search
×

Home Tax benefits: నిర్మాణంలో ఉన్న ఇంటిని కొని EMIలు కడుతుంటే, పన్ను మినహాయింపు వర్తిస్తుందా?

సెక్షన్‌ 24B కింద ఈ వడ్డీ మినహాయింపును మీరు పొందాలంటే, ఇంటి నిర్మాణం పూర్తవ్వాల్సిందే.

FOLLOW US: 
Share:

Home Tax benefits: పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు ఒక కల. ఆ కల నిజమైన వేళ ఏనుగు అంబారీ ఎక్కినంత ఆనందపడతారు. ఇల్లు చిన్నదైనా దానినే స్వర్గసీమలా భావిస్తారు. నిర్మాణం పూర్తయిన ఇల్లు లేదా అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ను కొనడానికి కొందరు మొగ్గు చూపితే, నిర్మాణంలో ఉన్నప్పుడే కొనడానికి మరికొందరు ఇష్టపడతారు. కట్టించే తలనొప్పులు వద్దు అనుకున్నవాళ్లు నిర్మాణం పూర్తయిన ఇంటిని కొంటారు. తమ అభిరుచికి తగ్గట్లుగా ఇల్లు ఉండాలి అనుకునేవాళ్లు నిర్మాణంలో ఉన్నవాటిని కొని తగిన మార్పులు చేసుకుంటారు. ఎవరి కారణాలు వాళ్లవి.

ఉద్యోగస్తుల్లో చాలా మంది, ఇంటి కోసం రుణం తీసుకుని ఆదాయ పన్ను భారం నుంచి తప్పించుకుంటుంటారు. ఎవరైనా సరే... బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుని, నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేస్తే, బ్యాంక్‌కు తిరిగి కట్టే అసలు మీద, వడ్డీ మీద విడివిడిగా ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. బ్యాంక్‌ రుణం మీద తిరిగి చెల్లించే అసలుపై సెక్షన్‌ 80C కింద రూ. 1.50 లక్షలు.. చెల్లించే వడ్డీపై సెక్షన్‌ 24B కింద రూ.2 లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మినహాయింపు పొందవచ్చు. 

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే ఏంటి పరిస్థితి?
ఒకవేళ మీరు బ్యాంక్‌ రుణం తీసుకుని నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ లేదా ఇంటిని కొనుగోలు చేస్తే వెంటనే పన్ను మినహాయింపు వర్తించదు. సదరు రుణం మీద EMI చెల్లింపు ఆ వెంటనే ప్రారంభినప్పటికీ, గృహ రుణం మీద తిరిగి చెల్లించే వడ్డీ మాత్రమే ఆ EMIలో ఉంటుంది, అసలు మొత్తంలో ఒక్క రూపాయి కూడా EMIలో ఉండదు. అంటే, మీరు ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ సమయంలో సెక్షన్‌ 80C కింద గృహ రుణం మినహయింపును పొందలేరు. 

అసలు కట్‌ కాకపోయినా EMI ద్వారా వడ్డీ కడుతూ వెళ్తారు కదా, దానిని కూడా మీరు వెంటనే క్లెయిం చేసుకోలేరు. సెక్షన్‌ 24B కింద ఈ వడ్డీ మినహాయింపును మీరు పొందాలంటే, ఇంటి నిర్మాణం పూర్తవ్వాల్సిందే. 

ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం పూర్తయి, సదరు ఆస్తిని మీరు స్వాధీనం చేసుకున్నట్లు ‘పొజెషన్‌ సర్టిఫికేట్‌’ పొందిన తర్వాత మాత్రమే రుణంలో అసలు మొత్తం EMI ద్వారా కట్‌ కావడం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మీరు సెక్షన్‌ 24B కింద వడ్డీని క్లెయిం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

చెల్లించిన వడ్డీ సంగతేంటి?
ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం ఎంతకాలం సాగితే అంతకాలం EMI రూపంలో మీరు వడ్డీని చెల్లిస్తూ వెళతారు. ఇలా కట్టిన వడ్డీని ఆ ఇంటి నిర్మాణం కంప్లీట్‌ అయిన తర్వాత, 5 సమ భాగాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మీ ఇంటికి ‘పొజెషన్‌ సర్టిఫికేట్‌’ పొందిన ఏడాది నుంచి 5 సంవత్సరాల వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్నప్పుడు చెల్లించిన వడ్డీని, నిర్మాణం పూర్తయిన తర్వాత చెల్లిస్తున్న వడ్డీని కలిపి మినహాయింపు పొందవచ్చు. అయితే, ఇక్కడో చిన్న మెలిక ఉంది. సెక్షన్‌ 24B కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు క్లెయిమ్‌ చేసుకోదగిన వడ్డీ మొత్తం రూ. 2 లక్షలకు మించకూడదు.

ఒక ఉదాహరణ రూపంలో ఇంకా వివరంగా దీనిని పరిశీలిద్దాం. ఒక వ్యక్తి నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొని, ఐదేళ్ల తర్వాత దానిని స్వాధీనం చేసుకున్నాడని భావిద్దాం. ఈ ఐదేళ్ల పాటు EMI రూపంలో రూ.6 లక్షల వడ్డీ చెల్లించాడని అనుకుందాం. ఇల్లు నిర్మాణంలో ఉంది కాబట్టి, ఐటీ రిటర్న్స్‌లో ఈ ఐదేళ్లలో ఆ వడ్డీని మినహాయింపుగా పొందలేడు. ఈ వడ్డీని ఐదు సమభాగాలుగా చేసి, ఇంటిని స్వాధీనం చేసుకున్న ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు ఆర్థిక సంవత్సారాల్లో క్లెయిం చేసుకోవచ్చు. అంటే, ఏడాదికి రూ.1.20 లక్షలు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అతను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల వడ్డీని చెల్లించాల్సి వస్తే... ఆ సంవత్సరంలో కట్టిన వడ్డీ మొత్తం రూ. 2.05 లక్షలు (రూ.85 వేలు + రూ.1.20 లక్షలు) అవుతుంది. సెక్షన్‌ 24B కింద రూ.2 లక్షలు మాత్రమే గరిష్ట పరిమితిగా ఉంది కాబట్టి ఆ మేరకు అతను క్లెయిమ్‌ చేసుకోవచ్చు, మిగిలిన 5 వేలకు మినహాయింపు వర్తించదు. 

కొత్త పన్ను చెల్లింపు విధానంలో ఇలాంటి మినహాయింపులు లేవు. పాత పన్ను చెల్లింపు విధానంలో మాత్రమే పన్ను మినహాయింపులు ఉన్నాయి.

Published at : 03 Feb 2023 01:51 PM (IST) Tags: Income Tax Home Tax benefits House loan Tax on under construction house. ITR

సంబంధిత కథనాలు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Gold-Silver Price 28 March 2023: కొద్దికొద్దిగా కొండ దిగుతున్న పసిడి, మళ్లీ ₹60 వేల దిగువకు రేటు

Gold-Silver Price 28 March 2023: కొద్దికొద్దిగా కొండ దిగుతున్న పసిడి, మళ్లీ ₹60 వేల దిగువకు రేటు

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Small Savings Schemes: మీకో గుడ్‌న్యూస్‌ - PPF, SSY వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్‌!

Small Savings Schemes: మీకో గుడ్‌న్యూస్‌ - PPF, SSY వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్‌!

Housing Sales: ఖరీదైన ఇళ్లే కావాలంటున్న జనం, ప్రీమియం గృహాలకు పెరిగిన డిమాండ్

Housing Sales: ఖరీదైన ఇళ్లే కావాలంటున్న జనం, ప్రీమియం గృహాలకు పెరిగిన డిమాండ్

టాప్ స్టోరీస్

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?