By: Arun Kumar Veera | Updated at : 05 May 2024 08:02 AM (IST)
ఈ వ్యక్తులు ఐటీఆర్-1 ఎంచుకోకూడదు
Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 (FY24) కోసం ఆదాయ పన్ను పత్రాలు సమర్పించే సీజన్ ఏప్రిల్ 01 నుంచి ప్రారంభమైంది, గత నెల రోజులుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి జులై 31 వరకు సమయం ఉంది. ఈ గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయాలంటే లేట్ ఫైన్ కట్టాలి.
ఆదాయ పన్ను పత్రాల సమర్పణ అనగానే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చేది ITR-1 ఫారం. మన దేశంలో, ఐటీ రిటర్న్ ఫైలింగ్ కోసం ఎక్కువ మంది ఎంచుకునే ఫామ్ ఇది. దీనిని సహజ్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా, జీతభత్యాల ద్వారా ఆదాయం సంపాదించేవాళ్లు దీనిని ఎంచుకుంటారు.
ఐటీఆర్-1 ఫారాన్ని ఫైల్ చేసేందుకు ఎవరు అర్హులు? (Who is eligible to file ITR-1 form?)
సాధారణ పన్ను చెల్లింపుదార్లు ITR-1 ఫారం ద్వారా తమ ఆదాయం, పన్ను బాధ్యతను ప్రకటిస్తారు. జీతం, డివిడెండ్, బ్యాంకు వడ్డీ, ఒక ఇంటి ఆస్తి, వ్యవసాయం ద్వారా రూ. 5000 మించని వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు (Individual Taxpayer), ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ ఫారాన్ని ఎంచుకోవాలి. వార్షిక ఆదాయం రూ. 50 లక్షలు మించని టాక్స్ పేయర్లు ఈ ఫామ్ ద్వారా పన్ను బాధ్యతను (Tax Liability) ప్రకటించవచ్చు.
ఐటీఆర్-1 ఫారం ఎవరి కోసం కాదు? (Who is not eligible to file ITR-1 form?)
- ఒక టాక్స్ పేయర్ 'పన్ను చెల్లించదగిన ఆదాయం' రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అతను ITR-1 ఫారం ద్వారా రిటర్న్ ఫైల్ చేయకూడదు.
- ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్, బంగారం, ఈక్విటీ షేర్లు, ఇతర వనరుల నుంచి ఆదాయాన్ని (Other Income Sources) ఆర్జిస్తే, అతను కూడా ITR-1 ఎంచుకోకూడదు.
- గుర్రపు పందాలు, లాటరీలు, చట్టబద్ధమైన జూదం వంటి ఆస్తి లేదా సేవల నుంచి ఒక వ్యక్తి ఆదాయం సంపాదిస్తే, ITR-1 ఫైల్ చేయడానికి అతను అర్హుడు కాదు.
- ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల ద్వారా ఆదాయం (Income from house property) వస్తుంటే, అతను కూడా ITR-1 ఫైల్ చేయలేడు.
- NRI (Non-Resident Indian) కూడా ITR-1 ఫైల్ చేయడానికి అర్హుడు కాదు.
- బ్యాంక్ నుంచి నగదు విత్‌డ్రా చేస్తున్నప్పుడు, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 194N ప్రకారం TDS (Tax Deducted at Source) కట్ అయితే, అలాంటి టాక్స్ పేయర్ ITR-1 ఫామ్ ఉపయోగించకూడదు.
- సంస్థలు/కంపెనీలు కూడా ITR-1 ముట్టుకోకూడదు.
అర్హత లేనప్పటికీ ITR-1 ఫైల్ చేస్తే ఏమవుతుంది?
ITR-1 ఫైల్ చేయడానికి అర్హత లేని వ్యక్తి పొరపాటున అదే ఫారం ద్వారా తన ఆదాయ వివరాలు ప్రకటిస్తే, ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసు (Income Tax Department Notice) రావచ్చు. అయితే, భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు ఫారం ఫైల్ చేశారని మాత్రమే ఆ నోటీసులో ఉంటుంది. అప్పుడు, IT నోటీసు అందిన తేదీ నుంచి 15 రోజుల లోపు మళ్లీ సరైన ఫారాన్ని దాఖలు చేయాలి. ఇలా చేయకపోతే, మొదట పంపిన ITR చెల్లకుండా పోతుంది. ఆ టాక్స్‌పేయర్ ఐటీఆర్ ఫైల్ చేయనట్లుగానే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ భావిస్తుంది. పన్ను చెల్లించదగిన ఆదాయం ఉండి కూడా ఐటీఆర్ ఫైల్ చేయనందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: ఇలాంటి జాబ్ అప్లికేషన్ ఎక్కడా చూసుండరు, ఉద్యోగం ఇస్తే డబ్బులు ఎదురిస్తాడట
RBI TRAI SMS : 127000 నంబర్ నుంచి ఏదైనా SMS వచ్చిందా! ఇంతకీ ఈ మెసేజ్ ఎవరు పంపుతున్నారు ?
Year Ender 2025: ఈ ఏడాదిలో RBI ఎప్పుడెప్పుడు రెపో రేటు తగ్గించింది? ప్రజలకు ఎలా ఉపశమనం కలిగించింది?
SIP Benefits : కేవలం రూ. 2000 SIPతో 5 కోట్ల రూపాయల భారీ కార్పస్‌ను ఎలా తయారు చేయాలి? ఏ ఫండ్ మంచి రాబడి ఇస్తోంది?
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Lost Phone Tracking:ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీ అయినా ఈ విధంగా ట్రాక్ చేయండి! మొత్తం ప్రక్రియ తెలుసుకోండి!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు