ITR For Freelancers: జీతం తీసుకునే టాక్స్‌ పేయర్ల (salaried taxpayers) ITR ఫైలింగ్‌ పని చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇలాంటి వాళ్ల విషయంలో పెద్దగా తలనొప్పులు ఉండవు. ఇటీవలి సంవత్సరాల్లో, రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా ఫ్రీలాన్సర్స్‌ లేదా కన్సల్టెంట్స్‌గా పని చేస్తున్న వాళ్ల సంఖ్య పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాళ్ల ITR దాఖలు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది.


స్టాండర్డ్ డిడక్షన్ ఎలిజిబిలిటీ ఉండదు 
ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్‌.. శాలరీడ్‌ టాక్స్‌పేయర్‌లా ITR-1 లేదా ITR-2 ఫైల్ చేయలేడు. అతని ఆదాయం జీతం నుంచి రాదు కాబట్టి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్‌ పొందలేడు. 


ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలి?
వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ & రేట్‌ ఇక్కడ కీలక విషయం. ఫ్రీలాన్సర్‌ లేదా కన్సల్టెంట్‌గా ఏడాది పొడవునా సంపాదించిన మొత్తాన్ని బట్టి స్లాబ్ స్టిస్టమ్‌ డిసైడ్‌ అవుతుంది, దానికి అనుగుణంగా పన్ను రేటు వర్తిస్తుంది. జీతం తీసుకునే వ్యక్తుల్లా ప్రతి సంవత్సరం ఇష్టమైన పన్ను విధానాన్ని (Tax Regime) ఎంచుకోలేరు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి, అంటే ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరానికి పాత పన్ను విధానం డిఫాల్ట్‌ ఆప్షన్‌గా ఉంది. ఈ కేటగిరీ వ్యక్తులు కొత్త పన్ను విధానాన్ని కూడా ఎంచుకోవచ్చు. అయితే, ఒకసారి కొత్త విధానంలోకి మారిన తర్వాత, ఇక దానిని మార్చుకునే అవకాశం ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా ఉండబోతోంది.


ప్రిజమ్టివ్‌ టాక్సేషన్‌ స్కీమ్‌
ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్‌లు ఊహాజనిత పన్నుల పథకాన్ని (Presumptive Taxation Scheme) ఎంచుకునే ఆప్షన్‌ పొందుతారు. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం సంపాదించే వాళ్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ చట్టంలోని సెక్షన్ 44ADA ప్రకారం ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. 2022-23లో రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందని నిపుణులకు మాత్రమే ఇది వరిస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఇది రూ.75 లక్షలకు పెరుగుతుంది. ఈ స్కీమ్‌ అర్హత ఉంటే, మొత్తం రిసిప్ట్స్‌లో 50% వ్యాపార ఆదాయంగా చూపించొచ్చు, దాని ప్రకారం టాక్స్‌ కడితే చాలు.


కన్సల్టెంట్ ఆదాయం రూ.50 లక్షల కంటే ఎక్కువ ఉంటే, సెక్షన్‌ 44AD కింద ఈ స్కీమ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో మొత్తం కలెక్షన్స్‌ పరిమితి ప్రస్తుతం రూ.2 కోట్లు కాగా, వచ్చే ఏడాది నుంచి రూ.3 కోట్లకు పెంచనున్నారు. అయితే, కమీషన్, బ్రోకరేజ్, ఏజెన్సీ వ్యాపారం నుంచి ఆదాయం వస్తుంటే ఈ ప్రయోజనం పొందలేరు.


ఏ ITR ఫామ్‌ ఎంచుకోవాలి?
వృత్తిపరమైన ఆదాయం ఉన్న కన్సల్టెంట్లు ITR-3 ఫామ్‌ నింపాలి. ప్రిజమ్టివ్‌ టాక్సేషన్‌ స్కీమ్‌ ఎంచుకుంటే, ITR-4 నింపాలి. రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే, లేదా నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే ITR-3 ఫారాన్ని మాత్రమే ఎంచుకోవాలి. 


ఫ్రీలాన్సర్‌కు ITR ఫైలింగ్‌ గడువు ఎప్పుడు?
సాధారణ పన్ను చెల్లింపుదార్ల తరహాలోనే కన్సల్టెంట్‌లు, ఫ్రీలాన్సర్‌లు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు 31 జులై 2023. అయితే, ఆ కన్సల్టెంట్ సెక్షన్ 44AB కింద ఆడిట్ పరిధిలోకి వస్తే, అప్పుడు గడువు 31 అక్టోబర్ 2023కు మారుతుంది. 


మరో ఆసక్తికర కథనం: బీలెటెడ్‌ ఐటీఆర్‌ వల్ల మిస్సయ్యే బెనిఫిట్స్‌ గురించి తెలిస్తే ఎవరూ ఆలస్యం చెయ్యరు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial