Highest Interest Rates On Savings Account: భారతీయుల్లో పొదుపు అనే అలవాటు తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. బ్యాంకింగ్‌ సౌకర్యాలు అందుబాటులో లేని సమయంలో ఈ పొదుపులు పోపుల పెట్టెల్లో ఉండేవి. బ్యాంకింగ్‌ ఫెసిలిటీస్‌ విస్తరించిన ఈ కాలంలో, పొదుపులు పోపుల పెట్టెల నుంచి బ్యాంక్‌ ఖాతాల్లోకి మారాయి. ప్రస్తుతం, భారతదేశంలోని ప్రభుత్వ రంగ & ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల పొదుపు ఖాతా సేవలను అందిస్తున్నాయి. అయితే, సాధారణంగా పొదుపు ఖాతాలపై బ్యాంక్‌లు ఇచ్చే వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. డిపాజిట్లను ఆకర్షించడానికి కొన్ని బ్యాంక్‌లు మాత్రం అధిక వడ్డీ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి.


ప్రస్తుతం, పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు సంవత్సరానికి 2.60 శాతం నుంచి 8 శాతం వరకు ఉన్నాయి. ఖాతాలో నిర్వహించే నగదు నిల్వపై ఆధారపడి ఈ రేట్లు మారతాయి.


మీరు కూడా బ్యాంక్‌ సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, ముందుగా ఏ బ్యాంక్‌ పొదుపు ఖాతాపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకోవడం లాభదాయకం. ఖాతాను తెరిచే ముందే, ఆ పొదుపు ఖాతా వడ్డీ రేటుతో పాటు ఖాతా లక్షణాలను (ఫీచర్లు) కూడా అర్థం చేసుకోండి. చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను, మరికొన్ని బ్యాంక్‌లు ఆకర్షణీయమైన రేట్లను అందిస్తున్నాయి.


దేశంలోని అగ్ర బ్యాంకుల పొదుపు ఖాతాలపై తాజా వడ్డీ రేట్లు:


రూ. 1 లక్ష వరకు పొదుపుపై ​​అత్యధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకుల జాబితా:


RBL బ్యాంక్‌  ---  సంవత్సరానికి 4.25 శాతం
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌  ---  సంవత్సరానికి 4.00 శాతం
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌  --- సంవత్సరానికి 4.00 శాతం
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌  ---  సంవత్సరానికి 3.51 శాతం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌  ---  సంవత్సరానికి 3.50 శాతం వడ్డీ
యెస్‌ బ్యాంక్  ---  సంవత్సరానికి 3.00 శాతం
ఇండస్ఇండ్ బ్యాంక్  ---  సంవత్సరానికి 3.50 శాతం
EAAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌  ---  సంవత్సరానికి 3.50 శాతం
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌  ---  సంవత్సరానికి 3.00 శాతం
IDFC ఫస్ట్ బ్యాంక్‌  ---  సంవత్సరానికి 3.00 శాతం


పొదుపు ఖాతాలో రూ. 1 లక్ష - రూ. 5 లక్షల మధ్య డిపాజిట్లపై వడ్డీ రేట్లు:


చాలా బ్యాంకులు, సేవింగ్స్‌ అకౌంట్లలో రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు డిపాజిట్లపై పోటీ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. 


ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  ---   సంవత్సరానికి 7.11 శాతం (రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు బ్యాలెన్స్‌పై)
DBS బ్యాంక్  ---  సంవత్సరానికి 7.00 శాతం (రూ. 4 నుంచి 5 లక్షల వరకు బ్యాలెన్స్‌పై)
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  ---  సంవత్సరానికి 6.25 శాతం
బంధన్ బ్యాంక్  ---  సంవత్సరానికి 6.00 శాతం వడ్డీ
RBL బ్యాంక్  ---  సంవత్సరానికి 5.50 శాతం (రూ. 1 లక్ష నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాలెన్స్‌పై)
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  ---  సంవత్సరానికి 5.00 శాతం
ఉజ్వల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  ---  సంవత్సరానికి 5.00 శాతం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  ---  సంవత్సరానికి 5.00 శాతం (రూ. 1 లక్ష నుంచి  రూ. 5 లక్షల వరకు బ్యాలెన్స్‌పై)
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  ---   సంవత్సరానికి 5.00 శాతం
యెస్‌ బ్యాంక్  ---  సంవత్సరానికి 4.00 శాతం


ఇది, 11 సెప్టెంబర్ 2024 వరకు ఉన్న డేటా. సేవింగ్స్‌ అకౌంట్స్‌పై వడ్డీ రేట్లను బ్యాంక్‌లు కాలానుగుణంగా సమీక్షిస్తుంటాయి. కాబట్టి, ఈ రేట్లలో కొన్ని మార్పులు ఉండొచ్చు.


భారతదేశంలోని ఏ బ్యాంకులోనైనా, రూ. 5 లక్షల వరకు డిపాజిట్లకు "డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్" (DICGC) ద్వారా బీమా రక్షణ ఉంటుంది. బ్యాంక్‌ మూతబడితే, ఖాతాదారుడి డబ్బుకు రూ. 5 లక్షల వరకు రక్షణ ఉంటుంది. 


మరో ఆసక్తికర కథనం: రిస్క్‌ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్‌ ఆప్షన్‌ దొరకవు!