By: ABP Desam | Updated at : 26 Dec 2022 01:13 PM (IST)
Edited By: Arunmali
ఆదాయ పన్ను భారాన్ని తగ్గించే 5 అత్యుత్తమ మార్గాలు
Income tax Saving: మన ఆర్థిక ప్రణాళిక సరిగా ఉండాలంటే, ఆదాయ పన్ను రూపంలో చెల్లించే డబ్బును ఆదా చేయడం చాలా ముఖ్యం. చక్కటి ప్రణాళికతో పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు, భారీ మొత్తంలో డబ్బును మిగుల్చుకోవచ్చు. తద్వారా ఆర్థిక లక్ష్యాలను సాధించడం వేగవంతం, సులభం అవుతుంది.
పన్ను భారాన్ని తగ్గించుకోవడంతో పాటు, అదనపు ఆర్థిక ప్రయోజనాలను అందుకునేందుకు సహాయపడే టాప్ టాక్స్ సేవింగ్ ఆప్షన్స్, స్ట్రాటెజీలు ఇవి:
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident fund)
ఆదాయ పన్ను ఆదా కోసం ఎక్కువ మంది ఫాలో అవుతున్న వ్యూహం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం. పన్ను ఆదాతో పాటు దీర్ఘకాలిక పొదుపుగానూ ఉపయోగపడే స్కీమ్ ఇది. పోస్ట్ ఆఫీస్, ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకుల ద్వారా మీరు PPF ఖాతా ప్రారంభించవచ్చు. PPF ఖాతాలో పెట్టే పెట్టుబడి మీద హామీతో కూడిన వడ్డీ రేటు లభిస్తుంది. ఈ డిపాజిట్లకు, సెక్షన్ 80C కింద ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు లభిస్తుంది.
2. ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit)
ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, ఆదాయపు పన్ను చట్టం- 1961లోని సెక్షన్ 80C ప్రకారం మీరు పన్ను భారం తగ్గించుకోవచ్చు. టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడుల రూపంలో ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. 1.5 లక్షల వరకు మీరు తగ్గించి చూపవచ్చు. సాధారణంగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు 5.5%-7.75% మధ్య ఉంటాయి. అంటే, పన్ను తగ్గింపు + ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద వడ్డీ, రెండూ కలిసి వస్తాయి.
3. సీనియర్ సిటిజన్ పొదుపు పథకం (Senior citizen savings scheme)
60 ఏళ్లు పైబడిన వారి కోసం డిజైన్ చేసిన ప్రభుత్వ ప్రాయోజిత పొదుపు పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని ఈ స్కీమ్ అందిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 80C ప్రకారం... SCSS ఖాతాల్లో చేసిన డిపాజిట్ల మీద గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు ఉంటుంది. ఈ మినహాయింపు ప్రస్తుత పన్ను విధానంలో మాత్రమే వర్తిస్తుంది.
4. జీవిత బీమా (Life Insurance)
ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం జీవిత బీమా పథకం. పాలసీదారుకి అకాల మరణం సంభవించినప్పుడు, ఆ కుటుంబానికి ఇది ఆర్థిక రక్షణ అందిస్తుంది. సాంప్రదాయ (ఎండోమెంట్) లేదా మార్కెట్ లింక్డ్ (ULIP - యులిప్) రూపాల్లోని జీవిత బీమా పథకాల కోసం చెల్లించిన ప్రీమియంల మీద పాలసీదార్లకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. మీ పన్నును ఆదా చేసే అనేక బీమా పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
5. పెన్షన్ పథకాలు (Pension plans)
పెన్షన్ ప్లాన్స్ జీవిత బీమాకి మరొక రూపంగా చెప్పుకోవచ్చు. వృద్ధాప్య జీవితానికి ఇవి రక్షణ పథకాలు. ఇవి కూడా ప్రత్యేక ప్రయోజనం కోసం ఉద్దేశించిన స్కీమ్స్. పథకం కొన్న వ్యక్తికి, అతని జీవిత భాగస్వామికి ఆర్థిక భరోసా అందించడం పెన్షన్ ప్లాన్స్ లక్ష్యం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80CCC (సెక్షన్ 80Cకి సబ్ సెక్షన్) పెన్షన్ డిపాజిట్లను కవర్ చేస్తుంది. ఈ స్కీమ్స్ కోసం కట్టే డబ్బుకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది.
సెక్షన్ 80Cలోని అన్ని సబ్ సెక్షన్‌ల కింద అనుమతించిన గరిష్ట మినహాయింపు రూ. 1.5 లక్షలు. మినహాయింపు కోరే మొత్తం దీని కంటే ఎక్కువైతే, ఆ ఎక్కువైన ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది.
Latest Gold-Silver Prices Today 02 December 2023: ఆల్-టైమ్ హై రేంజ్లో గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Prices Today 02 December 2023: పసిడి ప్రియులకు ఝలక్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Deadlines in December: ఈ నెలలో ముగిసే బ్యాంక్ స్పెషల్ ఆఫర్లు, పూర్తి చేయాల్సిన పనులు - వీటిని మిస్ కావద్దు
Latest Gold-Silver Prices Today 01 December 2023: మళ్లీ పెరిగిన పసిడి వెలుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
LPG Cylinder Price Today: అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్పీజీ సిలిండర్ మరింత భారం
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>