By: Swarna Latha | Updated at : 19 May 2024 09:08 AM (IST)
election proof stocks, Election stocks ( Image Source : ABP Live AI )
Election Proof Stocks: సార్వత్రిక ఎన్నికలు 5వ దశకు చేరుకున్న వేల దాదాపు ఎన్నికలు చివరికి అంకానికి దగ్గరయ్యాయి. ఈ క్రమంలో దేశంలో ఎన్నికల ఫలితాలపై ఓటర్ల కంటే ఇన్వెస్టర్లు అధికంగా ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఏ రాజకీయ పార్టీ గెలుస్తుందనే ఆలోచనపై చాలా మంది పెట్టుబడిదారుల భవితవ్యం ప్రస్తుతం ఆధారపడి ఉంది. అనేక మంది ఇన్వెస్టర్లు తమ ఊహాగానాలకు అనుగుణంగా ఇప్పటికే ట్రేడ్స్ నిర్వహించారు.
ఫలితాలకు మరింతగా చేరువవుతున్న వేళ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను కాపాడుకునేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలో వారు కొన్ని రంగాల్లోని షేర్లపై దృష్టి సారించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దేశీయ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ ప్రకారం మెుదటగా బ్యాంకింగ్ రంగం ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలను స్థిరంగా ఉంచదగినదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ తిరిగి పుంజుకోవటంతో పాటు ఈసారి వర్షపాతం సాధారణంగా ఉంటుందనే అంచనాల మధ్య ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన ఐటీసీ, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, టైటాన్ వంటి కంపెనీల షేర్లు పెట్టుబడిదారుల సంపదను ఆవిరవటం నుంచి కాపాడటంతో తోడ్పడతాయని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది.
ఇక ఇదే సమయంలో రంగాల వారీగా బ్రోకరేజ్ ఎంపిక చేసిన వివిధ కంపెనీల షేర్ల జాబితాను పరిశీలిస్తే..
* ఎఫ్ఎంసీజీ- హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, జీసీపీఎల్, మ్యారికో, డాబర్, ఇమామీ, వరుణ్ బెవరేజెస్ ఉన్నాయి
* ఆటో- ఐషర్ మోటార్స్, హీరో మోటొకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఎంపికయ్యాయి.
* ఫార్మా, హాస్పిటల్- సన్, మ్యాక్స్ హెల్త్‌కేర్, లుపిన్, జూపిటర్ హాస్పిటల్స్ ఉన్నాయి
* ఐటీ సర్వీసెస్- టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, ఎల్ టిఐ మైండ్ ట్రీ, సయ్యంట్ నిలిచాయి
* ప్రైవేట్ బ్యాంక్స్- హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి
* క్యాపిటల్ గూడ్స్- సీమెన్స్, ఏబీబీ, హనీవెల్, ఇలాంటాస్ బెక్, టిమ్ కెన్, హిటాచీ ఎనర్జీ, జిఈ టి&డి
* కమోడిటీస్- హిందాల్కో
* కన్జూమర్ డ్యూరబుల్, టిలికాం- హావెల్స్ ఇండియా, ఎయిర్ టెల్, డెలివరీ కంపెనీలు ఎంపికయ్యాయి.
ఐటీ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న అస్థిర పరిస్థితులు తిరిగి పునరుద్ధరణకు చాలా కాలం పడుతున్న వేళ దీనిపై తక్కువ వెయిటేజ్ బ్రోకరేజ్ ఉంచింది. EDS, డేటా అనలిటిక్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సప్లై చైన్ వంటి విభాగాలు వృద్ధిని పెంచుతాయని భావిస్తోంది. ఇక గ్రామీణ డిమాండ్ మెరుగుపడటంతో ఆటోమెుబైల్ రంగం షేర్లపై అధిక వెయిటేజ్ కేటాయించింది. సాధారణ రుతుపవనాలతో ట్రాక్టర్లు, కార్లకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తూ వెయిచేజ్ పెంచబడింది. అలాగే ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు ఛార్జీలను పెంచనున్నట్లు వస్తున్న వార్తలతో ఎయిర్ టెల్ కంపెనీ ఆదాయాలపై సానుకూల ధోరణిని బ్రోకరేజ్ వ్యక్తం చేసింది. అలాగే JIO ప్లాట్‌ఫారమ్‌ల విభజన మీడియం టర్మ్‌లో కీలకమైన ట్రిగ్గర్ అవుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇక బ్రోకరేజ్ సంస్థ ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లపై తక్కువ వెయిటేడ్ కేటాయించింది.
Note: పైన అందించిన వివరాలు కేవలం బ్రోకరేజ్ అభిప్రాయం మాత్రమే. ఇది సమాచారం కోసం మాత్రమే అందించబడింది. దీనిని ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ వినియోగించకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, కరెన్సీ మార్కెట్లు, బాండ్స్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవటానికి ముందుగా ఆర్థిక నిపుణులతో చర్చించి ఇన్వెస్ట్ చేయటం ఉత్తమం.
Saving Ideas: రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్ చేసుకోండి
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Gold-Silver Prices Today 02 Nov: పండుగ తర్వాత పసిడి రేట్ల పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Holidays: ఈ నెలలో బ్యాంక్‌లు 12 రోజులు సెలవుల్లోనే ఉంటాయి, మీకేదైనా ముఖ్యమైన పని ఉందా?
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Upcoming Cars Bikes in November: నవంబర్‌లో లాంచ్ కానున్న కార్లు, బైక్‌లు ఇవే - రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి స్కోడా కైలాక్ వరకు!