు జీవిత బీమాతో పాటు, కచ్చితమైన రాబడికి హామీ (Guaranteed Return) కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌ను ఎంత త్వరగా తీసుకుంటే దీని రిటర్న్స్ అంత మెరుగ్గా ఉంటాయి.
ఏ వయస్సు పిల్లల కోసం తీసుకొచ్చిన పాలసీ ఇది?
టీనేజ్‌లోకి రాని పిల్లల కోసం ఈ పాలసీని ఎల్‌ఐసీ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకోవాలంటే పిల్లల వయస్సు కనిష్టంగా 30 రోజులు - గరిష్టంగా 13 సంవత్సరాలు ఉండాలి. పిల్లలకు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ఈ స్కీమ్ ముగుస్తుంది. అప్పుడు మంచి రాబడితో కలిపి డబ్బును వెనక్కు తీసుకోవచ్చు.
అమృత్‌బాల్ పాలసీలో 3 రకాల ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు ఉన్నాయి. అవి:
(1) 5 సంవత్సరాలు
(2) 6 సంవత్సరాలు
(3) 7 సంవత్సరాలు
మనీ బ్యాక్ ప్లాన్
పాలసీ కొన్న తర్వాత 10 సంవత్సరాలకు మించకుండా ప్రీమియం చెల్లిస్తారు. అంటే, ప్రీమియం చెల్లింపు గరిష్ట వ్యవధి పదేళ్లు. అన్నేళ్లు కట్టే ఓపిక లేదు, ఒకేసారి కట్టేస్తామంటే.. ప్రీమియం మొత్తాన్ని సింగిల్ పేమెంట్‌తో సెటిల్ చేయవచ్చు. ఇందుకోసం సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ (Single premium payment option) అందుబాటులో ఉంది. అమృత్‌బాల్ పాలసీ కింద కనీసం 2 లక్షల రూపాయల బీమా కవరేజ్ తీసుకోవాలి. 5వ సంవత్సరం లేదా 10వ సంవత్సరం లేదా 15వ సంవత్సరంలో మెచ్యూరిటీ సెటిల్‌మెంట్ ఉంటుంది. మనీ బ్యాక్ ప్లాన్‌లాగా దీనిని మార్చుకోవచ్చు.
గ్యారెంటీడ్ రిటర్న్
అమృత్‌బాల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కోసం చెల్లించే ప్రతి రూ.1000కి రూ.80 చొప్పున గ్యారెంటీడ్ రిటర్న్ పొందొచ్చు. ఈ 80 రూపాయలు బీమా పాలసీ మొత్తానికి యాడ్ అవుతుంది. మీ చిన్నారి పేరు మీద రూ.1 లక్ష బీమా తీసుకుంటే, ఆ మొత్తానికి ఎల్‌ఐసీ రూ.8000 జోడిస్తుంది. ఈ డబ్బు ప్రతి సంవత్సరం చివరిలో యాడ్ అవుతుంది. పాలసీ చెల్లుబాటులో ఉన్నంత వరకు ఈ రిటర్న్ అమృత్‌బాల్ పాలసీకి కలుస్తూనే ఉంటుంది. పాలసీ మెచ్యూరిటీ సమయంలో సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ రిటర్న్‌ను కలిపి LIC మీకు చెల్లిస్తుంది.
పాలసీ కొనుగోలుదారుకు 'సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్' ఆప్షన్ కూడా ఉంటుంది. కొంత ప్రీమియం అదనంగా చెల్లిస్తే ప్రీమియం రిటర్న్ రైడర్ కూడా వర్తిస్తుంది. ఈ రైడర్ వల్ల, ప్రీమియం రూపంలో కట్టిన డబ్బు (పన్నులు మినహా) తిరిగి వస్తుంది.
అమృత్‌బాల్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలి?
మీ దగ్గరలోని ఎల్‌ఐసీ ఏజెంట్ లేదా ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్లి ఈ పాలసీ కొనొచ్చు. లేదా, ఆన్‌లైన్‌లోనూ తీసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం:
Insurance Free-Look Period: బీమా పాలసీ ఫ్రీ-లుక్ పీరియడ్ నెల నుంచి సంవత్సరానికి పెంపు!- మీకు చాలా ప్రయోజనం
Stock Market Fall: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియో స్టాక్‌లో విధ్వంసం - రెండు రోజుల్లోనే రూ.1,600 కోట్ల నష్టం
Gold-Silver Prices Today 18 Feb: ఆగని పసిడి దూకుడు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
SBI JanNivesh SIP: SBI స్పెషల్ ఆఫర్ - కేవలం రూ.250తో మ్యూచువల్ ఫండ్ SIP, ఛార్జీలు రద్దు
IRCTC Travel Insurance: రైలు ఎక్కేటప్పుడు ప్రమాదంలో మరణిస్తే IRCTC పరిహారం ఇస్తుంది, అందరికీ కాదు!
YS Jagan: తన సామాజికవర్గం నుంచి వంశీ ఎదుగుతున్నాడనే అరెస్టు చేశారు - చంద్రబాబు, లోకేష్‌పై జగన్ ఆరోపణ
Revanth Reddy: సైబర్ నేరగాళ్లు ఒక్క ఏడాదిలో ఎన్ని వేల కోట్లు కొట్టేశారో తెలుసా? షీల్డ్ సమ్మిట్‌లో రేవంత్ రెడ్డి
Mazaka movie OTT: 'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?
Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్
BCCI Vs Team India: కుటుంబ సభ్యులను కలిసేందుకు టీమిండియా ప్లేయర్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ ఒక మెలిక పెట్టిన బీసీసీఐ