Aadhaar Card Documents Uploading Online: ఆధార్‌ను కార్డ్ హోల్డర్లకు 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసేందుకు చివరి తేదీని (Last Date For Aadhaar Card Updating Online For Free) ఉడాయ్ పొడిగించింది. సరైన పత్రాలు ఉచితంగా అప్‌లోడ్ చేసి ఆధార్‌ను నవీకరించుకునేందుకు ప్రజలకు మరో 6 నెలల సమయం ఇచ్చింది. ఫలితంగా, మీరు మీ ఆధార్ కార్డ్‌లో ఫొటో, పేరు, చిరునామా వంటి వివరాలను ఉచితంగా మార్చాలనుకుంటే, దీని కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనవసరం లేదు, ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఫ్రీ అప్‌డేషన్ చివరి తేదీలు పలుమార్లు పెంపు
ఆధార్‌ను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును ఉడాయ్ (UIDAI extended free online document upload facility) పదే పదే పొడిగిస్తోంది. ఇంతకు ముందు చివరి తేదీ డిసెంబర్ 14, 2024 వరకు ఉంది, దానిని మరో ఆరు నెలల వరకు, అంటే 14 జూన్ 2025 వరకు పెంచింది. దీనికి ముందు కూడా చాలాసార్లు ఆధార్ ఉచిత నవీకరణ గడువును ఉడాయ్ పొడిగించింది. దీని వల్ల, దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డుదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా సులువుగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. మీరు కూడా మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, మీకు వచ్చే ఏడాది మధ్య వరకు, అంటే 14 జూన్ 2025 వరకు సమయం ఉంది.
ఆన్‌లైన్‌లో ఉచితంగా ఎలా అప్‌డేట్ చేయాలి?
-- ఉడాయ్ అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in లింక్ ద్వారా ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌లోకి వెళ్లండి.
-- మీ ఆధార్ నంబర్, క్యాప్చాను సంబంధిత గడుల్లో నింపి OTP కోసం రిక్వెస్ట్ చేయండి.
-- ఆధార్‌తో లింక్ అయిన మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని కూడా గడిలో నింపి లాగిన్ అవ్వండి.
-- ఇప్పుడు డాక్యుమెంట్ అప్‌డేట్ విభాగంలోకి వెళ్లి, అక్కడ ఉన్న వివరాలను ఓసారి చెక్ చేయండి.
-- డ్రాప్-డౌన్ మెను నుంచి తగిన డాక్యుమెంట్ రకాన్ని ఎంచుకోండి.
-- ధ్రువీకరణ కోసం, ఒరిజినల్ డాక్యుమెంట్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి.
-- సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌ను నోట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడితో ఈ పని పూర్తవుతుంది.
మీ ఆధార్ నవీకరణ అభ్యర్థన ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ మీకు సహాయపడుతుంది.
మరో ఆసక్తికర కథనం: నగలు కొనడానికి వెళ్తున్నారా?, - మీ ఏరియాలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ