search
×

ITR 2024: ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌ కోసం 7 రకాల ఫారాలు - మీరు ఏ ఫామ్‌ సమర్పిస్తారు?

ITR Filing 2024: ఒక వ్యక్తి/సంస్థ ఆదాయ వనరులు, గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం, పెట్టుబడులు, విభాగం వంటి అంశాల ఆధారంగా ITR-1 నుంచి ITR-7 మధ్య సరైన ఫారాన్ని ఎంచుకోవాలి.

FOLLOW US: 
Share:

Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 లేదా మదింపు సంవత్సరం 2024-25 కోసం ఆదాయ పన్ను పత్రాలు సమర్పించడం 01 ఏప్రిల్‌ 2024 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది మంది ఐటీ రిటర్న్స్‌ సమర్పించారు, కోట్లాది మంది అదే పని మీద ఉన్నారు. 

ఐటీ రిటర్న్‌ అనగానే చాలామందికి ఐటీఆర్‌-1 (ITR-1‌) మాత్రమే గుర్తుకొస్తుంది. వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు (HUFs) దీనిని సబ్మిట్‌ చేయవచ్చు. అయితే.. ITR-1తో పాటు  ITR-2, ITR-3,  ITR-4, ITR-5, ITR-6, ITR-7ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫై చేసింది. ఇవన్నీ ఇన్‌కమ్‌ టాక్స్‌ పోర్టల్‌లో (Income Tax Portal) ఫిబ్రవరి నుంచే అందుబాటులో ఉన్నాయి. టాక్స్‌ పేయర్‌ (Taxpayer) తన IT రిటర్న్‌ ఎంత త్వరగా సమర్పిస్తే, అతనికి రిఫండ్‌ (ఒకవేళ అర్హుడైతే) అంత త్వరగా బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుంది.

మన దేశంలో, నిర్దిష్ట పరిమితికి మించిన డబ్బు సంపాదనపై ప్రతి వ్యక్తి/సంస్థ ఆదాయ పన్ను కట్టాల్సిందే. ఒక వ్యక్తి/సంస్థ ఆదాయ వనరులు, గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం, పెట్టుబడులు, విభాగం వంటి అంశాల ఆధారంగా ITR-1 నుంచి ITR-7 మధ్య సరైన ఫారాన్ని ఎంచుకోవాలి.

ఎవరు ఏ ఐటీ ఫారాన్ని సబ్మిట్‌ చేయాలి?

ITR-1: దీనిని "సహజ్‌" అని కూడా పిలుస్తారు. భారతదేశంలో నివశించే వ్యక్తి (Individual‌) మొత్తం ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే, అతను ITR-1 ద్వారా పన్ను పత్రాలు సమర్పించాలి. తీసుకున్న జీతం, ఒక నివాస గృహం ఆదాయం, ఇతర ఆదాయాలు, రూ. 5,000 వరకు వ్యవసాయ ఆదాయం వంటివి ITR 1 కింద పన్ను చెల్లింపుదారు ఆదాయంలో కలిసి ఉంటాయి.

ITR-2: ఒక వ్యకి లేదా హిందు అవిభాజ్య కుటుంబానికి (HUF) వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు ఆర్జించని పక్షంలో ఈ ఫామ్‌ ఉపయోగించాలి. నాన్ రెసిడెంట్స్‌, సాధారణ నివాసితులకు ఈ ఫారం వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు, కంపెనీల డైరెక్టర్లు, లిస్ట్‌ కాని కంపెనీల్లో పెట్టుబడి పెట్టేవాళ్లు, జీతగాళ్లు, ఒకటి కంటే ఎక్కువ నివాస గృహాల నుంచి ఆదాయం పొందే వ్యక్తులు, మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు ఈ ఫామ్‌ ఎంచుకోవాలి. భారతదేశం వెలుపల ఉన్న ఆస్తులు లేదా సంపాదన ఉన్న వ్యక్తులకు కూడా ఈ ఫారం వర్తిస్తుంది.

ITR-3: వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు, ఆదాయం కలిగిన వ్యక్తి లేదా HUF ఈ ఫామ్‌ ఎంచుకోవాలి.

ITR-4: ఈ ఫారాన్ని "సుగమ్‌" అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తి, HUF, సంస్థ (LLP మినహాయించి) మొత్తం ఆదాయం 50 లక్షల రూపాయల కంటే తక్కువ ఉండి; వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆదాయ పన్ను చట్టంలోని 44AD, 44ADA లేదా 44AE సెక్షన్ల ప్రకారం లెక్కించాల్సి వస్తే, ఆ సందర్భంలో ITR-4 ఎంచుకోవాలి. 

ITR-5: ఒక వ్యక్తి, HUF, కంపెనీ కాకుండా, ITR-7 దాఖలు చేసే వారికి ఇది వర్తిస్తుంది.

ITR-6: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 11 కింద మినహాయింపును క్లెయిమ్ చేయని సంస్థలు ఈ ఫారాన్ని ఉపయోగించాలి.

ITR-7: ఆదాయపు పన్ను చట్టంలోని 139(4A), 139(4B), 139(4C), లేదా 139(4D) సెక్షన్ల కింద రిటర్న్‌లు ఫైల్ చేసే సంస్థలు ITR-7 ఎంచుకోవాలి. ధార్మిక లేదా మతపరమైన ట్రస్ట్‌, రాజకీయ పార్టీ, శాస్త్రీయ పరిశోధన సంఘం, వార్తా సంస్థ, ఆసుపత్రి, ట్రేడ్ యూనియన్‌, విశ్వవిద్యాలయం, కళాశాల, ఏదైనా NGO వంటివి ఈ పరిధిలోకి వస్తాయి.

ఎవరైనా కావాలని లేదా పొరపాటున తప్పుడు ఫారం ద్వారా రిటర్న్‌ ఫైల్‌ చేస్తే, ఆదాయ పన్ను విభాగం ఆ ఫారాన్ని తిరిస్కరిస్తుంది. అప్పుడు, 15 రోజుల్లోగా సరైన ఫారం ద్వారా రిటర్న్‌ సమర్పించాలి. 

మరో ఆసక్తికర కథనం: ఈ బ్యాంక్‌ ఆఫర్ల ముందు పీపీఎఫ్‌ వడ్డీ రేటు కూడా దిగదుడుపే!

Published at : 30 Apr 2024 04:24 PM (IST) Tags: ITR Filing Income Tax Return New Tax Regime 2024 Old Tax Regime

ఇవి కూడా చూడండి

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Government Scheme: వృద్ధాప్యంలో రూ.5 వేలు పెన్షన్ - రోజుకు కేవలం 7 రూపాయలతో సాధ్యం

Government Scheme: వృద్ధాప్యంలో రూ.5 వేలు పెన్షన్ - రోజుకు కేవలం 7 రూపాయలతో సాధ్యం

టాప్ స్టోరీస్

AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌

Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌

Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు

Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు

Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ

Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ