Latest Gold-Silver Prices Today: ఈ వారంలో యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ ఉండడంతో, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ కొద్దిగా పుంజుకుంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,671 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో ‌24 కేరెట్ల బంగారం (బిస్కెట్‌ బంగారం), ‌22 &18 కేరెట్ల బంగారం (నగలు) ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి కూడా మార్పు లేకుండా కిలోకు లక్ష రూపాయల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,890 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,400 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,420 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,00,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,890 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,400 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,420 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,00,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 77,890 ₹ 71,400 ₹ 58,420 ₹ 1,00,000
విజయవాడ ₹ 77,890 ₹ 71,400 ₹ 58,420 ₹ 1,00,000
విశాఖపట్నం ₹ 77,890 ₹ 71,400 ₹ 58,420 ₹ 1,00,000

 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,140 ₹ 7,789
ముంబయి ₹ 7,140 ₹ 7,789
పుణె ₹ 7,140 ₹ 7,789
దిల్లీ ₹ 7,155 ₹ 7,804
 జైపుర్‌ ₹ 7,155 ₹ 7,804
లఖ్‌నవూ ₹ 7,155 ₹ 7,804
కోల్‌కతా ₹ 7,140 ₹ 7,789
నాగ్‌పుర్‌ ₹ 7,140 ₹ 7,789
బెంగళూరు ₹ 7,140 ₹ 7,789
మైసూరు ₹ 7,140 ₹ 7,789
కేరళ ₹ 7,140 ₹ 7,789
భువనేశ్వర్‌ ₹ 7,140 ₹ 7,789

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,858 ₹ 7,406
షార్జా ‍‌(UAE) ₹ 6,858 ₹ 7,406
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,858 ₹ 7,406
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,961 ₹ 7,413
కువైట్‌ ₹ 6,685 ₹ 7,291
మలేసియా ₹ 6,902 ₹ 7,187
సింగపూర్‌ ₹ 6,827 ₹ 7,575
అమెరికా ₹ 6,615 ₹ 7,039

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 110 తగ్గి రూ. 25,080 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: వందే భారత్ రైలు టిక్కెట్లను ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి?