By: Rama Krishna Paladi | Updated at : 28 Jul 2023 01:00 PM (IST)
ఆదాయపన్ను నోటీసులు ( Image Source : Freepik )
Income Tax:
ఆదాయపన్ను శాఖ నోటీసులు అనగానే చాలా మంది జంకుతారు! ఎందుకు పంపించారు? ఏ సమాచారం అడుగుతున్నారు? ఎంత గడువు ఇచ్చారు? ఇలాంటివేమీ తెలుసుకోకుండానే ఆందోళన చెందుతారు. కొందరైతే తమను జైల్లో పెడతారేమోనని భయపడుతుంటారు. ఆంధ్రా, తెలంగాణలో రీసెంటుగా వందల మందికి ఇలాంటి నోటీసులు రావడం కలకలం సృష్టించింది. అందుకే అసలు నోటీసులు వస్తే ఏం చేయాలి? ఎలా సరిదిద్దుకోవాలో మీకోసం!
ఆదాయపన్ను శాఖ (IT Department) నుంచి నోటీసులు రాగానే ముందు చేయాల్సిన పని ఒకటుంది! అదే ఆ నోటీసులు క్షుణ్ణంగా చదవి అర్థం చేసుకోవడం. ఆదాయపన్ను చట్టంలోని (Income Tax Act) వివిధ సెక్షన్లను అనుసరించి ఐటీ శాఖ నోటీసులు పంపిస్తుంది. ఇందులో అదనపు పత్రాలు సమర్పించడం నుంచి రీఆడిటింగ్ వరకు ఉంటాయి. అందుకే ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చిందంటే మీరు తప్పు చేసిన్టటేమీ కాదు. రొటీన్ కమ్యూనికేషన్ కూడా అవ్వొచ్చు. ఏదేమైనా నోటీసులు సకాలంలో సరిగ్గా స్పందించడం ముఖ్యం. ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోతే అనవసరంగా సమస్య పెద్దది చేసుకున్నట్టు అవుతుంది. దాంతో మీరు జరిమానా, అదనపు పన్నులు, వడ్డీలు చెల్లించాల్సి రావొచ్చే. కొన్నిసార్లు జైలు శిక్షకు గురవుతారు.
ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు (IT Notices) వచ్చాయ మీరు అర్థం చేసుకోండి. అందులోని నిర్దేశించిన గడువులోపే స్పందించండి. విషయం అర్థమవ్వకపోతే నిపుణులను సంప్రదించండి. అడిగిన అంశానికి సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. ఐటీఆర్ ఫైలింగు (ITR Filing) పొరపాటుపై నోటీసు వస్తే సరిదిద్దుకోవడానికి ఇదే అవకాశంగా గుర్తించండి. గడువు తీరితే ఐటీ శాఖకు అప్పీల్ చేసుకోండి.
ఐటీ శాఖ చాలా అంశాలపై నోటీసులు పంపిస్తుంటుంది. టాక్స్ రిటర్నుకు సంబంధించి మరింత సమాచారం అడగొచ్చు. మీ టాక్స్ రిటర్ను ఆడిట్ కోసం నోటీసు ఇవ్వొచ్చు. నిబంధనలను ఉల్లంఘించినట్టు భావిస్తే పెనాల్టీ నోటీసులు వస్తాయి. మీరు ఒకవేళ కట్టాల్సిన దానికన్నా తక్కువ పన్ను చెల్లిస్తే అదనపు పన్నులు చెల్లించాల్సిందిగా ఐటీ శాఖ కోరుతుంది. చెల్లించని మొత్తానికి వడ్డీలు కోరుతుంది. కొన్ని కేసుల్లో మాత్రం క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుంది.
Troubles in Filing ITR: మీరు ఇప్పటికీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఆదాయ పన్ను లెక్కలు సబ్మిట్ చేయడానికి కేవలం కొన్ని రోజులు సమయం మాత్రమే మిగిలుంది. ప్రస్తుత సీజన్‌లో ఐటీఆర్ ఫైలింగ్ గడువు (ITR Filing Deadline) 31 జులై 2023తో ముగుస్తుంది. ఈలోగా మీరు టాక్స్ రిటర్న్ ఫైల్ చేయకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Revised ITR Filing: ప్రస్తుతం, ఇన్‌టాక్స్ రూల్స్ కఠినంగా ఉన్నాయి. టాక్స్ పేయర్ తన పన్ను బాధ్యత నుంచి తప్పించుకోకుండా, తప్పుడు క్లెయిమ్స్ చేయకుండా ఐటీ డిపార్ట్‌మెంట్ చాలా గట్టి చర్యలు తీసుకుంటోంది. అలాగే, డిపార్ట్‌మెంట్ నుంచి రావలసిన రిఫండ్ తక్కువగా వచ్చినా, దానిపై అప్పీల్ చేయడానికి కూడా అనుమతి ఇస్తోంది. దీనికి సంబంధించి ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లో రూల్ ఉంది.
Also Read: టాప్ 10 ఐటీ కంపెనీలు - 3 నెలల్లో 21,327కు పడిపోయిన ఉద్యోగుల సంఖ్య!
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
NTPC Green Energy IPO: ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్ చేయండి
Money Saving: జీతం నుంచి నెలవారీ సేవింగ్ - ఈ 7 పద్ధతులు పాటిస్తే మీరే 'కింగ్'
Share Market Today: స్టాక్ మార్కెట్‌లో బుల్ పరేడ్ - సెన్సెక్స్ 1300 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు హైజంప్
Gold-Silver Prices Today 25 Nov: ఏకంగా రూ.1000 తగ్గిన పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్ రంగనాథ్ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్‌లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్‌తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ