Latest Gold-Silver Prices Today: యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌కు ముందు డాలర్‌ ఇండెక్స్‌ కొద్దిగా బలహీనపడడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో పసిడి వెలుగు పెరిగింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,670 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 110 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 100 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 80 రూపాయల చొప్పున పెరిగాయి. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,350 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,380 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,00,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,350 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,380 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,00,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 77,840 ₹ 71,350 ₹ 58,380 ₹ 1,00,000
విజయవాడ ₹ 77,840 ₹ 71,350 ₹ 58,380 ₹ 1,00,000
విశాఖపట్నం ₹ 77,840 ₹ 71,350 ₹ 58,380 ₹ 1,00,000

 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,135 ₹ 7,784
ముంబయి ₹ 7,135 ₹ 7,784
పుణె ₹ 7,135 ₹ 7,784
దిల్లీ ₹ 7,150 ₹ 7,799
 జైపుర్‌ ₹ 7,150 ₹ 7,799
లఖ్‌నవూ ₹ 7,150 ₹ 7,799
కోల్‌కతా ₹ 7,135 ₹ 7,784
నాగ్‌పుర్‌ ₹ 7,135 ₹ 7,784
బెంగళూరు ₹ 7,135 ₹ 7,784
మైసూరు ₹ 7,135 ₹ 7,784
కేరళ ₹ 7,135 ₹ 7,784
భువనేశ్వర్‌ ₹ 7,135 ₹ 7,784

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,838 ₹ 7,387
షార్జా ‍‌(UAE) ₹ 6,838 ₹ 7,387
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,838 ₹ 7,387
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,948 ₹ 7,400
కువైట్‌ ₹ 6,682 ₹ 7,284
మలేసియా ₹ 6,900 ₹ 7,186
సింగపూర్‌ ₹ 6,826 ₹ 7,574
అమెరికా ₹ 6,624 ₹ 7,048

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 80 పెరిగి రూ. 25,550 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: డబ్బులు సంపాదించే ట్రిక్‌ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్‌ ఎవరూ మీకు చెప్పి ఉండరు!